మినీ రివ్యూ:  “మోడర్న్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి” డాక్యుమెంటరీ హైలెట్స్, మైనస్ లు
x

మినీ రివ్యూ: “మోడర్న్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి” డాక్యుమెంటరీ హైలెట్స్, మైనస్ లు

సెన్సేషన్‌, సక్సెస్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న రాజమౌళి పై నెట్ ప్లిక్స్ వాళ్లు డాక్యుమెంటరీ తీయటం మనందరికీ ఆనందం కలిగించేదే. ఈ డాక్యుమెంటరీని “మోడర్న్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి”

సెన్సేషన్‌, సక్సెస్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న రాజమౌళి పై నెట్ ప్లిక్స్ వాళ్లు డాక్యుమెంటరీ తీయటం మనందరికీ ఆనందం కలిగించేదే. ఈ డాక్యుమెంటరీని “మోడర్న్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి” (Modern Masters – SS Rajamouli) పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. రాజ‌మౌళి జీవితంలోని విశేషాల‌తో రూపొందించిన ఈ డాక్యు సిరీస్ కోసం స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. దీనికి రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించ‌గా, నెట్‌ఫ్లిక్స్ నిర్మించింది. ఈ డాక్యుమెంటరీ ఎలా ఉంది..ఏమి కంటెంట్ ఉంది ఇందులో..చూడదగ్గదేనా వంటి విషయాలు చూద్దాం.

వాస్తవానికి రాజమౌళి గురించి ఈ రోజు మనకి తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పనిలో పర్‌ఫెక్షనిస్ట్‌ అని తను అనుకున్న ఎఫెక్ట్ వచ్చేదాకా తీస్తూనే ఉంటారని తెలుసు. అందుకే ఆయన ఎలాంటి కథను తెరకెక్కించినా అది సూపర్‌ హిట్‌ అవుతూంటుంది. ఇవే విషయాలు చెప్తే మనకు పెద్దగా ఏమీ అనిపించదు. ఇందులో రాజమౌళి సినిమా క్రాప్ట్ గురించి చర్చిస్తేనే ఔత్సాహికులుకు ఉత్సాహం వస్తుంది. అయితే ఈ 74 నిమిషాల డాక్యుమెంటరీ ఆ యాంగిల్ లో సాగలేదు.

ఏముంది ఇందులో ...

రాజమౌళి కెరీర్ ఓ సీరియల్ దర్శకుడుగా మొదలైంది. అలాంటి ఆయన సీరియల్ డైరక్టర్ స్దాయి నుంచి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ డైరక్టర్ గా ఎలా రూపాంతరం చెందారు? తనకి తన కుటుంబానికి ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఎలాంటిది? ఓ సినిమా చేస్తున్న సమయంలో తన భార్యకి జరిగిన ప్రమాదకర ఘటన.. తను స్టార్ హీరోస్ తో సినిమాలు చేసినప్పుడు వారు పడే ఇబ్బందులు ఏంటి? అసలు రాజమౌళి ఎప్పుడైనా ఈ స్దాయికి వస్తానని ఊహించారా ? సినిమా కీ సినిమాకు మధ్య బ్రేక్ టైమ్ ల్లో రాజమౌళి ఏం చేస్తాడు? బాహుబలి టైమ్ లో బడ్జెట్ లు తగ్గించడం కోసం రాజమౌళి ఏ విధమైన త్యాగాలు చేసారు. ప్రారంభం రోజుల్లో , తమ కుటుంబం ఏ విధమైన ఇబ్బందులు , కష్టాలు పడింది? రాజమౌళి గురించి హీరోలు, నిర్మాతలు హాలీవుడ్ డైరక్టర్స్ ఏం చెప్పారు.. అనేవి ఇందులో ప్రస్తావించారు. అయితే చిత్రం ఏమిటంటే వీటిల్లో చాలా ఆన్సర్స్ ఇన్నేళ్లుగా రాజమౌళిని ఫాలో అవుతున్నవాళ్లకి, ఆయన ఇంటర్వూలు చూసిన వాళ్లకు తెలుసు.

మనకు నచ్చేవి ఏంటి

ఇంట్లో అంతా విపరీతమైన దైవ భక్తి కలిగి ఉంటే రాజమౌళి ఒక్కరు మాత్రం ఎందుకు నాస్తికుడిగా ఉన్నారు వంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ బాగున్నాయి. రాజమౌళి తన చిన్నతనంలోనే తన తండ్రి చేసిన "పిల్లన గ్రోవి" అనే సినిమా ఆగిపోవడం అప్పుడు తమ కుటుంబం ఎదురుకొన్న పరిస్థితి కోసం వివరించడం వంటివి మనని ఎమోషనల్ గా కట్టిపారేస్తాయి. అలాగే రాజమౌళి ఒక సీరియల్ దర్శకుడిగా(శాంతి నివాసం) నుంచి ఇప్పుడు 'RRR' వరకు చేసిన ప్రయాం కొంత ఉద్వేగభరితంగా సాగుతుంది.

అలాగే ఇందులో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తోపాటు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అవి అభిమానులు ఓ రేంజిలో అలరిస్తున్నాయి.

విసిగించేవి ఏమిటి

ఈ డాక్యుమెంటరీపై తెలుగు వారి నుంచి విమర్శలు రావటానికి కారణం డబ్బింగ్. అలాగే ఈ డాక్యుమెంటరీ ఫుల్ ఫ్లెడ్జ్ ఎంగేజింగ్ గా నడపలేకపోయారు. ఫ్యామిలీకు సంభందించిన విషయాలు అనుకున్న స్దాయిలో అంత ఇంపాక్ట్ కలిగించవు. తెలుగు డబ్బింగ్ మాత్రం వరస్ట్ ఎక్స్ పీరియన్స్ అయితే ఇందులో హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కామెరాన్ ఇంకా జో రస్సో(అవెంజర్స్ సినిమాల దర్శకుడు) వంటివారు రాజమౌళి గురించి చెప్పటం మనకు తెలుగు వారిగా ఆనందం కలిగిస్తుంది.

తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి డబ్బింగ్ చెప్పించిన వాయిస్ లతో ఇబ్బందిగా ఉంది అంటున్నారు ట్రైలర్ చూసిన వాళ్లు. ఈ వెర్షన్ లో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లకు వేరే ఆర్టిస్ట్ ల చేత డబ్బింగ్ చెప్పించారు. అవి చాలా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయని, ఏ విధమైన ఇంపాక్ట్ కలగచేయటం లేదని అంటున్నారు. ఈ విషయంలో నెట్ ప్లిక్స్ జాగ్రత్తలు తీసుకోలేదు. ఇంగ్లీష్ ట్రైలర్ లో వారి ఒరిజనల్ వాయిస్ లు ఉన్నాయి. ఆ విషయంలో విమర్శలు రావటం అభిమానుల నుంచి అనేది పెద్ద విచిత్రమైతే కాదు.

గుర్తించుకోవాల్సింది ఇదే..

ఇక ఇది డాక్యుమెంటరీ కాబట్టి సినిమా స్టైల్లో ఉండదు. రాజమౌళి కెరీర్ ఎలా ఎప్పుడు ప్రారంభమైందనేది విజువల్స్ రూపంలో చూపిస్తారు. అలానే జక్కన్నతో పనిచేసిన అనుభవాన్ని ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అయితే ఇది డాక్యుమెంటరీ కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు.

కరణ్‌ జోహార్‌ ‘ఈ దర్శకుడు ఓ లెజెండ్‌’ అని, ఆయనతో పని చేసిన వారందరూ ఆయణ్ని పని రాక్షసుడని పిలుస్తుంటారంటూ రాజమౌళి భార్య రమ ట్రైలర్‌లో వారి అభిప్రాయాల్ని తెలిపారు. ‘నిజం చెప్పాలంటే నేను కేవలం నా కథకు మాత్రమే బానిసను..’ అంటూ ట్రైలర్‌ ఆఖర్లో రాజమౌళి చెప్పిన డైలాగ్‌ సినిమాల పట్ల తనకున్న ప్రేమకు నిదర్శనం అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ వచ్చే నెల 2న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

చూడచ్చా

రాజమౌళి అభిమానులు ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ఓటిటిలో ఓసారి ట్రై చేయవచ్చు. అయితే తెలుగు ఆడియెన్స్ ఒరిజినల్ ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడటం మేలు. లేకపోతే తెలుగు డబ్బింగ్ కు విరక్తి కలుగుతుంది.

ఎక్కడ చూడచ్చు

నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story