పవన్ ఇపుడు నేషనల్ స్టార్ ...క్యాష్ చేసుకునేందుకే భారీ డీల్స్ ?
ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ సెంట్ పర్సెంట్ రావడం ప్రధాని మోదీ సైతం తుఫాన్ అంటూ పవన్ ని మెచ్చుకోవటంతో ఆయన చేస్తున్న సినిమాలకు బిజినెస్ ఆకాశాన్ని అంటేలా ఉంది...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వందశాతం స్ట్రైక్ రేట్‌తో విజయకేతనం ఎగరేయడం ఇటు సినీవర్గాల్లోనూ.. అటు ఆయన అభిమానుల్లోనూ జోష్‌ను నింపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఇంపాక్ట్ సినిమాల బిజినెస్ పైనా పడటం చెప్పుకోదగ్గ విశేషం. నేషనల్ లెవిల్లో పవన్ పేరు వినపడుతూండటం, ప్రధాని మోదీ సైతం తుఫాన్,సునామి అంటూ పవన్ ని మెచ్చుకోవటం అంతా గమనిస్తున్నారు. దాంతో ఆయన చేస్తున్న సినిమాలకు బిజినెస్ ఆకాశాన్ని అంటుతోంది. ముఖ్యంగా ఓటిటి సంస్థలు ఆయన సినిమా రైట్స్ కు ఎంతైనా పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే నేషనల్ లెవెల్ వ్యక్తి సినిమాలకు అదే లెవెల్ లో వ్యూస్ వస్తాయి .
ఇవన్నీ లెక్కలేసే పవన్ కళ్యాణ్ OG కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది అని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ని అమ్మేందుకు మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్ OG డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అన్ని భాషలతో కలిపి రూ. 92 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ఇది తెలుగు సినిమాలకు రికార్డ్ ధర, పవన్ కళ్యాణ్ సినిమాలలో భారీ డీల్.
రీసెంట్ గా ఓజీ టీమ్ ‘‘ఎవ్వరికీ అందదు అతని రేంజ్.. రెప్ప తెరిచేను రగిలే రివేంజ్’’ అంటూ ఓ పోస్టర్ వదిలింది టీమ్. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో.. ఓజాస్ గంభీర అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు పవన్.
ప్రధాని మోదీ సైతం తుఫాన్,సునామి అంటూ పవన్ ని మెచ్చుకోవటం అంతా గమనిస్తున్నారు. దాంతో ఆయన చేస్తున్న సినిమాలకు బిజినెస్ ఆకాశాన్ని అంటుతోంది.'ఓజీ' షూటింగ్ ఇంకా కాస్త బ్యాలెన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఇన్నాళ్లూ ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రావడం, పవన్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో మరోసారి ఓజీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసి ముందు ప్రకటించినట్లుగా సెప్టెంబర్‌లో సినిమాను రిలీజ్ చేయాలని డైరెక్ట్ సుజీత్ అనుకుంటున్నాడు.
అదే సమయంలో ఓ డౌట్ మొదలైంది. ఈ సినిమా స్ట్రీమింగ్‌కి నెట్‌ఫ్లిక్స్ 2025 స్లాట్‌ను కేటాయించిందట. దీన్ని బట్టి ఓజీ థియేట్రికల్ రిలీజ్ వాయిదా పడినట్లే అంటున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో థియేటర్లో సినిమా రిలీజైన నెలన్నర లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 27న ‘ఓజీ’ ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుపుతూ ఆ మధ్యన పోస్టర్‌ను విడుదల చేసింది.
పవన్ కల్యాణ్ హిట్ చిత్రాల్లో ఒకటి ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi). ఈ సినిమా కూడా 2013లో సెప్టెంబరు 27నే విడుదలైంది. ఇప్పుడు అదే తేదీన ‘ఓజీ’ రానుండటంతో పవన్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ సినిమా కూడా కాసుల వర్షం కురిపించడం ఖాయమంటున్నారు. అయితే ఓటిటి లాజిక్ ప్రకారం ఓజీ సెప్టెంబర్ 2024లో థియేటర్లలో రిలీజైతే ఏడాది వరకూ ఓటీటీ రిలీజ్ కోసం చూడదు. కాబట్టి ఓజీ వాయిదా పడే అవకాశం ఉందని ట్రేడ్ లో డౌట్ పడుతున్నారు.
ప్రస్తుతం ముగింపు దశ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఓజీ’ చిత్రం .. ముంబయి - జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో హీరోయిన్ ప్రియాఅరుళ్ మోహన్. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, వెంకట్, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించిన దగ్గరినుంచే సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.
గతేడాది విడుదలైన దీని గ్లింప్స్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ యాక్షన్ డ్రామాను నిర్మిస్తోంది. ఎస్ఎస్ థమన్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. మరోవైపు, పవన్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటికి కూడా OTT బిజినెస్ ఊపందుకుంటుందనటంలో సందేహం లేదు.