Netflix Top 10 లో ఇండియా టైటిల్ ఒక్కటే?... అంత అధ్వాన్నమా!
x

Netflix Top 10 లో ఇండియా టైటిల్ ఒక్కటే?... అంత అధ్వాన్నమా!

2024 లో పిబ్రవరి 26- మార్చి 3 మధ్య నెట్ ఫ్లిక్స్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీ టాప్ 10 కు చేరుకున్నది ఇండియా టైటిల్ ఒక్కటే. అదేంటో తెలుసా. మనవాళ్ల ఇంత వీకా. వివరాలు



మన దేశంలో ఒంటిరిగా సినిమా చూసేవాళ్లు పెరిగిపోతున్నారట. అదేంటి థియేటర్ లో ఒంటిరిగా సినిమా చూడటం కష్టం కదా అంటారా...అదేం కాదు..ఓటిటిలు వచ్చాక తమ గదుల్లోకి వెళ్లి చక్కగా స్నాక్స్ పెట్టుకుని ఒంటిరిగా సినిమాలు చూడటం బాగా మరిగారట మనోళ్లు.


ఫ్యామిలీతో కలిసి చూడాలనే విషయానికి ఆ వ్యూయర్స్‌‌ అంతగా ప్రాధాన్యం కూడా ఇవ్వట్లేదని రీసెర్చ్ తేలింది. అందుకేనేమో గత ఆరేళ్లలో ఓటీటీ సర్వీసుల్ని ఉపయోగించుకుంటున్నవాళ్ల శాతం విపరీతంగా పెరిగింది.


డెన్మార్క్‌‌, ఆస్ట్రేలి యాలో కూడా సోలో వ్యూయర్స్‌‌ ఎక్కువగానే ఉన్నట్లు లెక్కలు తేల్చాయి. అయితే ఈ దేశాలతో పోలిస్తే సౌదీ అరేబియా, పోలాండ్‌ , మన దగ్గరే తక్కువ సోలో వ్యూయర్స్‌‌ ఉన్నట్లు రీసెర్చ్‌ తేల్చింది. నెట్‌ ఫ్లిక్స్‌‌, అమెజాన్‌ ప్రైమ్‌ , హులు సర్వీసులతో పాటు డిస్నీ ఫ్లస్‌‌, పీకాక్‌‌, హెబీవో మ్యాక్స్‌‌.. హాట్‌ స్టార్‌‌, జీ5, వూట్‌, సోనిలివ్‌ లాంటి లోకల్‌ యాప్‌ ల్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ రీసెర్చ్‌ చేసారు. ఆ విషయం ప్రక్కన పెడితే...మరి మనోళ్లు ఒంటరిగానో..జంటగానో కూర్చుని ఏం చూస్తున్నారు..మనదేశ కంటెంట్ నేనా అంటే అబ్బే అంతలేదు అంటోంది నెట్ ప్లిక్స్.


Netflix Top 10 అంటూ ప్రకటించిన కొత్త లిస్ట్ లో పది సినిమాలను ప్రస్దావించారు. ఆ లిస్ట్ లో మొత్తం ఎన్ని గంటలు చూసారో, వ్యూస్ ఎన్ని వచ్చాయో కూడా లెక్కలు ఇచ్చారు. 2024 లో పిభ్రవరి 26 నుంచి మార్చి 3 వరకూ ఓ వారంగా ఈ లెక్కలు వేసారు. ఈ నాన్ ఇంగ్లీష్ కేటగిరీ టాప్ 10 లో కేవలం షారూఖ్ ఖాన్ డింకీ మాత్రమే ఉండటం విశేషం. ఇంకే ఏ ఇండియన్ సినిమా గానీ, తెలుగు సినిమాగానీ లేదని గమనించాలి. డింకీ కూడా #8 ప్లేస్ లో ఉంది. అంటే మన కంటెంట్ కు ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా గుర్తింపు దొరకటం లేదని తెలుస్తోంది. నెట్ ప్లిక్స్ అఫీషియల్ గా ఇచ్చిన ఆ లెక్కలు ఓ సారి చూస్తే...


ఇక కొంతకాలంగా థియేటర్లకు పోటీ ఇస్తూ నెట్ ప్లిక్స్ ఇక్కడ రీజనల్ గా కూడా పాతుకుపోవాలని ప్లాన్స్ వేస్తోంది. థియేటర్స్ కు ఆ కంటెంట్ కంటే ఇంకా బెటర్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇచ్చేందుకు ఈ ఓటిటి సంస్థ వేస్తున్న ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు. బడ్జెట్ విషయంలో కాంప్రోమైజ్ లేకుండా మార్కెట్ ని వీలైనంత మేర వ్యూయర్స్ ని కబ్జా చేసేందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది. మొదట్లో అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ తో పోలిస్తే ఇండియాలో వెనుకబడి ఉన్న నెట్ ఫ్లిక్స్ నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని భారీ స్టార్ క్యాస్టింగ్ తో ప్యాన్ ఇండియా మూవీస్ ని రెడీ చేసి ముందుకు రావాలనుకుంటోంది. డివిడి రెంటల్ సర్వీస్ గా మొదలైన నెట్ ఫ్లిక్స్ వరస చూస్తుంటే వందల కోట్లను మంచి నీళ్లలా ఖర్చుపెట్టేందుకు వెనుకాడటం లేదు.

అలాగే మనదేశంలో నెట్​ఫ్లిక్స్​లో 65 లక్షల కు పైగా కస్టమర్లు ఉన్నారు. దీని పోటీ కంపెనీలు హాట్​స్టార్​, అమెజాన్​ ప్రైమ్​తో పోలిస్తే దీనికి ఉన్న వ్యూయర్ల సంఖ్య తక్కువ. ఎందుకంటే నెట్​ఫ్లిక్స్​ చార్జీలు ఎక్కువ. తన వ్యూయర్​షిప్​ను మరింత పెంచుకోవడానికి లోకల్​, గ్రామీణ ప్రాంతాలకు నచ్చే కంటెంట్​ను కూడా భారీగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. వీరికి నచ్చే స్టోరీలను వెతుకుతోంది. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్​ఫోన్ల వినియోగం పెరుగుతోంది కాబట్టి ఫోన్లకు ప్రత్యేకంగా టారిఫ్​లను తెచ్చే ప్లాన్స్ చేస్తోంది. కొన్ని ప్లాన్ల ధరలను తగ్గించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను తన ప్లాట్​ఫారమ్​పైకి తీసుకురావడానికి ‘యాడ్స్​ బేస్​డ్​ వీడియో ఆన్​ డిమాండ్​’ సదుపాయాన్ని కూడా తెస్తోంది. ప్రకటనలు ఇచ్చే ప్లాన్ల ధరలను తగ్గించనుంది. మాస్​ ఆడియెన్స్​కు నచ్చే కంటెంట్​పై ఫోకస్​ చేస్తోంది. ఎన్ని చేసినా మన కంటెంట్ ని ప్రపంచం మొత్తం చూసేలా ప్లాన్ చేయగలిగాలి.


Read More
Next Story