మిస్సవద్దు:   ఓటిటిలో న్యూ ఇయర్ బొనాంజా,లిస్ట్ ఇదిగో!!
x

మిస్సవద్దు: ఓటిటిలో న్యూ ఇయర్ బొనాంజా,లిస్ట్ ఇదిగో!!

స్ట్రేంజర్ థింగ్స్ నుంచి మౌగ్లీ వరకు..


ఒకప్పుడు సినిమా చూడాలంటే శుక్రవారం కోసం ఎదురుచూసి, టికెట్ల కోసం క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో వైఫై ఉంటే చాలు.. థియేటర్ ఎక్స్పీరియన్స్ సోఫా మీదకే వచ్చేస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రేక్షకులు టికెట్ రేట్లు, పార్కింగ్ ఛార్జీలు భరించలేక, 'ఒక నెల ఆగితే ఓటిటి లోనే వస్తుంది కదా' అనే ధోరణికి అలవాటు పడిపోయారు.

దీంతో జనం థియేటర్లకు వెళ్లడం తగ్గించేసి, ఓటిటి ప్లాట్‌ఫారమ్స్ కు అతుక్కుపోతున్నారు. ఇక ఇప్పుడు న్యూ ఇయర్ వీకెండ్ రావడంతో, డిజిటల్ స్క్రీన్స్ మీద సినిమాల జాతర మొదలైంది.

ఈ క్రమంలో న్యూ ఇయర్ వీకెండ్‌ను ఇంట్లోనే కూర్చుని చిల్‌ అవ్వాలనుకునే సినీ ప్రియులకు ఓటిటి (OTT) ప్లాట్‌ఫారమ్స్ అదిరిపోయే గిఫ్ట్స్ ఇస్తున్నాయి. ఈ వీకెండ్ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఏకంగా డజనుకు పైగా క్రేజీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రోషన్ కనకాల 'మౌగ్లీ 2025' తో పాటు మోస్ట్ అవైటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' ఫైనల్ సీజన్ ఈ జాబితాలో ఉండటం విశేషం.

మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను డబుల్ చేసే ఆ సినిమాల లిస్ట్ ఇదే:

డిసెంబర్ 31 (న్యూ ఇయర్ ఈవ్):

* ఎకో (Eko): మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ - నెట్‌ఫ్లిక్స్

* ఇత్తిరి నేరం (Ithiri Neram): మలయాళం - సన్ నెక్స్ట్

జనవరి 1 (న్యూ ఇయర్ కానుకగా):

* మౌగ్లీ 2025 (Mowgli 2025): తెలుగులో రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా - ఈటీవీ విన్

* స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things): సీజన్ 5 ఫైనల్ వాల్యూమ్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ) - నెట్‌ఫ్లిక్స్

* LBW (లవ్ బియాండ్ వికెట్): తమిళ్ క్రేజీ మూవీ - జియో సినిమా ప్లస్ హాట్‌స్టార్

* రన్ అవే (RunAway): ఇంటర్నేషనల్ థ్రిల్లర్ (మల్టీ లాంగ్వేజ్) - నెట్‌ఫ్లిక్స్

* ది గుడ్ డాక్టర్ (The Good Doctor): సీజన్ 7 (ఇంగ్లీష్) - నెట్‌ఫ్లిక్స్

* స్నిపర్ (Sniper: The Last Stand): ఇంగ్లీష్ యాక్షన్ మూవీ - నెట్‌ఫ్లిక్స్

జనవరి 2:

* బ్యూటీ (Beauty): తెలుగు రొమాంటిక్ డ్రామా - జీ5

* హక్ (Haq): హిందీ సిరీస్ - నెట్‌ఫ్లిక్స్

* డ్రాకులా (Dracula): ఇంగ్లీష్ హారర్ క్లాసిక్ - ప్రైమ్ వీడియో

* గ్రిజ్జీ అండ్ ది లెమ్మింగ్స్: సీజన్ 4 (కిడ్స్ స్పెషల్) - నెట్‌ఫ్లిక్స్

జనవరి 3:

* కుమ్కీ 2 (Kumki 2): తమిళ్ అడ్వెంచరస్ డ్రామా - ప్రైమ్ వీడియో

ఈ లిస్ట్‌లో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.

Read More
Next Story