రాజకీయాల్లోకి వస్తాడా, రాడా: విశాల్ తెలివైన జవాబు
x

రాజకీయాల్లోకి వస్తాడా, రాడా: విశాల్ తెలివైన జవాబు

రాజకీయాలంటే సినిమాల్లో లాగా వినోదం కాదని, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే వ్యవస్థ అని ప్రముఖ నటుడు విశాల్ అన్నారు.


రాజకీయాల్లోకి వస్తా అని చెప్పాక రాకుండా ఉండలేనని హీరో విశాల్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని సేతుపట్ లో నిన్నరాత్రి జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఆధ్వర్యంలో సంక్షేమ ఉద్యమం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేశారు.

రాజకీయాలు అంటే కాలక్షేపం కోసం వచ్చే ప్రాంతం కాదని అన్నారు. "మా చారిటీ ఉద్దేశం లేని వారికి మా వంతుగా సాయం అందించడమే, వీలైనంత వరకు ఉన్నవారి నుంచి లేని వారికి వారథిలా వ్యవహరిస్తాం" అని చెప్పారు. నేటీకీ రాష్ట్రంలో తాగునీరు, సాగు నీరు సౌకర్యం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. బోరువెల్ వేయడానికి చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

రాజకీయం ప్రజాపని, ఇది సమాజ సేవ. ఇతర రంగాల లాగా వినోదం కోసం వచ్చి ప్లేస్ కాదు. ఎవరికైన ప్రజలకు మేలు చేసే వేదిక రాజకీయం. 2026 లో ఎన్నికలు రాబోతున్నాయి. నేను వస్తానని చెప్పి రాకుండా ఉండను. అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో తెలియదు. నేను 2004 నుంచి నటిస్తున్నాను. నటీనటుల సంఘం ఐడీ కార్డు ఇచ్చిన రాధరవికి వ్యతిరేకంగా నిలబడతానని కలలో కూడా ఊహించలేదు. నిర్మాతల సంఘంలో కూడా నిలబడతానని కూడా ఊహించలేదు కానీ అవన్నీ జరిగాయి" అని విశాల్ అన్నారు.

తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ " విజయ్ కి నా శుభాకాంక్షలు. మిమ్మల్నీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అయితే నా అభిప్రాయం ప్రకారం ప్రజలకు సేవ చేయడానికి ఇన్ని పార్టీలు అవసరం లేదు. అందరి లక్ష్యం ప్రజలకు సేవ చేయడమే. వారి అవసరాలు తీర్చడమే. కానీ ఇప్పుడు పార్టీల సంఖ్య ఎక్కువైంది. అంతకుమించి ఒక వ్యక్తి వచ్చి మంచి చేయాలనుకుంటే అది చేయగలననే నమ్మకంతో వస్తాడు.

Read More
Next Story