
ఓజీలో పవన్ కళ్యాణ్
‘ఓజీ’ హిస్టారిక్ ఓపెనింగ్ తర్వాత షాకింగ్ డ్రాప్
ఏపీలో బయ్యర్స్ టెన్షన్!
పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి రిలీజ్‌కు ముందు ఊహించని స్థాయిలో క్రేజ్, బజ్ ఏర్పడింది. పవర్‌స్టార్ కంబ్యాక్ మూవీ కావడం, సుజీత్ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా రావడం, అలాగే మ్యూజిక్ నుండి టీజర్ వరకు ప్రతి అప్‌డేట్ ట్రెండింగ్‌లో నిలవడం వల్ల అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. అందుకు తగ్గట్లుగానే ప్రీమియర్ షోల ద్వారానే ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది.
డే వన్ రికార్డులు బద్దలు అయ్యాయి!
రిలీజ్ డే రోజున ఓజీ ఆల్‌టైమ్ రికార్డులను బద్దలుకొట్టి 120 కోట్లకుపైగా గ్రాస్, తెలుగులోనే 70 కోట్లకుపైగా షేర్ రాబట్టి సంచలనంగా నిలిచింది. ఇది పవన్ కెరీర్‌లోనే కాక, ఇండస్ట్రీ రేంజ్‌లో కూడా సెన్సేషన్.
రెండో రోజు నుంచే షాక్…
కానీ రెండో రోజు నుంచి పరిస్థితి మలుపు తిరిగింది. అదే స్పీడుతో రెండో రోజు కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుంది అనుకున్న ఈ చిత్రం కలెక్షన్లలో భారీ పతనం కనిపించింది.
రెండో రోజు ఈ సినిమా సుమారు రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. రిలీజ్ రోజుతో పోల్చితే ఈ భారీ డ్రాప్ ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. శనివారానికి కూడా ట్రెండ్ బలంగా కనిపించ లేదు. ఆదివారం కూడా కొంచెం అటూ ఇటూగా అదే పరిస్దితి.
అలాగే ఏ-సెంటర్స్‌లో డ్రాప్ సాధారణ స్థాయిలో ఉన్నా, మాస్ సెంటర్స్‌లో ఫాల్ విపరీతంగా ఉండటంతో ట్రేడ్ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. రిలీజ్ డే తర్వాత భారీ నంబర్స్ నమోదు చేయలేకపోయింది.
డ్రాప్‌కి రీజన్లు…
ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం... రిలీజ్ డే హైపర్ హంగామా, పెంచిన టికెట్ రేట్ల కారణంగా కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో వచ్చాయి. కానీ మిక్స్‌డ్ టాక్, ఎక్కువ టికెట్ రేట్లు సామాన్య ప్రేక్షకులను దూరం చేశాయి.
తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కూడా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. మరోవైపు బతుకమ్మ పండుగ, పండగ ముందస్తు ప్రయాణాలు కలిపి షోలకు హాజరు తగ్గించాయి. మరోవైపు హైదరాబాదుని మూసీ వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో నైజాంలో ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడం గగనమేనని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఏపీలో బయ్యర్స్‌పై ఒత్తిడి పెరుగుతోంది…
ఓవర్సీస్‌లో ఓజీ బ్రేక్‌ఈవెన్ పూర్తి చేసి లాభాల్లోకి వెళ్లింది. నైజాంలో 3 రోజుల్లోనే 65% రికవరీ సాధించింది. కానీ ఏపీలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
ఆంధ్ర మొత్తంగా బిజినెస్ – 6 టెరిటరీస్‌కి కలిపి బిజినెస్ ₹80 కోట్లు కాగా, 3 రోజుల్లో వచ్చిన షేర్ ₹41 కోట్లు మాత్రమే (హైర్స్, మినిమమ్ గ్యారంటీతో కలిపి). అంటే ఏ ఏరియాలోనూ 50% రికవరీ కూడా కాలేదు.
దసరా హాలిడేలోనే భవిష్యత్!
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ₹180 కోట్లు, ఇప్పటికే 2/3 రికవరీ పూర్తయింది. కానీ పూర్తి సక్సెస్ అవ్వాలంటే మరో ₹50 కోట్ల షేర్ రాబట్టాలి. దసరా కలెక్షన్లు హిస్టారిక్ జంప్ ఇస్తే – ‘ఓజీ’ ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుంది. లేకపోతే, భారీ బిజినెస్ గాంబిల్‌లో ఏపి బయ్యర్స్ రిస్క్ మరింత పెరగడం ఖాయం.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందుకున్నాడని ఆయన ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. . గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ నటన, డైలాగ్ డెలివరీ, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద మరో సరైన సినిమా లేకపోవడంతో వచ్చే వారం కూడా ‘ఓజీ’కి ఎదురు లేదనేది వారి వాదన.
Next Story