ఈ ఒటిటి సినిమా ఓ సారి తప్పక చూడొచ్చు, ఎందుకంటే...
నా మాట నమ్మండి, ఈ ఫాంటసీ యానిమేటెడ్ ఎడ్వెంచర్ కామెడీ పిల్లలకే కాదు చీకటిని ఇష్టపడని పెద్దలకు నచ్చుతుంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
పిల్లల ఎంటర్ట్నైమెంట్ మార్కెట్ ఎంత ఉందనేది పెద్దవాళ్లకి తెలిసిపోయింది. దాంతో మనం టీవి పెడితే పిల్లల ఛానెల్స్...ఓటిటిలో పిల్లల సినిమాలు, వెబ్ సీరిస్ లు. పిల్లల కార్టూన్ సీరిస్ లకు ఉన్న డిమాండ్ చెప్పక్కర్లేదు. అలాగే ఇప్పటిదాకా పిల్లలను అలరించిన కార్టూన్ బుక్స్ సైతం సినిమాలుగా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే పిల్లలు పుస్తకాలను చదవంటమ మానేసి కార్టూన్ సినిమాలు చూస్తున్నారనే విషయం అందరకీ అర్దమైపోయింది. ఈ క్రమంలో లేటెస్ట్ గా వచ్చి ఓటిటిలో రిలీజై సెన్సేషన్ గా మారిన చిత్రం ఒరయాన్ అండ్ ది డార్క్ ( Orion and the dark).
ఆ చీకటి హాయ్ అంటూ మనవాడిని పలకరిస్తుంది. అంతే ఉలిక్కిపడతాడు..భయపడతాడు...వణికిపోతాడు. కానీ చీకటి తను అనుకున్నంత భయంకరమైనది కాదు అని కొద్ది క్షణాల్లోనే అర్దమవుతుంది. ఆ చీకటి మొదట అభయమిస్తున్నట్లుగా..ఓయ్ పిల్లాడా..నేను అంటే ఎందుకంత భయపడతావు..నల్లగా ఉండటం నా తప్పా...నేను నీకేమన్నా అన్యాయం చేసానా ..అంటే ఆ పిల్లాడు బ్యాటరీ లైట్ వేసి చీకటిని పాలదోలబోతాడు. అప్పుడా చీకటి..నువ్వు నన్ను చూసి భయపడి తరిమేయకు..నీలా ప్రపంచంలో చాలా మంది నన్ను చూసి భయపడుతున్నారు. వాళ్లందరిలో కన్నా నువ్వే ఎక్కువ భయంతో ఉన్నావు..ఇదిగో ఆ లిస్ట్ ..ఇక్కడ నీ పేరు ఉందని చూపెడతాడు. తనను తాను డార్క్ (చీకటి) గా పరిచయం చేసుకుంటాడు.
ఆ తర్వాత మనిద్దరం కలిసి అలా ఓ రౌండ్ వేసి వద్దాం రా..అంటాడు..మొదట నో చెప్పినా తర్వాత చీకటి నా భుజం మీద కూర్చో..అని ఎక్కించుకుని అల్లావుద్దీన్ అద్బుత దీపంలో జీనీ లాగ గాల్లోకి ఎగురుతాడు. ఆ క్రమంలో చీకటి వల్ల ఎంతమంది సుఖంగా నిద్రపోతున్నారో..ఎంత మంది చీకట్లో తమ పనులు చేసుకుంటున్నారో..ప్రశాంతతను అనుభవిస్తున్నాడో చూస్తాడు ఆ కుర్రాడు. అలాగే చీకటి కు ప్రెండ్స్ అయిన నిద్ర, నిద్రలేమి, నిశ్శబ్దం, వివరించలేని శబ్దాలు, మధురమైన కలలు వీటిని పరిచయం చేస్తాడు. చీకటితో ఆ రాత్రి ఆ కుర్రాడు చేసిన జర్నీలో ఇంకేమీ అనుభూతులు లభించాయో ..మనం ఇష్టపడని చీకటి వలన ఎన్ని లాభాలు ప్రపంచానికి ఉన్నాయో తెలుసుకుంటాడు ఆ కుర్రాడు. వాడితో పాటు మనం కూడాను. ఇంతకీ ఆ కుర్రాడు పేరు ఏంటి అంటారా... Orion.