త్వరలో కేరళ గవర్నమెంట్ ఓటీటీ
x

త్వరలో కేరళ గవర్నమెంట్ ఓటీటీ

ఓటీటీ- ప్రపంచ ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని ప్రస్తుతం శాసిస్తోంది. అలాంటి రంగంలోకి మనదేశంలోని ఓ రాష్ట్ర ప్రభుత్వం రావాలని చూస్తోంది.


‘సీస్పెస్’ కేరళ ప్రభుత్వం ప్రారంభించబోయే ఓటీటీ ప్లాట్ ఫాం. దాదాపు రెండు సంవత్సరాల విరామం తరువాత తన సొంత ఓటీటీ వేదికను ప్రారంభించేందుకు సిద్దం అయింది. సీస్పెస్ విజయవంతంగా ప్రారంభించబడితే దేశంలో ప్రభుత్వం రంగంలో వస్తున్న తొలి ఓటీటీ వేదిక అవుతుంది.

కోవిడ్ -19 మహ్మరి సమయంలో ప్రపంచం మొత్తం ఇంటికే పరిమితం అయింది. ఆ సమయంలో ప్రజలు వినోదంగా కోసం ఎక్కువగా ఓటీటీ ఆధారపడ్డారు. అప్పటికే ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు విపరీతంగా క్రేజ్ ను, తద్వారా ఆదాయాన్ని ఆర్జించాయి.

ఓటీటీల వల్ల మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న విషయాన్ని గ్రహించిన కేరళ సాంస్కృతిక వ్యవహరాల విభాగం, తన సొంత ప్లాట్ ఫాం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. నవంబర్ 1న ‘కేరళ పైరవి’ పండగ సందర్భంగా సీస్పెస్ ప్రారంభం అవుతుందని ముందుగా ప్రకటించారు. అయితే సాంకేతిక సమస్యలు చుట్టుముట్టడంతో అది కాస్త వాయిదా పడింది. అయితే మంగళవారం అన్నిసమస్యలను అధిగమించి ట్రయల్ రన్ ప్రారంభించారు.

కేరళ ఓటీటీలో ప్రసారం కానున్న చిత్రాలను ఆర్టిస్టుల బృందం ఎంపిక చేయనుంది. సినిమాలను ఎంపిక చేసే ప్యానెల్ లో ఫిల్మ్ ప్రెటర్నిటికీ చెందిన వ్యక్తులు కూడా భాగస్వామ్యం కానున్నారని తెలిసింది. అలాగే వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన, గుర్తింపు పొందిన సినిమాలకు సీస్పెస్ లో అవకాశం ఇవ్వనున్నారు.

సినిమాల ఎంపిక అనేది పూర్తి పారదర్శకంగా, నాణ్యతను బట్టి పరిశీలిస్తారు. అలాగే కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ యాజమాన్యంలో థియెటర్లలో ప్రదర్శించబడేవాటికి ప్రత్యేక పరిశీలన అనే కోటా ఉండదు. చిన్న నిర్మాతలు, స్వతంత్ర నిర్మాతలకు సాయం చేయడానికి థియెటర్లలో విడుదల కానీ సినిమాలను కూడా ప్రసారం చేస్తారు.

ఇతర ఓటీటీ వేదికలు చిత్రాలను కొనుగోలు చేసినట్లు సీస్పెస్ సినిమాలను ఖరీదు చేయదు. ప్లాట్ ఫాం లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల ఆదాయం నుంచి నిర్మాతలకు వాటా వెళ్తుంది. ఇతర ఓటీటీ వేదికలు ఒకసారి సినిమాలను కొనుగోలు చేశాక అదనంగా ఆదాయం ఆర్జించిన నిర్మాతలు వాటా ఇవ్వదు. కానీ సీస్పెస్ మాత్రం ఆదాయాన్ని నిర్మాతలతో పంచుకుంటుంది.

Read More
Next Story