పవన్ కళ్యాణ్ మూవీ కి ఓటీటీ సమస్య?
x

పవన్ కళ్యాణ్ మూవీ కి ఓటీటీ సమస్య?

ఏ కొత్త మార్పుకు సంకేతం?

పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో కాదు, ఓ పవర్‌ఫుల్ బ్రాండ్. ఆయన సినిమా ఓటిటికి వెళ్తుందంటే, “ఎంతైనా కొంటాం” అనే స్థాయిలో నే మార్కెట్ స్పందిస్తుంది. ఏ రేటైనా తిరస్కరించని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, థియేటర్‌లో కంటే ముందే డీల్ క్లోజ్ చేసే ప్రయత్నాలు… ఇవన్నీ పవన్ సినిమాలకు ఎప్పటి నుంచో నార్మల్.

అలాంటి మార్కెట్ కలిగిన పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" వంటి భారీ పీరియాడికల్ యాక్షన్ మూవీకి ఓటీటీ డీల్ సమస్య రావడం లేదనేది సినీ వర్గాల్లో కలకలం రేపటంలో ఆశ్చర్యం లేదు. ఇది కేవలం ఒక డీల్ ఫెయిల్యూర్ కాదు — ఇది ఇండస్ట్రీలోని ఓ అసహజమైన పరిణామానికి సంకేతంగా చెప్పాలి.

"పవర్ స్టార్ స్థాయి హీరో సినిమా తీసుకోవడంలో ఓటీటీ సంస్దలు కండీషన్స్ పెడుతూ, ఓ రకంగా వార్నింగ్ లు ఇస్తూ వెనకడుగు వేస్తే, అది మార్కెట్‌లో జరుగుతున్న మౌనమైన మార్పుని మనం పసిగట్టాల్సిన సమయం." ఈ పరిణామం వెనుక ఉన్న కారణాలు ఏమిటి? పవన్ మార్కెట్ స్థిరమేనా? లేక ఇప్పుడు ఓటీటీ లు స్టార్ వాల్యూకన్నా కంటెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయా?

అసలేం జరిగింది

"హరిహర వీరమల్లు" డిజిటల్ రైట్స్‌ను Amazon Prime Video అన్ని భాషలకు ముందుగానే సొంతం చేసుకుంది. అయితే రిలీజ్ డేట్స్ వరుసగా మార్చుకుంటూ వెళ్లడం, షూటింగ్ అనుకున్న సమయానికి సరిగ్గా జరగకపోవడం వంటి పరిణామాలపై ప్రైమ్ తీవ్ర అసంతృప్తితో ఉందట. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ప్రైమ్ చిత్ర టీమ్ కు చివరి హెచ్చరిక ఇచ్చిందట.

"మే 9న సినిమా విడుదల చేయండి. ఆలస్యం అయితే డీల్‌లో 50% వరకు కోత లేదా డీల్‌ను పూర్తిగా రద్దు చేస్తాం."

అది కూడా జ‌ర‌గ‌కపోతే మొత్తం ఎగ్రిమెంట్ నే ర‌ద్దు చేసుకోవాల‌ని స‌ద‌రు సంస్థ ఆలోచ‌న చేస్తుంద‌ని తేల్చి చెప్పారట. అయితే ఇలా ఎప్పుడూ ఓ పెద్ద సినిమాకు ఇంతకు ముందు జరిగింది లేదు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల విషయంలో ఓటీటీ లు చాలా జాగ్రత్తగా ఆచి,తూచి అడుగులు వేస్తాయి. నోరు విప్పుతాయి.

కానీ ఇప్పుడు ఇలాంటి వార్నింగ్ ఇచ్చాయనేది నిజమే అయితే ఇది కేవలం ఓ పెద్ద సినిమాకి ఎదురైన టెక్నికల్ సమస్య కాదు. ఇది ఓ వాణిజ్యపు హెచ్చరిక, భారీ బడ్జెట్ సినిమాలకి భవిష్యత్ డిస్ట్రిబ్యూషన్ రూట్స్ ఎలా మారబోతున్నాయో చెప్పే సంకేతం.

ఎందుకీ నిర్ణయం

కొన్ని పెద్ద సినిమాల భారీ ఫ్లాప్‌ల తర్వాత కొన్ని ప్రముఖ OTTలు "స్క్రీనింగ్ తర్వాత ఫైనల్ అగ్రిమెంట్" అనే కొత్త పాలసీకి మారాయి.

🎙️ "సినిమా చూసిన తర్వాత మాత్రమే డీల్ క్లోజ్ చేస్తాం. కాగితంపై గ్లామర్ మాకు పనికిరాదు."

— Disney+ Hotstar లీగల్ టీమ్ సభ్యుడు , 2023 December OTT Business Forum

అలాగే ఇది సినీ మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్‌ను వెల్లడించే ఘట్టం. ఓటిటిలు ఇప్పుడు స్టార్స్ కంటే కంటెంట్ వాల్యూ, మార్కెట్ యుటిలిటీ, ROI మెట్రిక్స్ ఆధారంగానే డిసిషన్ తీసుకుంటున్నాయి అని అర్దం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాకి ఇలా అయితే, మిగతా నిర్మాతల పరిస్థితి ఏమవుతుంది?" అనేది ఇండస్ట్రీ వర్గాల్లో పుట్టుకొస్తున్న కొత్త భయం.

“స్టార్డమ్ అన్నది ఓ గ్లామర్ షెల్ మాత్రమే. ఓటీటీలకు ఇప్పుడు అవసరం — కంటెంట్ ఫలితాలు, కన్వీనియన్స్, మరియు మార్కెటబిలిటీ.” అనే క్లారిటీ ఇండస్టీకి రావాలి.

“ముందు సినిమా వస్తుంది, తర్వాత రిజల్ట్స్ లో మార్పులను బట్టి డీల్ లో మార్పులు వస్తాయి” అన్నది ఇప్పటి ట్రెండ్ — మునుపటిలా ముందే ఓటీటీ లో కోట్లు పెట్టే దశ వెళ్ళిపోయింది.

— ఒక ప్రముఖ తెలుగు డిస్ట్రిబ్యూటర్ వ్యాఖ్య

“విడుదల మధ్య గ్యాప్, మూడేళ్ల కింద షూట్ చేసిన కంటెంట్, మారిపోయిన ట్రెండ్… ఇవన్నీ ఓటీటీలో జాగ్రత్తలు తీసుకునేలా చేస్తున్నాయి.”

— ఓ ప్రముఖ OTT సీనియర్ అనలిస్ట్

ఈ పరిణామం ప్రత్యేకంగా పెద్ద బడ్జెట్ సినిమాలకు వణుకు తెప్పిస్తుంది. ఎందుకంటే — స్టార్ కాస్టింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ లాంటి అంశాలు ఒక్కప్పుడు డీల్‌కి ప్రధాన బలాలు అయితే, ఇప్పుడు ROI (Return on Investment) ఆధారంగా చర్చలు జరుగుతున్నాయి.

మారుతున్న మార్కెట్ కు సంకేతం

ఏదైమైనా ఒక సినిమా డీల్ ఫెయిలయినప్పుడు, అది ఆ నిర్మాత సమస్య. కానీ పవన్ కళ్యాణ్ సినిమా డీల్ డీలా పడ్డపుడు — అది మార్కెట్ పరిణామం."

వాస్తవానికి "హరిహర వీరమల్లు" సినిమా మీదే నాలుగేళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ సాగుతోంది. ట్రెండ్ మారిపోయింది, జెనెరేషన్ OTT లో కొత్త కంటెంట్ కోసం ఎదురు చూస్తోంది. OTTలు ఇప్పుడు అడిగే ప్రాథమిక ప్రశ్నలు ఇవే:

ఈ సినిమా ఇప్పటి ఆడియెన్స్‌తో కనెక్ట్ అవుతుందా?

వాయిదాల వల్ల బజ్ తగ్గిపోయిందా?

స్ట్రీమింగ్‌లో నంబర్స్ రాబట్టగలమా?

"ఒకసారి సినిమా ఆలస్యం అయితే – మేము దాన్ని ‘లాస్ట్ ఇన్ ఇంట్రెస్ట్’ క్యాటగిరీలో పెట్టేస్తాం."

— ఓ ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ లో Content Strategy Executive

ఏదైమైనా "స్టార్‌కి కావాల్సినది ఫ్యాన్స్. కానీ ఓటిటికి కావాల్సింది సబ్‌స్క్రైబర్లు."

ఇది సినిమా ఇండస్ట్రీలోని వారు ఖచ్చితంగా గుర్తుంచుకోదగ్గ విషయం. తమ బిజినెస్ లెక్కలకు అనుగుణంగానే ఓటీటీ సంస్దలు డీల్స్ అయినా, మరొకటి అయినా చేస్తాయి. వాటి విస్తరణ కోసం సినిమాలు కానీ, సినిమాల విస్తరణ కోసం ఓటీటీ లు కాదు కదా.

Read More
Next Story