ఇది పవన్ స్టామినా:  రిలీజ్ డేట్ క్లారిటీ లేదు, కానీ ఫుల్ స్వింగ్ లో  బిజినెస్
x

ఇది పవన్ స్టామినా: రిలీజ్ డేట్ క్లారిటీ లేదు, కానీ ఫుల్ స్వింగ్ లో బిజినెస్

రాజకీయాల్లోకి వచ్చాక సినిమా పరంగా పవన్ కు క్రేజ్ తగ్గుతుందా లేక పెరుగుతుందా అనే టాపిక్ ఎలక్షన్స్ ముందు నుంచి నడుస్తోంది.

రాజకీయాల్లోకి వచ్చాక సినిమా పరంగా పవన్ కు క్రేజ్ తగ్గుతుందా లేక పెరుగుతుందా అనే టాపిక్ ఎలక్షన్స్ ముందు నుంచి నడుస్తోంది. అయితే ఆయన సక్సెస్ ఫుల్ గా తన పార్టీని గెలిపించుకొని డిప్యూటీ సీఎం అయ్యారు. రాజకీయాల్లో పూర్తి బిజీగా ఉంటున్నారు. తన పదవికి న్యాయం చేస్తున్నారు. అలాగే పవన్ ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మధ్యలో సినిమాలకు సమయం కేటాయిస్తున్నారు. అప్పుడప్పుడు షూటింగ్​లలో పాల్గొంటున్నారు. అయితే ఎలక్షన్స్ కు ముందు కమిటైన సినిమాలు ఎప్పుడు పూర్తి అవుతాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయనే విషయమై మాత్రం క్లారిటీ రావడం లేదు. పరిస్దితి అలా ఉంది కదా అని ఆయన సినిమాలు మూలన పడి ఉండటం లేదు. గతంలో కన్నా వీర క్రేజ్ తో ముందుకు వెళ్తున్నాయి. రికార్డు స్థాయిలో బిజినెస్ చేసుకుని షాక్ ఇస్తున్నాయి.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ,చేయబోయే సినిమాల వరస పెద్ద లిస్టే ఉంది. అందులో ఎప్పుడో మొదలైన హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ లు ఉన్నాయి. అయితే ఎలక్షన్స్ అయ్యాక ఏ సినిమాకు మొదట ప్రయారిటీ ఇచ్చి పూర్చి చేస్తారనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పుడూ చర్చే. హరి హర వీరమల్లు షూటింగ్ రీసెంట్​గానే పవన్ లేకుండా ప్రారంభమైంది. కానీ భగత్ సింగ్ మాత్రం షురూ కాలేదు. తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇక అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ‘OG’చిత్రానికి మొదట ప్రాముఖ్యత ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తల సంగతేమో కానీ ఆ సినిమాకు మాత్రం బిజినెస్ మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇక ఓజీ చిత్రం రిలీజ్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు పూర్తి అవుతుందనే క్లారిటీ లేదు. కానీ నిర్మాత డివివి దానయ్య మాత్రం బిజినెస్ డీల్స్ అన్ని ఏరియాలకు క్లోజ్ చేస్తున్నారని తెలుస్తోంది.ఈ సినిమాతో దానయ్య జాక్ పాట్ కొట్టాడని అంటున్నారు. అంతకు ముందు ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమా చేసినా రాని క్రేజ్, డబ్బు ఈ సినిమాతో వస్తున్నాయట. పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రస్తుత క్రేజ్, ఈ సినిమా రైట్స్ ని రికార్డ్ రేటుకు అమ్మేలా చేస్తున్నాయని అంటున్నారు. ఓజీ ఎప్పుడు రిలీజైన భీబత్సమైన ఓపినింగ్స్ వస్తాయనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వస్తున్నారట. సినిమాని పవన్ కళ్యాణ్ స్దాయికి తగిన రెగ్యులర్ బడ్జెట్ లో చేస్తున్నా లాభాలు మాత్రం భారీగా ఉన్నాయట.

మరో ప్రక్క ఓజి చిత్రం భారీ బడ్జెట్ అని తెలుస్తోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది వినికిడి. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం అని, దాంతో ఈ గ్యాంగస్టర్ చిత్రానికే ఫస్ట్ ప్రయారిటి ఇచ్చి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేకపోతే ప్రొడక్షన్ కాస్ట్ వడ్డీలుతో కలిపి చాలా పెరిగిపోతుందని, అందుకే బిజినెస్ డీల్స్ క్లోజ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ నుంచి రానున్న సినిమాల్లో ‘ఓజి’ (OG) ఒకటి. సుజిత్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయిక. ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఇది ప్రస్తుతం ముగింపు దశ షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం మొదటి పాటను వినిపించేందుకు చిత్ర టీమ్ సన్నాహాలు చేసుకుంటుంది . కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ఈ పాటను బయటకు వదలను అన్నట్లు సమాచారం.

నిజానికి సెప్టెంబరు 2న పవన్‌ పుట్టినరోజు సందర్భంగానే ఈ ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయాలని భావించినప్పటికీ.. అప్పటికి ఏపీలో ఉన్న వరదల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇప్పుడా పాటనే కొత్త ఏడాది రోజున విడుదల చేయనున్నట్లు తెలిసింది. పవన్‌ (Pawan Kalyan) ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో ఓజాస్‌ గంభీర అనే శక్తిమంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు. ఆయన్ని ఢీకొట్టే విలన్ గా ఇమ్రాన్‌ నటిస్తున్నారు (OG Update). ఇది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. దీనికి తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఏదైమైనా‘OG’ సినిమా ప్రారంభం నుంచి అభిమానుల్లో కాదు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. మరో ప్రక్క ₹18 కోట్లకి #OG ఓవర్సీస్ రైట్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ లో ఇది మామూలు రేటు కాదు. ఇంతకు ముందు పవన్ చేసిన భీమ్లా నాయక్ కి డబుల్ రేట్ కావంట విశేషం. అలాగే ఓజీ మూవీ కోసం కూడా పవన్ కి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం తన కెరీర్లోనే తొలిసారి పవన్ కల్యాణ్ రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాడట. దీంతో ఇండియాలో రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల లిస్టులో పవర్ స్టార్ చేరిపోయాడు. ఏదైమైనా ఓజీ టైటిల్ కు తగ్గట్లే బాగా హై రేంజిలో ఉంటూ వస్తోంది.

Read More
Next Story