![పవన్ కల్యాణ్ పాత టైటిల్స్ తో యంగ్ హీరోలు కొత్త ట్రయల్స్ పవన్ కల్యాణ్ పాత టైటిల్స్ తో యంగ్ హీరోలు కొత్త ట్రయల్స్](https://telangana.thefederal.com/h-upload/2025/02/09/511662-whatsapp-image-2025-02-09-at-114857-am.webp)
పవన్ కల్యాణ్ పాత టైటిల్స్ తో యంగ్ హీరోలు కొత్త ట్రయల్స్
'గబ్బర్ సింగ్' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది... 'నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా' అని! డైలాగ్ చెప్పడమే కాదు...
'గబ్బర్ సింగ్' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది... 'నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా' అని! డైలాగ్ చెప్పడమే కాదు... సినిమాల్లోనూ పవన్ కళ్యాణ్ ట్రెండ్ చేశారు. ఇప్పుడు ఆయన సినిమా టైటిల్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి.
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. జనసేన అధినేతగా పొలిటికల్ టర్న్ తీసుకోక ముందు సినిమాలే ఆయన జీవితం. తన సినిమాలతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసారు. ఆయన స్టైల్.. ఆ మేనరిజం ఆయన్ని పవర్ స్టార్‌ని చేసింది. అమ్మాయిల మనసుల్లో గూడు కట్టుకునే చేశాయి. అభిమానులు ఇరవై నాలుగు గంటలు ఆయన నామ స్మరణ చేస్తూ ఆయన దారిలో ప్రయాణించాలనుకునే స్దాయికి తీసుకు వెళ్లాయి ఆయన నటించిన సినిమాలు. చిత్రమేమిటంటే పవన్ సినిమా అంటే ఇప్పటికీ అదే క్రేజ్.. అవే రికార్డులు.. ఇప్పుడే కాదు. పాత సినిమాలు రీరిలీజ్ చేసినా పవర్ స్టార్ దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైపోతున్నాయి. అలాగే ఆయన పాత సినిమాల టైటిల్స్ ఇప్పటి యంగ్ హీరోలు తమ సినిమాలకు పెట్టుకుంటున్నారు.
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి 'బ్రో' వరకూ పవన్ కళ్యాణ్ 28 సినిమాలు చేశారు. అందులో విజయాలు, అపజయాలూ ఉన్నాయి. అయితే... హిట్టూ ఫ్లాపులకు అతీతమైన హీరో పవన్ కళ్యాణ్. ఫ్లాప్‌లు వచ్చినప్పుడు ఆయన మార్కెట్ తగ్గలేదనేది నిజం. రాబోయే ఆయన సినిమాల రిలీజ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఆయనకు అభిమానులు కేవలం బయిటే కాదు సినీ పరిశ్రమల్లోనూ ఉన్నారు. యంగ్ హీరోలు నితిన్ వంటివారు అయితే పవన్ కు వీరాభిమాని.
ఈ టైటిల్స్ ఆల్రెడీ వాడేసారు
ఇక ఆయన టైటిల్స్ ఇప్పటి కొత్త సినిమాలు పెడుతున్న విషయానికి వస్తే.. ఇప్పుడు యంగ్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోలి రోజుల్లోని సూపర్ హిట్ ఫిల్మ్స్ టైటిల్స్ ను తమ సినిమాలకు వాడుతున్నారు. అలా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పవర్ స్టార్ క్లాసిక్ టైటిల్ ‘తొలిప్రేమ’ పేరుతో సినిమా చేసాడు. అలానే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘ఖుషి’ సినిమా కూడా పవర్ స్టార్ సినిమా నుండి తీసుకున్నదే.
వీటితో పాటు యంగ్ హీరో నితిన్ పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ టైటిల్ ను తన సినిమాకు పెట్టుకున్నాడు. . తాజాగా తానేమి తక్కువ కాదని ప్రముఖ బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న రెండవ సినిమా కు టైటిల్ గా ‘ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఫిక్స్ చేసారు. ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ టైటిల్స్ మును వాడేస్తున్నారు కుర్రహీరోలు. ఇప్పుడు
శర్వానంద్ సైతం పవన్ కళ్యాణ్ గతంలో చేసిన 'జానీ' అనే టైటిల్ ని తన సినిమాకు పెట్టుకోబోతున్నట్లు సమాచారం. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించి, యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
'జానీ' సినిమా విషయానికి వస్తే..
ఖుషీ సినిమా తరువాత పీక్ క్రేజ్‌లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అన్నీ తానై స్వీయ దర్శకత్వంలో జానీ సినిమా చేశారు. గీతా ఆర్ట్స్‌లో.. చాలా ప్రెస్టీజియస్ ఈ మూవీ తెరకెక్కించారు. బాస్‌కెట్ బాల్‌ను వేలితో తిప్పుతూ.. తలకు కట్టుకున్న జానీ కర్చీవ్ ఫస్ట్ లుక్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. మోస్ట్ అవేటెడ్ పవన్ సినిమాగా జానీ సినిమా అంతటా వైరల్ అయ్యేలా.. ఈ సినిమా కోసమే అందరూ వెయిట్ చేసేలా చేశారు.అయితే సినిమా అనుకున్న స్దాయిలో ఆడలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డైరక్షన్ చేయలేదు.
పవన్ ఫ్యాన్స్ కు నచ్చని ట్రెండ్
ఇదిలా ఉంటే పవన్ అభిమానులు ఇలా వేరే హీరోలు తమ పవర్ స్టార్ టైటిల్స్ ని వాడే ట్రెండ్‌ను పెద్ద గా ఇష్టపడటం లేదు. పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ అరంగేట్రం చేసే టైమ్ నాటికి మొత్తం పవన్ చేసిన ఐకానిక్ టైటిల్స్ అయ్యిపోయేలా ఉన్నాయని , వాటిని మిగిలిన హీరోలే తీసుకుంటున్నారని పీకే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అదీ నిజమేగా.