అయ్యా ఇది పవన్ కళ్యాణ్  సైన్మా
x

అయ్యా ఇది పవన్ కళ్యాణ్ సైన్మా

వందకోట్ల...మేము ఇవ్వలేం?


రాజకీయంగా పవన్ తిరుగులేని బుల్లెట్, మరి సినిమా బాక్సాఫీస్‌ దగ్గర?

ఇది ఇప్పుడు ఫ్యాన్స్ అడిగే ప్రశ్న కాదు… డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్న సీరియస్ క్వశ్చన్.

ఎందుకంటే ఒక సూపర్ స్టార్ సినిమా వస్తే – అది మాస్ క్రేజ్‌తో గ్యారంటీగా హిట్ అవుతుందనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బిజినెస్ లెక్కలే ముందు తేలాలి. 'హరి హర వీర మల్లు' విషయంలో అయితే ఇది మరింత క్లిష్టంగా మారింది.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గదిలో కూర్చున్నారు. రాజకీయంగా ఆయన పవర్ డామినేట్ చేస్తున్న… సినిమా పరంగా మాత్రం ఓ పెద్ద బిగ్ బాస్ పడింది. ఆ ఇంపాక్ట్ ఆయన కమిటైన సినిమాల ప్రొడక్షన్స్ అన్నిటి మీద పడింది. అంతేకాదు త్వరలో రిలీజ్ కాబోయే హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ మీద కూడా పడనుంది.

క్రేజ్ vs కరెన్సీ

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా హైయెస్ట్ పొలిటికల్ స్టేజీ మీద ఉన్నారు. ఆ క్రేజ్‌కి డౌటే లేదు. రోడ్డుమీద నడివేసవిలో ఎంత వేడి ఉంటుందో, పవన్ మీద పవన్ ఫ్యాన్స్‌లో అంత ఫైర్ ఉంది. అందులోనూ సందేహం లేదు. కానీ ఆ ఫైర్ బాక్సాఫీస్‌ను మండించగలదా?

హరి హర వీరమల్లు ఒక కాలంలో అనుకున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ. సెట్స్‌లో లాంఛనంగా మొదలై, అర్ధాంతరంగా ఆగిపోయి, మళ్లీ మొదలై, డైరక్టర్ తప్పుకుని, వేరే వాళ్ళు వచ్చి, పది సార్లు వాయిదా పడి… ఇక ప్రేక్షకుడి మెమరీ నుంచి కూడా దాదాపు మాయమైపోయింది. 'హరి హర వీర మల్లు' అనే టైటిల్ వింటేనే జనాలు “ఇంకా ఆ సినిమా ఉందా?” అనే సందేహం వచ్చే స్థితికి చేరుకుంది.

నిర్మాత ఆశలు... డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలు!

అయితే భారీగా పెట్టుబడులు పెట్టిన నిర్మాత ఏ ఎం రత్నం మాత్రం ఇప్పుడు 'హరి హర వీర మల్లు' సినిమాని ఓ పొలిటికల్ క్రేజ్‌తో మళ్లీ మార్కెట్‌లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏపీ రైట్స్‌కి ఏకంగా ₹100 కోట్లు ఆశిస్తూ, జిల్లాల వారీగా పెద్ద రేషియో లో అమ్మాలనుకుంటున్నా ను. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు... జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు కలవాలని, వారి నుంచి పెద్ద రేషియో లాగాలని చూస్తున్నారని తెలుస్తోంది.

ఎందుకంటే… ఈసారి థియేటర్‌కు పవన్ కళ్యాణ్ ఒక్క హీరోగా కాదు – డిప్యూటీ సీఎం‌గా వస్తున్నారు. అందుకే ఈ సినిమాని కేవలం అభిమానులు మాత్రమే చూడరు – జనసేన పార్టీ క్యాడర్, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఫ్యాన్‌బాయిజం మోడ్‌లో ఎగబడి చూడబోతున్నారు అనేది నిర్మాతగా ఆయన అంచనా. అది నిజమో కాదో రిలీజ్ తర్వాత తేలే విషయం.

కానీ ఇప్పుడు మాత్రం ఈ మేటర్ బిజినెస్ పాయింటాఫ్ లో లెక్కలు మార్చేస్తోంది. ట్రేడ్ లో అంచనాలు పెంచేస్తోంది. కానీ ఆచి,తూచి అడుగులు వేసే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ నమ్మాలి కదా. వాళ్లు ఆలోచనలో పడిపోతున్నారు. అదే హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో జరుగుతోందని వినికిడి.

దానికి తోడు 'హరి హర వీర మల్లు' సినిమా ప్రారంభమై చాలా కాలం అయ్యింది. డైరెక్టర్ గా క్రిష్ మారి మరొకరు వచ్చారు. ఒక్కసారి కాదు, పదిసార్లు వాయిదా పడిన రిలీజ్ డేట్. సెట్లో మొదలైన రోజు నుంచీ, రాజకీయాల ట్రాఫిక్ జామ్‌లో ఆగిపోయిన కారులా ఫ్రోజన్ స్టేట్‌లో ఉంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పుడు మళ్లీ థియేటర్ల వైపు వస్తోందంటే నిర్మాతలకు ఆసక్తి ఉంటుందేమో కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ రేట్లు పెట్టి ధైర్యం చేయగలరా?

అసలు ప్రశ్న:

పవన్ రాజకీయంగా నెక్స్ట్ లెవిల్ లో ఉన్నప్పటికీ – ఆయన 'హరి హర వీర మల్లు' సినిమా హైప్‌కి ఇమ్మ్యునిటీ డెవలప్‌ అయిపోయింది అన్న మాట వినిపిస్తోంది. దాంతో క్రేజ్ తగ్గిపోయింది. అప్పుడు వంద కోట్లు ఎలా రికవరీ చేయగలం, ఎంతకాలానికి అనేది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల సందేహం

పార్టీ క్యాడర్ బాస్ అంటే పర్సనల్ గౌరవం ఉంటుంది. కానీ టికెట్ కట్టి థియేటర్‌కు రావాలంటే, సినిమా మీద కూడా క్రేజ్ ఓ రేంజిలో ఉండాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు.

సింపుల్‌గా చెప్పాలంటే – ఇది ఫ్యాన్స్ కు సంభందం లేని… ఫైనాన్షియల్ గేమ్.

హైప్ లేని పీరియాడిక్ మూవీకి వంద కోట్లు అడగడం అంటే – గిరగిరలాడే బైక్ ని హైవే స్పీడ్‌లో పెట్టడం లాంటిదే అని ట్రేడ్ అంటోంది. అయితే ఒక్కోసారి మిరాకిల్స్ జరుగుతాయి. ఆడవు అనుకున్న సినిమాలు అద్బుతాలు సృష్టిస్తాయి. ఏమో గుర్రం ఎగరా వచ్చు.

Read More
Next Story