సినిమాలపై భారీగా ఎలెక్షన్ ఫలితాల ప్రభావం, ఆ ఇద్దరిపై ముఖ్యంగా...
x

సినిమాలపై భారీగా ఎలెక్షన్ ఫలితాల ప్రభావం, ఆ ఇద్దరిపై ముఖ్యంగా...

తెలుగు చిత్ర పరిశ్రమ పై భారీగా ఎలక్షన్ ఫలితాల ప్రభావం? ముఖ్యంగా ఆ ఇద్దరి హీరోల సినిమాలపై?


2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఈ టెన్షన్ మరింత పెరిగిపోతోంది. ఇదే సమయంలో రాజకీయ నేతలు, వ్యూహకర్తలు సైతం తమ అంచనాలు, అభిప్రాయాలతో ఈ వేడిని మరింత పెంచుతున్నారు. వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయని.. టీడీపీ కూటమికి అన్ని సీట్లు వస్తాయంటూ నేతలు, పొలిటికల్ స్ట్రాటజిస్టులు, రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఊపు పెంచుతున్నారు. ఓటేసిన జనాలు, రాజకీయనాయకులు ఎలా ఉన్నా...ఎలక్షన్ ఫలితాలు గురించి తెలుగు సినిమా పరిశ్రమ వాళ్లు ఎక్కువ ఎదురుచూస్తున్నారు.

మొదటి నుంచి సినిమాలకు ,రాజకీయాలకు అవినాభావ సంభంధం ఉంటూనే వచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సినిమా, రాజకీయాలు జమిలిగా కలిసి పోయి ప్రయాణం చేస్తున్నాయి. ఓ రకంగా ఎన్టీ రామారావు రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి మ‌రింత‌ స్ఫూర్తి క‌లిగించిన‌వి అప్ప‌ట్లో ఆయ‌న న‌టించిన సినిమాలే. ఆ ఉత్సాహంతోనే తెలుగుదేశం పార్టీ స్థాపించారు. సినిమా రంగానికి చెందిన వ్య‌క్తిగానే కాక ఆ పార్టీకి తెలుగు సినిమా రంగం ఆస‌రాగా ఉంటూ వచ్చారు.

అలాగే ఎన్టీఆర్ స్థాపించిన‌ తెలుగుదేశం పార్టీ మొద‌టి నుంచీ సినీ ప‌రిశ్ర‌మ‌తోనూ, న‌టులు, ద‌ర్శ‌కుల‌తోనూ సత్సంబంధాలు కొన‌సాగిస్తూనే ఉంది. రావుగోపాల‌రావు, స‌త్య‌నారాయ‌ణ‌, జ‌మున, జ‌య‌ప్ర‌ద‌, ముర‌ళీమోహ‌న్ వంటి వారు తెలుగుదేశం నుంచి పోటీ చేసి గెలిచారు. మోహ‌న్ బాబు, జ‌య‌సుధ వంటి వారు టీడీపీకి వ‌చ్చారు, వెళ్లారు. క‌విత‌, రోజా, దివ్య‌వాణి వంటి వారి రాజ‌కీయ ప్ర‌యాణం టీడీపీ నుంచే మొద‌లు అయ్యింది.

ఇక ఎన్టీఆర్ త‌రువాత చంద్ర‌బాబు హ‌యాంలోనూ సినీ ప‌రిశ్ర‌మ‌తో సంబంధాలు ఆ స్దాయిలో లేకపోయినా కొన‌సాగాయి. బాబు హ‌యాంలో నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు పార్టీలో కీల‌క‌పాత్ర పోషించారు. అశ్వ‌నీద‌త్, రాఘ‌వేంద్ర‌రావు, ర‌విబాబు, బోయపాటి శ్రీను వంటి వారు టీడీపీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న‌, ఎన్నిక‌ల క్యాంపెయిన్ యాడ్స్ కూడా త‌యారు చేసి పార్టీ ప‌ట్ల త‌మ అభిమానాన్ని చాటుకున్నారు.

ఏదైమైనా చంద్ర‌బాబు హ‌యాంలో కూడా పార్టీకి సినిమా రంగం అండ‌దండ‌లు అందించింది. తెర వెన‌క ఆ పార్టీకి ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించ‌డం, వీడియోలు త‌యారు చేయ‌డం వంట‌వి జ‌రిగేవి. ఇందుకు ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌గ్గ‌రుండి అన్నీ చూసుకునేవారు. ఆయ‌న చాలా ఏళ్ల పాటు పెద్ద ఎత్తున టీడీపీ ప్ర‌చార బాధ్య‌త‌ను తీసుకున్నారు. 2019 వ‌ర‌కూ ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. ఈ కాలంలోనూ సినీ ప‌రిశ్ర‌మ నుంచి ద‌ర్శ‌కులు రాఘ‌వేంద్ర‌రావు, రాజ‌మౌళి, ముర‌ళీమోహ‌న్ వంటి వారి హ‌వా సాగేది.

ఇక తెలుగు సినీ పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉక్కుపాదం మోపిందనే చెప్పాలి. రాజకీయంగా సినీ పరిశ్రమలోని పలువురు పెద్దలు తనకు వ్యతిరేకంగా ఉండడమే అందుకు కారణమని చెప్పారు. సినిమా టికెట్ల ధరల నియంత్రణ పేరుతో రాష్ట్రంలో పెద్ద సినిమాలేవీ ఒకటి రెండు రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టుకునే విధానానికి ఆయన కళ్లెం వేసారు.

బెనిఫిట్ షోలకు కూడా జగన్ ప్రభుత్వం కళ్లెం వేసింది. కేవలం నాలుగు షోలను మాత్రమే అనుమతి ఇచ్చిది. దానికి తోడు, సినిమా టికెట్ల ధరల విషయంలో స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నగర పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పోరేషన్లకు వేర్వేరు ధరలు నిర్ణయించింది. ఆ ధరలతో సినిమాలను ఆడించలేమని నిర్మాతలు, సినీ ప్రముఖులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసారు. అయినప్పటికీ జగన్ చలించ లేదు. నాగార్జున జగన్ తో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మెగాస్టార్ చిరంజీవి వెళ్లి చర్చలు జరిపినప్పటికీ లాభం లేకుండా పోయింది. దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా సినిమా ధరల విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. దిల్ రాజు వంటి కొందరు నిర్మాతలు మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు పోలైన ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. ఇక మరికొన్ని స్థానాల్లో స్వతంత్ర, రెబల్ అభ్యర్థులు కీలకంగా మారతారనే అంచనాలు ఉన్నాయి. నాలుదవ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం ఒక్కో రౌండ్ ఫలితాలు వెల్లడి అవుతాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి, అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గాల వారీగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లు, గెలిచిన, ఓడిన అభ్యర్థులు, పోలింగ్ శాతం తదితర పూర్తి వివరాలు..బయిటకు వస్తాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న అనిశ్చితి అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. బెట్టింగ్ ముఠా కూడా రకరకాల సర్వేలు, అంచనాలతో ఆందోళనకు గురవుతోంది. ఇదిలా ఉంటే, ఈ పోల్ ఫలితాలు థియేట్రికల్ వ్యాపారంపై, ముఖ్యంగా ఇద్దరు స్టార్లు పవన్ కళ్యాణ్ మరియు నందమూరి బాలకృష్ణపై భారీ ప్రభావాన్ని చూపుతాయని తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది భావిస్తున్నారు.

తెలుగుదేశం,జనసేన,బిజీపీ కూటమి పార్టీలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, పవన్ కళ్యాణ్ సినిమాలకు బిజినెస్ పరంగా డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. టిక్కెట్ రేట్లు ఇబ్బందులు ఉండవు. "హరి హర వీర మల్లు పార్ట్ 1," "OG," "ఉస్తాద్ భగత్ సింగ్"తో సహా నిర్మాణంలో ఉన్న అతని చిత్రాలన్నీ భారీ వ్యాపార ఎగ్రిమెంట్స్ అవుతాయి.

అలా కాకుండా ఇందుకు భిన్నంగా అధికార వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఖచ్చితంగా పవన్ చేస్తున్న ఈ మూడు సినిమాల బిజినెస్ పై ప్రభావం పడుతుంది. ఆర్థిక పరిమితుల కారణంగా, వీటిలో కొన్ని ప్రాజెక్టులు కు ఇబ్బంది ఎదురుకావచ్చు. చిరంజీవి,మెగా కూటమి సినిమాలపైనా ఇంపాక్ట్ పడే అవకాసం ఉందంటున్నారు.

అలాగే, కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే, నందమూరి బాలకృష్ణ , బోయపాటిల “అఖండ 2”జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే బోయపాటి తన సినిమాలో డైలాగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక అశ్వనీదత్ సైతం తన కల్కి సినిమా విషయం ప్రక్కన పెట్టి మరీ తెలుగుదేశం సపోర్ట్ ప్రకటన చేసారు. ఆ ఇంపాక్ట్ ఉంటుందా అనేది కూడా క్వచ్చిన్ మార్క్.

Read More
Next Story