ప్రభాస్ ప్రభంజనం.. ఆరు రోజుల్లో ఎన్ని వందల కోట్లంటే.
x
సలార్ లో ప్రభాస్

ప్రభాస్ ప్రభంజనం.. ఆరు రోజుల్లో ఎన్ని వందల కోట్లంటే.

ప్రభాస్ రీసెంట్ గా నటించిన సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.


ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ ఇంకా థియెటర్లలో దుమ్ము రేపుతోంది. సినిమా విడుదలై ఆరు రోజులు అవుతున్నా.. తన ప్రభావం ఇంకా తగ్గలేదు. ఇప్పటికే రూ. 500 కోట్లను తన ఖాతాలో వేసుకుని ఆరువందల కోట్లవైపుగా పరుగులు పెడుతోంది. డిసెంబర్ 22న ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదలయింది. అంతకుముందే రోజు షారుక్ ఖాన్ తన డంకీని విడుదల చేశారు.

బాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హీరాణీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే అనుకున్నంత స్థాయిలో సినిమా లేకపోవడంతో సలార్ ముందు నిలబడలేకపోయింది. కింగ్ ఖాన్ ఇదే సంవత్సరంలో పఠాన్, జవాన్ చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. రెండు చిత్రాలు కూడా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరాయి.

సలార్ కలెక్షన్లు ఏడో రోజున కాస్త తగ్గాయి. ఏడో రోజు నికరంగా దాదాపు రూ. 13.50 కోట్లను రాబట్టింది. అయితే తిరిగి వారాంతంలో కలెక్షన్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 31, జనవరి 1 కొత్తసంవత్సరం రావడంతో థియోటర్లన్నీ తిరిగి హౌజ్ ఫుల్ అవుతాయని అంచనాలున్నాయి.

సలార్ కలెక్షన్లు దేశీయ బాక్సాపీస్ వద్ద దాదాపుగా 308.90 కోట్లుగా ఉంది. అలాగే విదేశాలలో ఉన్న మొత్తం కలుపుకుంటే ఆరువందల కోట్లకు చేరువకావచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట. డిసెంబర్ 28న తెలుగు వర్షన్ ఇండియాలో 21 శాతం ఆక్యూపెన్సీని సాధించింది. బెంగళూర్ లో సిటీలో ఏడు రోజుల్లో కేవలం 6000 షోలను పూర్తి చేసింది. కేజీఎఫ్-2 తరువాత వారంరోజుల్లోనే ఈ ఘనత సాధించిన రెండో చిత్రం.

కాగా రెండో పార్ట్ శౌర్యంగ పర్వం ఎలా ఉంటుందనే దానిపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కేజీఎఫ్2 ను మించిన స్థాయిలో ఈ చిత్రం ఉండబోతుందని అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా రావడానికి ఎంతలేదన్నా మరో మూడు సంవత్సరాలుపడుతుందని తెలుస్తోంది.

సలార్ 2 రావడానికంటే ముందు ప్రభాస్- మారుతి కాంబో లో రావాల్సిన రాజా డీలక్స్ థియెటర్లలో సందడి చేస్తుంది. తరవాత నయా సంచలనం.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రం చేయనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో సందడి చేయనున్నారు.

సగటున ఒక సినిమా తీయడానికి సందీప్ రెడ్డి కూడా కనీసం రెండు సంవత్సరాలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో స్పిరిట్ పట్టాలెక్కనుంది. ఈ లెక్కన 2026 వరకూ సందీప్ తో నే ప్రభాస్ ప్రయాణం కొనసాగనుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ చిత్రం చేయనున్నారు. ఆ తరువాతనే సలార్ శౌర్యంగ పర్వం తెరకెక్కనుంది.

Read More
Next Story