
ట్రోలింగ్‌కు ‘ఆదిపురుష్’ మళ్ళీ టార్గెట్..
వరస్ట్ వీఎఫెక్స్‌కు మారుపేరు ఆదిపురుష్.. మళ్ళీ అందరినీ ఆకట్టుకుంటుంది.. ఎందుకో తెలుసా..
మర్చిపోయిన "ఆదిపురుష్" మళ్లీ జనాల జ్ఞాపకాల్లోకి వచ్చేసింది. కానీ ఈసారి మళ్లీ థియేటర్‌లో కాదు… ట్రోల్స్ లోనే!. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ కొత్త రూల్ వచ్చేసింది: "VFX గురించేమైనా మాట్లాడాలంటే… మొదట 'అదిపురుష్'ని ట్రోల్ చెయ్యాలి!".
ఇప్పటివరకూ "ఆదిపురుష్" ని మర్చిపోయిన జనం, ఇప్పుడు మళ్లీ 'రామాయణ' చిత్రానికి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ చూసి రీకాల్ చేసుకున్నారు. నితేష్ తివారీ తీస్తున్న ‘రామాయణ’ టీజర్ ఒకవైపు గూస్ బంప్స్ ఇవ్వగా, మరోవైపు "అదిపురుష్" యాదృచ్ఛికంగా మళ్లీ మెంటల్ బంప్స్ ఇచ్చింది. రెండేళ్ల క్రితం విడుదలైనప్పటి నుంచే వరసపెట్టి కొంతకాలం పాటు విమర్శల వర్షం కురిపించిన ఈ సినిమా, ఇప్పుడు మళ్లీ ట్రోలింగ్‌కు బలి అవుతోంది.
2023లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఓం రౌత్ – ప్రభాస్ కలయికలో వచ్చిన "ఆదిపురుష్"పై ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రామాయణం ఆధారంగా, అత్యాధునిక విజువల్స్‌తో ఇండియా మొత్తాన్ని అబ్బురపరచాలి అనుకున్న ఈ సినిమా…
అందరి కలల్ని చెదరగొట్టింది. వినోదం లేని స్క్రీన్‌ప్లే, హాస్యాస్పద డైలాగ్స్, పేలవమైన CG — అన్నీ కలసి దీన్ని ఒక మీమ్ మెటీరియల్ మార్చేశాయి.
సరికొత్తగా రూపొందుతున్న నితేష్ తివారీ ‘రామాయణ’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజయ్యాయి. రణబీర్ కపూర్ లార్డ్ రాముడిగా, యాష్ రావణుడిగా కనిపించిన షాట్లు చూసి… నెటిజన్స్ ఉత్సాహంగా ఫీడ్‌లోకి దూసుకొచ్చారు. “VFX అంటే వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ కాదు సార్… అదిపురుష్ లో ‘Very Funny Xperience!’” అంటూ మోతిక్కిస్తున్నారు.
"ఇదే రామాయణం!"
"ఇలాంటి రాముడిని చూశాక, అదిపురుష్ గుర్తొస్తే నవ్వొస్తుంది!"
"విజువల్స్ అంటే ఇవే!"
“ఓం రౌత్ గారు చూసారా? ఇదే వీసుఎఫ్ఎక్స్!”
అంటూ కామెంట్లుతో విరుచుకుపడుతున్నారు.
అయితే ఈ కామెంట్స్ ఎక్కువగా నార్త్ ఇండియాకు చెందిన వాళ్ళవే అవ్వటం విశేషం. ఇది కేవలం ఓ సినిమా మీద హేట్ కాకుండా, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోని లోతైన సైకలాజికల్ – పొలిటికల్ వార్‌కు సంకేతం అంటున్నారు విశ్లేషకులు. “ఆదిపురుష్” చిత్రం విడుదలైనప్పుడు, దానికి మీద పెరిగిన నెగెటివ్ రెస్పాన్స్‌ను చాలామంది ఫెయిల్ డైరెక్షన్, CG, డైలాగ్స్ పేలవతనం వంటి టెక్నికల్ అంశాలతో రివ్యూ చేశారు.
కానీ... ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఆ ప్రసక్తి కావాలనే తెస్తున్నారు అంటున్నారు ప్రభాస్ అభిమానులు. మరింత లోతుగా చూస్తే ఇది సినిమా అంతర్భాగం కంటే, పరిస్థితుల తత్వం మీద గొప్ప డిబేట్.
ఇది ఫ్లాప్ గురించి కాదు — ఇది ఒక సైద్ధాంతిక ఫైట్!
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. పలువురు నార్త్ యూట్యూబ్ చానల్స్ — సాధారణంగా సౌత్ సినిమాలంటే dubbed mass masala అని ఎంచుకుంటూ వచ్చారు. కానీ సౌత్ ఇప్పుడు తలనెత్తి నిలబడుతున్నది. అది వారికి నచ్చడం లేదనిపిస్తోంది.
నార్త్ ఇండియా కన్షస్నెస్ Vs సౌత్ ఇండియా రైజింగ్
నార్త్ ఇండియా సంస్కృతి, దేవతలు, మిథాలజీకి యజమానులు మేమే అన్న భావనలో ఉన్నప్పుడు, ఓ తెలుగు హీరో — ప్రభాస్ — రాముడు అవడం వాళ్ళకు నచ్చలేదనే వాదన అప్పట్లో వినిపించింది. సినిమా ఫెయిలైందని చెప్పే వాళ్ళ మాటల వెనుక ఒక అసహనం ఉంది: "ఎందుకు మీరు మా పౌరాణిక గాథలపై రీటెల్ చేయాలి?" అని. అయితే రామాయణం అనేది ఓ ప్రాంతానికి, ఓ వర్గానికి చెందిన ఇతిహాసం కాదనే విషయం మర్చిపోయారు.
"బాహుబలి" తో సౌత్ ఓవరాల్ గా ప్యాన్ ఇండియా స్టేటస్ సాధించటం చాలా మందికి నచ్చలేదు. "కెజీఎఫ్", "పుష్ప", "విక్రమ్", "కాంతారా" లాంటి చిత్రాలు దాన్ని మరింత బలోపేతం చేశాయి. అదే కొందరికి అసహనం కలిగించింది.
"ఆదిపురుష్" తప్పుగా ఉండొచ్చు.
కానీ ఆ ప్రయత్నం తప్పు కాదు.
అది ఒక attempted takeover of the narrative.
చరిత్రలను, మిథాలజీలను, గాథలను, కథనశైలిని ప్యాన్ ఇండియా స్థాయిలో వినిపించాలన్న ఆరాటం . ఇక అదే అసహనం గా మారడం చూస్తే... ఆవేదన కాదు, ఇది ఒక సాంస్కృతిక తిరుగుబాటు ప్రారంభమైన సంకేతంగా అనిపిస్తుంది. సినిమా ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ కావచ్చు. కానీ ప్రయత్నం ఎప్పుడూ తప్పుకాదు. దాన్ని అడ్డం పెట్టి ట్రోలింగ్ చేయటం మాత్రం ఎప్పటికీ తప్పే. కాదనలేని పొరపాటే.