
ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ రివ్యూ
ఐడియా సూపర్… కానీ సినిమా?
కథా కాలం 2026 కాదు.. ఫ్యూచరిస్టిక్ 2040!
చెన్నై అంతా నియాన్ లైట్లు, గాల్లో ఎగిరే డ్రోన్లు, హైటెక్ మోనోరైల్స్‌తో వేరే లెవల్‌లో ఉంటుంది. ఇక్కడ ప్రజలు సొంతంగా ఆలోచించడం మానేసి ప్రతిదానికి యాప్స్ మీదే డిపెండ్ అవుతుంటారు. ముఖ్యంగా సూర్య (ఎస్‌జే సూర్య) రన్ చేసే LIK (Love Insurance Kompany) యాప్ అక్కడ టాప్ ట్రెండింగ్. ప్రేమలో మోసపోతే ఇన్సూరెన్స్ ఇవ్వడం, మీ పార్ట్‌నర్ మీకు సెట్ అవుతారో లేదో ముందే స్కోర్ ఇచ్చేయడం ఈ యాప్ స్పెషాలిటీ. ఈ యాప్ ప్రేమని డేటాగా మార్చి, ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ ఎంత ఉందో చెప్పేస్తుంది. బ్రేకప్ అవుతారా? కలిసుంటారా? అన్నదీ ముందే ప్రెడిక్ట్ చేస్తుంది.
ఇక మరో వైపు, “ఆర్గానిక్ వరల్డ్” అనే ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఉంటుంది. అక్కడ మొబైల్ ఫోన్లు పూర్తిగా బ్యాన్. డిజిటల్ ప్రపంచం వల్ల దారి తప్పిన వాళ్లను తిరిగి నార్మల్ జీవితానికి తీసుకురావడానికి ఇది ఒక రీఫార్మ్ జోన్ లాంటిది. అక్కడే పెరిగిన వాడే వైబ్ వాసు (Pradeep Ranganathan). అతనికి తన తండ్రి మాటే శాసనం. మొబైల్ వాడకూడదనే నమ్మకం అతనిలో బలంగా ఉంటుంది. కానీ ఐరనీ ఏమిటంటే… వాసు LIK యాప్‌కు వాయిస్‌గా పని చేస్తాడు. ప్రేమ గురించి సలహాలు ఇస్తూ, వేల మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాడు… కానీ తనకు మాత్రం ఫోన్ లేదు.
ఇక వాసు జీవితంలోకి ఎంటర్ అవుతుంది ధీమా (Krithi Shetty). సోషల్ మీడియా మీదే బ్రతికే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమెకు ప్రతి నిర్ణయం కూడా యాప్ చెప్పిందే. ఫస్ట్ మీట్‌లోనే వాసు ఆమెతో ప్రేమలో పడిపోతాడు. తన లైఫ్‌లో మొదటిసారి మొబైల్ కొనుగోలు చేసి, LIK యాప్‌లో రిజిస్టర్ అవుతాడు. ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. చాలా రియల్, చాలా ప్యూర్‌గా. కానీ ట్విస్ట్ ఇక్కడే ఉంది.
వీళ్లిద్దరి లవ్ స్టోరీ పీక్స్‌లో ఉన్నప్పుడు, LIK యాప్ వాళ్ల ప్రేమకు లో కంపాటిబిలిటీ స్కోర్ ఇస్తుంది. బ్యాడ్ లక్ ఏంటంటే.. యాప్ అల్గారిథమ్ ప్రకారం వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఫెయిల్! ఫ్యూచర్‌లో బ్రేకప్ అవుతారని ప్రెడిక్ట్ చేస్తుంది. ధీమా తన ఫీలింగ్స్ కంటే యాప్‌ను నమ్ముతుంది. వెంటనే బ్రేకప్ చెబుతుంది. "మన మధ్య లవ్ ఉన్నా.. డేటా అబద్ధం చెప్పదుగా" అనేది ఆమె వెర్షన్. మన వాసు ఊరుకుంటాడా? "ఒక సాఫ్ట్‌వేర్ నా లవ్‌ను డిసైడ్ చేయడం ఏంటి?" అని సూర్యకు ఛాలెంజ్ విసురుతాడు. అప్పుడు ఏమైంది.
టెక్నాలజీకి అడిక్ట్ అయిన ధీమాను వాసు ఎలా రియాలిటీలోకి తెచ్చాడు? మొబైల్ స్కోర్స్ కంటే మనుషుల ఎమోషన్స్ గొప్పవని ఎలా నిరూపించాడు? డేటా తప్పు అని ప్రూవ్ చేసి తన వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ధీమా మనసుని ఎలా గెలుచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్..
దర్శకుడుVignesh Shivan తీసుకున్న ఐడియా నిజంగా క్రేజీనే. ప్రేమను ఒక యాప్‌తో కొలవడం అనే పాయింట్ యూత్ కు ఇన్‌స్టంట్ కనెక్ట్ అయ్యేదే. అందులోనూ ఇప్పటికే Love Today లో మొబైల్ ఇంపాక్ట్‌ను చూపించిన ప్రదీప్ రంగనాధన్ ని తీసుకుని…అదే లైన్‌ను ఫ్యూచర్ (2040) లోకి తీసుకెళ్లడం సాలిడ్ థాట్. అయితే ఇవన్నీ ట్రీట్మెంట్ బేస్ తో సాగే కథలు. ఎత్తుగడ ఎంత బాగా చేస్తారో..దాని కంక్లూజన్ కూడా అంతే బాగా ఇవవగలగాలి. అవి బాలెన్స్ అయ్యితేనే ఇలాంటి క్రేజీ రొమాంటిక్ కామెడీలతో గట్టెక్కగలం.
సినిమా ప్రారంభం అయ్యాక చాలా సేపు స్టోరీ వరల్డ్ బిల్డింగ్‌కే ఎక్కువ సమయం తీసుకున్నారు. ఫ్యూచర్ చెన్నై, యాప్ కల్చర్, ఆర్గానిక్ వరల్డ్… ఇవన్నీ కొత్తగా కనిపిస్తాయి కానీ ఒకేసారి చాలా విషయాలు చెప్పాలనుకోవడంతో నెరేషన్ కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది. యాప్ ఎలా పని చేస్తుంది? దాని లాజిక్ ఏంటి? అనే విషయంలో క్లారిటీ మిస్సవుతుంది. కాన్సెప్ట్ సింపుల్ అయినా, ఎక్స్‌ప్లనేషన్ మాత్రం కన్‌ఫ్యూజ్ చేస్తుంది.
అయితే కథ నిజంగా ట్రాక్ ఎక్కేది… హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయిన తర్వాతే. వాసు, ధీమా ట్రాక్‌లో ఉన్న క్యూట్‌నెస్, యూత్‌ఫుల్ వైబ్, అలాగే “App vs Heart” కాన్ఫ్లిక్ట్ మొదటిసారి బలంగా బయటపడే ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు మంచి బూస్ట్ ఇస్తుంది. అక్కడ వరకూ ఎమోషన్ కూడా కనెక్ట్ అవుతుంది, స్టోరీ మీద ఇన్వాల్వ్‌మెంట్ పెరుగుతుంది. కానీ సమస్య అసలు అక్కడి నుంచి మొదలవుతుంది.
ఇంటర్వెల్ తర్వాత కథకు కావాల్సిన డెప్త్ కనిపించదు. మొదటి భాగంలో సెట్ చేసిన ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్‌ను మరింత లోతుగా తీసుకెళ్లాల్సింది పోయి… సినిమా కాస్త రొటీన్ కమర్షియల్ ట్రాక్‌లోకి జారిపోతుంది. హీరో, విలన్ (S. J. Suryah) మధ్య వన్-టు వన్ సీన్లు మొదట్లో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా… ఆ తర్వాత రిపిటేటివ్‌గా అనిపిస్తాయి. దాంతో ఫ్రెష్ సెట్టింగ్ ఉన్నా, సీన్లలో కొత్తదనం తగ్గిపోతుంది.
హీరోయిన్ జర్నీ కూడా ఇక్కడే బలహీనపడుతుంది. ఆమె ఎందుకు యాప్‌ని అంత బలంగా నమ్ముతోంది? ఎప్పుడు, ఎలా తన మైండ్ మార్చుకుంటుంది? అన్నది కాస్త స్ట్రెచ్డ్‌గా, కొంత ప్రిడిక్టబుల్‌గా కనిపిస్తుంది. ఎమోషనల్ రిజల్యూషన్ కూడా ముందే ఊహించగలిగే విధంగా సాగుతుంది.
మరో సమస్య పేసింగ్. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు అవసరానికి మించి లాగినట్టు అనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ బ్లాక్స్, హీరో ప్రూవ్ చేసే ట్రాక్… ఇవన్నీ కొంచెం షార్ప్‌గా ఉండాల్సింది పోయి డ్రాగ్ అయ్యాయి. ఓవరాల్ గా ఓ కొత్త సెటప్, ప్రెడిక్టబుల్ రైటింగ్ తో ప్రక్కదారి పట్టింది. సెకండాఫ్ లో ప్రదీప్ నుంచి ఎక్సెపెక్ట్ చేసే యూత్ వైబ్ మిస్సైంది.
టెక్నికల్ గా..
అనిరుధ్ (Anirudh Ravichander) మ్యూజిక్ ఓకే. BGM బాగా వర్క్ అయ్యింది, కానీ పాటల్లో ఎక్స్‌పెక్ట్ చేసిన మ్యాజిక్ మాత్రం రాలేదు. టెక్నికల్‌గా సినిమా స్ట్రాంగ్. రవి వర్మన్ (Ravi Varman) విజువల్స్ రిచ్‌గా ఉన్నా, కొన్ని చోట్ల VFX కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది.
నటీనటుల్లో ...
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తన స్టైల్‌తో సినిమాని ఈజీగా క్యారీ చేశాడు. కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్స్ వర్క్ అయ్యాయి కానీ కొత్తగా గుర్తుండిపోయేంత మాత్రం లేదు. కృతిశెట్టి (Krithi Shetty)కు ఈసారి కాస్త డెప్త్ ఉన్న రోల్ దొరికింది. గ్లామర్‌తో పాటు కొద్దిగా పెర్ఫార్మెన్స్ కూడా చూపించింది, ఓకే అనిపిస్తుంది. ఎస్ జె సూర్య ఎప్పుడూ కొత్తగానే ట్రై చేస్తాడు.వర్కవుట్ అవుతూంటుంది. యోగిబాబు కామెడీ బాగుంది. మిగతా పాత్రలు తమిళ నేటివిటితో సాగిపోయాయి.
ఫైనల్ థాట్
"మన మనసులోని ఎమోషన్‌ని కొలవడానికి ఏ అల్గారిథమ్ సరిపోదు; ఫోన్ స్క్రీన్ ఇచ్చే 'రేటింగ్' కంటే, ఎదురుగా ఉన్న మనిషి ఇచ్చే 'ఫీలింగ్' మిన్న." అని చెప్పాలనే దర్శకుడు తాపత్రయం బాగుంది కానీ అందుకు తగ్గ కథే సెట్ కాలేదు. కొత్త కాన్సెప్ట్ కోసం, కొన్ని ఎమోషనల్ & ఫన్ మూమెంట్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు… కానీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే మాత్రం నిరాశే.

