
ధనుష్ ని ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసినోడే ఇప్పుడు ఆయనపై గెలిచాడు
ఊహించనవి రెండే చోట్ల జరుగుతూంటాయి. ఒకటి రాజకీయంలో మరొకటి సినిమా రంగంలో
ఊహించనవి రెండే చోట్ల జరుగుతూంటాయి. ఒకటి రాజకీయంలో మరొకటి సినిమా రంగంలో. ఫిబ్రవరి రెండో వారంలో రెండు డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. మొదటిది రిటర్న్ అఫ్ ది డ్రాగన్. లవ్ టుడేతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఓ యూత్ ఎంటర్ టైనర్ తో వచ్చాడు. అలాగే అదేవారంలో ధనుష్ దర్శకత్వంలో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా వచ్చింది. ఇక ఈ రెండు చిత్రాల్లో ఏది గెలిచింది, ఎవరిది పైచేయి అనే విషయానికి వస్తే ప్రదీప్ డామినేషన్ స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా బుక్ మై షో అమ్మకాల్లో రెండింటి మధ్య యాభై శాతానికి పైగానే తేడా కనిపించింది. డ్రాగన్ లో ఉన్న మాస్ స్టూడెంట్ అప్పీల్ ప్లస్ అయ్యింది. జాబిలమ్మలో ఉన్న సాఫ్ట్ టోన్ జస్ట్ ఓకే అనిపించుకుంది. అయితే సినిమాలు రిలీజ్ అవటం, ఒకటి హిట్, రెండోది తేడా కొట్టడం మామూలే. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఉంది.
పాత ట్వీట్ వైరల్
అప్పట్లో ప్రదీప్ రంగనాథన్ చేసిన ఓ ఓల్డ్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ లో ధనుష్ ని ట్యాగ్ చేసి ఉంది. ఏమని ట్యాగ్ చేసారంటే ధనుష్ ని ఓ సారి తన షార్ట్ ఫిలిం చూడమని. కానీ ధనుష్ అప్పట్లో పట్టించుకోలేదు. ఎంతోమంది ధనుష్ వంటి స్టార్స్ ని తమ వీడియోలు చూడమని, షార్ట్ ఫిల్మ్స్ చూడమని సోషల్ మీడియాలో ఒత్తిడి చేస్తూంటారు. స్టార్స్ లైట్ తీసుకుంటారు. కానీ ఒక్కోసారి ఆ లైట్ తీసుకున్న వ్యక్తులే తమ సినిమాపై పోటీకి వచ్చి గెలుస్తారని ఊహించలేరు.
షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలెట్టిన ప్రదీప్ రంగనాథన్ ఈ రోజున తమిళంలో లీడింగ్ స్టార్స్ లో ఒకరయ్యారు. అది నిజమైన సక్సెస్ స్టోరీ. ధనుష్ సినిమాపై అతని డ్రాగన్ సినిమా సక్సెస్ సాధించింది. అంతకు మించిన విజయం ఏముంటుంది.
‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) దర్శకత్వంలో రూపొందిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (Jaabilamma Neeku Antha Kopama) ఫిబ్రవరి 21న తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ధనుష్ మేనల్లుడు పవిష్ ఈ సినిమాలో హీరోగా నటించడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) చేసిన స్పెషల్ సాంగ్ ‘గోల్డెన్ స్పారో’ కి మంచి స్పందన వచ్చింది.
జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతంలో రూపొందిన పాటలు బాగున్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి’ సంస్థ రిలీజ్ చేసింది.మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ అదిరిపోతాయేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది ఈ సినిమా.
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) గత వారం అంటే ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ‘ఓ మై కడవులే'(తెలుగులో ‘ఓరి దేవుడా) ఫేమ్ అశ్వథ్ (Ashwath Marimuthu) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తమిళంతో పాటు తెలుగులో కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ బాగా వచ్చాయి. వీకెండ్ ను..శివ రాత్రి హాలిడే కలిసి రావడంతో ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.అన్ సీజన్ అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది