‘పుష్ప దిరూల్‌’ అల్లుఅర్జున్ కెరీర్ కు ఎందుకంతకీలకం? ఏ మేరకు కలిసొస్తుంది
x

‘పుష్ప దిరూల్‌’ అల్లుఅర్జున్ కెరీర్ కు ఎందుకంతకీలకం? ఏ మేరకు కలిసొస్తుంది

మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అల్లు అర్జున్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule) చూడబోతున్నారు.

మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అల్లు అర్జున్‌ (Alu Arjun)- సుకుమార్‌ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule) చూడబోతున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం విడుదలైన ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa The Rise)కు సీక్వెల్ గా ఇది వస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా హిట్టైతే నిర్మాతలకు ఎంత లాభం, డిస్ట్రిబ్యూటర్స్ ఏ రేంజిలో డబ్బులు వస్తాయనేది పక్కన పెడితే అల్లు అర్జున్ కెరీర్ కు ఏ స్దాయిలో, ఏ రకంగా ఈ సినిమా ఉపయోగపడబోతోందనే విషయాలు చూద్దాం.

ఇప్పుడు ఎక్కడ విన్నా ‘పుష్ప ది రూల్‌’కబుర్లే, విశేషాలే. ఈ సినిమా ఓ రేంజిలో బాక్సాఫీస్ దగ్గర హంగామా సృష్టించబోతోందనేది నిజం. ఎంత రేటు పెట్టు అయినా టికెట్ కొనుక్కుని చూడాలని సగటు ప్రేక్షకుడు తహతహలాడుతున్నారు. అందుకు తగ్గట్లుగానే అడ్వాన్స్ టికెట్ అమ్మకాలు అన్ని చోట్ల అద్భుతంగా ఉన్నాయి. అల్లు అర్జున్ హిందీ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, పుష్ప 2: ది రూల్‌ను అక్కడ బ్లాక్‌బస్టర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాజమౌళి , ప్రభాస్ తప్పించి, ఇతర టాలీవుడ్ దర్శకులు కానీ హీరోలు కానీ హిందీ మార్కెట్లో పెద్దగా రాణించలేదు.

అయితే పుష్ప ఫస్ట్ పార్ట్ తో అల్లు అర్జున్ మంచి జోష్ సంపాదించుకొని, ఇప్పుడు పుష్ప 2: ది రూల్‌తో అతిపెద్ద గ్యాంబ్లింగ్‌కు సిద్ధమయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ఉత్తర భారతదేశంలో భారీ వసూళ్లు రాబడితే, అల్లు అర్జున్‌కు ప్రభాస్ లాంటి పాన్-ఇండియన్ ఇమేజ్ వస్తుందనేది నిజం . బన్ని భవిష్యత్తులో చేయబోయే చిత్రాలు హిందీ భాషలో రికార్డు స్థాయిలో విడుదల అవుతాయి.

అలాగే అల్లు అర్జున్ బాలీవుడ్ డైరెక్టర్, చిత్రనిర్మాతలతో కలిసి పనిచేయాలని కూడా ఆలోచిస్తున్నారు. పుష్ప 2: ది రూల్ విజయవంతమైతే, బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్‌తో పనిచేయడం బన్నీకి నల్లేరు మీద నడకే. తన మార్కెట్‌ను విస్తరించడానికి పుష్ప 2: ది రూల్ సరైన చిత్రం అని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. అదే నిజమయ్యేలా కనబడుతుంది. దానికి తోడు ఈ సినిమా ప్రమోషన్‌ల కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. ఇప్పటిదాకా అల్లు అర్జున్ గురించి తెలియని వారికి సైతం ఈ సినిమా ద్వారా నొక్కి మరీ ఫలానా అని చెప్పినట్లు అవుతుంది.

దాంతో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ ఏర్పడుతుంది. నెక్ట్స్ ఎవరితో చేయబోతున్నారనేది ఇంకా ఖరారు చేయక పోయినప్పటికీ, పుష్ప 2: ది రూల్ రిజల్ట్ ని పెద్ద పెద్దవాళ్లు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రం విజయవంతమైతే, ప్రముఖ దర్శకులతో పనిచేసే అవకాశాలు ఇస్తుంది. ఈరోజు రాత్రి ప్రీమియర్ తో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ చిత్రం చాలా రకాలుగా అల్లు అర్జున్‌కు కీలకమైనది.

ఇవే కాకుండా పుష్ప 2: ది రూల్ బ్లాక్‌బస్టర్ అయితే, అల్లు అర్జున్ కెరీర్‌కు అనేక రకాలుగా లాభాలు కలుగుతాయి:

పాన్-ఇండియా గుర్తింపు:

పుష్ప మొదటి భాగం ద్వారా అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. పుష్ప 2 విజయవంతమైతే, అతని పాన్-ఇండియా ఇమేజ్ మరింత బలపడుతుంది, మరియు ప్రభాస్, యష్ వంటి నటుల సరసన స్థానం సంపాదించగలడు.

బాలీవుడ్ మార్కెట్లో నిలదొక్కు కో గలుగుతాడు:

మార్కెట్ పెరగాలంటే దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా ముఖ్యమైంది. ఈ సినిమా పెద్ద విజయమైతే, బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకులు మరియు నిర్మాణ సంస్థలతో పనిచేసే అవకాశాలు వస్తాయి.

మార్కెట్ నాలుగైదు రెట్లు పెరుగుతుంది:

పుష్ప 2 విజయంతో అతని సినిమాలు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ వంటి భాషల్లో విస్తృతంగా విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో అతని మార్కెట్ విలువ పెరుగుతుంది.

మంచి రెమ్యూనరేషన్:

పుష్ప 2 సూపర్ హిట్ అయితే అల్లు అర్జున్ సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది, మరియు అతను మరింత రెమ్యూనరేషన్ అందుకోగలడు.

సినిమా బడ్జెట్ & ప్రొడక్షన్ విలువలు:

అల్లు అర్జున్ భవిష్యత్ సినిమాల కోసం ప్రొడక్షన్ హౌస్‌లు పెద్ద బడ్జెట్ పెట్టడానికి ముందుకు వస్తాయి, ఇది అతని సినిమాల స్థాయిని మరింత పెంచుతుంది.

ప్రముఖ బ్రాండ్ & ప్రమోషనల్ ఆఫర్లు:

పుష్ప 2 విజయవంతమైతే, ప్రముఖ బ్రాండ్స్‌తో పాటు మరిన్ని అంబాసిడర్ ఆఫర్లు పొందే అవకాశం ఉంటుంది.

ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు:

ప్రముఖ దర్శకులు అతనితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు, తద్వారా అతని కెరీర్‌లో పెద్ద స్థాయి ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతుంది.

ఇలా పుష్ప 2 విజయవంతమైతే, అల్లు అర్జున్ తెలుగు సినిమా పరిమితిని దాటి, భారతీయ సినీ పరిశ్రమలో అతి పెద్ద నటుల్లో ఒకరిగా నిలిచే అవకాశముంది.

అలాగే ‘పుష్ప ది రూల్‌’ సినిమా నిమిత్తం అల్లు అర్జున్‌ రూ.300 కోట్ల పారితోషికం తీసుకున్నారట. అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటుల జాబితాలో ఆయన మొదటిస్థానంలో నిలిచారని ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్‌ ఇటీవల ప్రకటించింది.

Read More
Next Story