అండర్‌వర్‌ల్డ్‌లో ఇక అనుష్క రూల్…
x

అండర్‌వర్‌ల్డ్‌లో ఇక అనుష్క రూల్…

గ్యాంగ్‌స్టర్‌గా గన్ తో దేవసేన?!


"ఈసారి అనుష్క గ్లామర్ తో కాదు... గన్‌తో వస్తోంది!"

"మహిష్మతిలో దేవసేన… ఇప్పుడు అండర్‌వర్ల్డ్‌లో గ్యాంగస్టర్ గా!" దుమ్ము రేపబోతోంది

“ఒకప్పుడు ఆమె ఊరంతా భయపడ్డ భయంకర ఆత్మకే భయం పుట్టించిన అరుంధతి… తరువాత యుద్ధ భూమిని శాంతిగా చీల్చిన దేవసేన… తర్వాత గ్యాప్ తీసుకున్న భాగమతి. మళ్లీ తనేంటో చూపించటానికి వస్తోంది. అలా ఇలా కాదు గ్యాంగస్టర్ గా తెరపై అదరకొట్టనుందని తెలుస్తోంది. అనుష్క ది కేవలం కమ్‌బ్యాక్ కాదు – ఓ కోలీవుడ్, టాలీవుడ్ మిక్స్ అయిన స్టార్ మెటీరియల్ గర్జన.”

పీక్‌లో ఉన్నప్పుడు తగ్గడం… కానీ క్రేజ్‌ మాత్రం తగ్గనివ్వకపోవడం – ఇది అనుష్క శెట్టి మాత్రమే చేయగలిగే మ్యాజిక్!"

"Comebacks are not for the weak. They're for the warriors who rest, rise, and roar again!"

2005లో సూపర్ చిత్రంతో పరిచయమైన అనుష్క, గ్లామర్ హీరోయిన్‌గా కెరీర్ ఆరంభించింది. కానీ, అరుంధతి (2009) చిత్రం ఆమెను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా ద్వారా ఆమె స్టార్డమ్‌ను గ్లామర్ తో మిళితం చేసిన హీరోయిన్ గా నిలిచింది. "అనుష్క కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు" అనే నమ్మకం క్రియేట్ చేసిన చిత్రం ఇది.

ఆ తర్వాత వేదం, రుద్రమదేవి, భాగమతి వంటి ప్రాజెక్టుల్లో అనుష్క నటన, స్క్రీన్ ప్రెజెన్స్ కలిపే సమతౌల్యాన్ని తీసుకొచ్చింది. బాహుబలి చిత్రం నెక్ట్స్ లెవిల్ లోకి తీసుకెళ్లిపోయింది.

సైలెన్స్ – అనూహ్యమైన గ్యాప్ వెనకున్న నిజాలు

సైజ్ జీరో (2015) కోసం ఆమె ఫిజికల్‌గా వేసిన కృషి, మెథడాక్టింగ్‌లో ఆమె చేసిన శ్రమ – అదే ఆమె కెరీర్‌లో ఓ స్పీడ్ బ్రేకర్ అయ్యింది. ఆమె బరువు పెరగడం ఫిజికల్ గానే కాక, మానసికంగా కూడా ఇబ్బందులు తెచ్చి పెట్టింది.

‘నిశ్శబ్దం’ అనే టైటిల్ ఆమె వ్యక్తిగత జీవితానికీ పరిపూర్ణంగా సరిపోతుంది. ఎందుకంటే... ఆమె నిజంగానే ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది.

Miss Shetty, Mr. Polishetty – కొత్త ఛాప్టర్ కి పరిచయం

2023లో వచ్చిన ఈ చిత్రం, అనుష్కలోని ఎమోషన్, మేచ్యూర్డ్ లేడీ రొమాన్స్‌కు నాంది పలికింది.ఆమె సాదా సీన్‌ల్లోనూ, ఒక్క కన్నుతో భావం పలికించే నటన ఆమె ఏంటో ఇండస్ట్రీ మళ్లీ చాటి చెప్పింది.

"There is power in restraint… and no one embodies it better than Anushka.”

అనుష్క – సైలెంట్ ఫైటర్, సాలిడ్ స్టార్డమ్

“సైజ్ జీరో” తర్వాత అనూహ్యంగా బరువు పెరిగిన అనుష్క, ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా మళ్లీ ఫిట్‌నెస్‌లోకి రావడానికి కాస్త సమయం తీసుకుంది. కానీ… ఆమె కెరీర్ మీద ఆ ప్రభావం రాలేదు. ఎందుకంటే… ఆమె వెనక ఉన్న ఆరా అదిరిపోయేంత ఉంది. “నిశ్శబ్దం” ద్వారా వెనుదిరిగిన ఆమె, “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి”లో సెన్సిబుల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఈ చిత్రం డీసెంట్ హిట్ సాధించింది.

ఇప్పుడు ‘ఘాటి’తో రెడీ

ప్రస్తుతం అనుష్క “ఘాటి” అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ చూస్తే ఇది మాస్, రఫ్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథ అనిపిస్తుంది. బహుశా ఇది ఆమె పాత ఫైర్‌ని మళ్లీ వెలిగించే సినిమా కావచ్చు.

వరుస హిట్స్ టార్గెట్

ఇంతవరకు ప్రతి సినిమా మధ్యలో 2-3 ఏళ్ల గ్యాప్ తీసుకుంటూ వచ్చిన అనుష్క, ఇకపై అలాంటి తీరుకు గుడ్‌బై చెబుతోంది. వరుసగా కథలు వినడం ప్రారంభించింది. ఇప్పటికే ‘జైలర్ 2’లో రజినీకాంత్ సరసన కీలక పాత్రలో ఆమె ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో లోకేష్ కనగరాజ్ యూనివర్స్‌లో ఓ సాలిడ్ ఫిమేల్ లీడ్‌గా కనిపించనుందంటూ టాక్ ఉంది.

‘కూలీ’ తర్వాత ‘ఖైది 2’: లోకేష్ భారీగా ప్లాన్ చేస్తున్న సీక్వెల్

లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, అదే సమయంలో ‘ఖైదీ 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించేశారు. కథ, స్క్రిప్ట్ పనులతో పాటు నటీనటుల ఎంపికలో కూడా లాగతీయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే అనుష్క శెట్టి పేరు పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది.

అనుష్క – గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఊహించగలరా?

ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అనుష్క ‘ఖైదీ 2’ లో ఒక శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ‘భాగమతి’, ‘అరుందతి’, ‘వేదం’ వంటి సినిమాల్లో ఆమె ఇప్పటికే మహిళా ప్రాధాన్య పాత్రలను ఎంత బలంగా నటించగలరో నిరూపించింది. ఆ ఎక్సపీరియన్స్ తో ఆమె ‘ఖైదీ 2’లో కనిపిస్తే, అది సినిమాకే ఓ సడెన్ రైజ్ ఇవ్వగలదు.

డిల్లీ రిటర్న్ తో పాటు అనుష్క సర్ప్రైజ్ ఎంట్రీ?

‘ఖైదీ ’ లో కార్తీ పోషించిన డిల్లీ పాత్ర ఎంతగా పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే, అనుష్క వంటి స్టార్ ఈ యూనివర్స్‌లో అడుగుపెడుతున్నారన్న న్యూస్ సినీ వర్గాల్లో కొత్త ఎగ్జైట్‌మెంట్‌ క్రియేట్ చేస్తోంది.

‘భాగమతి 2’... లైన్‌లో ఉంది!

ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న థ్రిల్లర్ “భాగమతి”కి సీక్వెల్ రానుందన్న వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ ఏడాదిలో దీనిపై అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.

ఇక, ‘జైలర్ 2’, లోకేష్ కనగరాజ్ యూనివర్స్, భాగమతి 2 – అన్నీ ఆమెలో ఉన్న “మెయిన్ స్ట్రీమ్ మాస్ + లేడీ ఒరియెంటెడ్ డ్రామా”ని తిరిగి వెలిగించడానికి స్ఫూర్తిదాయక అవకాశాలు.

ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ

ఇండస్ట్రీ అనుష్క గురించి వేసే లెక్కలు వేరే. ఆమె గురించి చెప్పే మాటలు ఇవే. బాక్సాఫీస్ బ్యాంకబిలిటీ – అనుష్క సోలోగా ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టిన అరుదైన నటి. ఫ్యాన్ బేస్ – గ్లామర్, పర్ఫార్మెన్స్, మానవీయత – మూడు కలిపిన స్టార్. డైరెక్టర్లకు ఫేవరెట్ – గుణశేఖర్, రాజమౌళి, క్రిష్, మొదలైన వారంతా ఆమెపై నమ్మకం పెట్టిన దర్శకులు.

సోలోగా 50 కోట్లు కలెక్ట్ చేసిన హీరోయిన్

భారీ మాస్ కమర్షియల్స్‌లోనూ, లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్స్‌లోనూ భారీ కలెక్షన్స్ సాధించిన అనుష్క, సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఆమె సినిమాలకి ఒక స్థిరమైన బజ్, ఓ క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మళ్లీ ఆమె వరుస ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెట్టడమే ఇండస్ట్రీకి ప్లస్.

భవిష్యత్తు స్ట్రాటజీ – స్మార్ట్ షిఫ్ట్ టు సీనియర్ రోల్స్

అనుష్క ఇప్పట్లో మాస్ నంబర్లు డాన్స్ చేయకపోయినా, తన వయస్సుతో పాటు స్క్రీన్ స్టేట్‌మెంట్‌ని మార్చుకుంటూ వెళ్లగలిగే సామధ్యం ఉంది. అదే సమంయలో ఆమె కమర్షియల్ ఛాయల్ని వదలకుండా, ఎమోషనల్‌గా డీప్ గా ఉండే కథల్ని ఎంచుకుంటే – హిందీలో టబు,రేఖ స్దాయికి వెళ్లచ్చు.

అనుష్క ఎరా 2.0

ఇకపైన అనుష్క పేరు మీద వచ్చే ప్రతి పోస్టర్‌కు, ప్రతి టీజర్‌కు… స్క్రీన్ మీద అదిరిపోయే రియాక్షన్స్ రావడం ఖాయం.

"Once a Queen… always a thunderstorm!"

ఫ్యాన్స్ రెడీగా ఉండండి – సైలెన్స్ బ్రేక్ అయింది… ఇప్పుడు ఘాటీ గర్జన మొదలవుతుంది!

Read More
Next Story