హాట్ సీన్స్ హైలెట్ ... ది వెడ్డింగ్ గెస్ట్ రివ్యూ
x
Source: Twitter

హాట్ సీన్స్ హైలెట్ ... 'ది వెడ్డింగ్ గెస్ట్' రివ్యూ

రాధిక అప్టే నటించిన హాలీవుడ్ సినిమా ‘ది వెడ్డింగ్ గెస్ట్’ తెలుగులోకి కూడా వచ్చేసింది. ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎలా ఉందంటే..


నిజం మాట్లాడుకోవాలంటే ఈ సినిమా కోసం మనవాళ్లు చాలా కాలంగా కళ్లు కాయలు కాచేలే ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ఇందులో రాథికా అప్టే న్యూడ్‌గా కొన్ని సీన్స్ చేయటమే. ఇదో హాలీవుడ్ సినిమా. ఇందులో రాధిక చేసిన పాత్రే అప్ప‌ట్లో అంతటా పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ సినిమా ఇండియాలోనే షూటింగ్ జరుపుకుంది. పబ్లిసిటీలో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన న్యూడ్ సీన్ బయటికి రావడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ఐదేళ్ల తర్వాత 'నెట్ ఫ్లిక్స్' ద్వారా అందుబాటులోకి వచ్చింది. మైఖేల్ వింటర్ బాటమ్ డైరక్ట్ చేసిన ఈ కళాఖండంలో కేవలం హాట్ సీన్స్ మాత్రమేనా ఇంకేమైనా కథ.. కాకరకాయ ఉందా అనేది చూద్దాం.

జై (దేవ్ పటేల్) అనే కుర్రాడు పాకిస్తాన్‌లో ఉండే అమ్మాయి స‌మీరా (రాధికా అప్టే)ని ఇండియా తీసుకురావాలని బయిలుదేరతాడు. అందుకోసం లాహోర్ వెళ్ళి తనను ఎవరూ గుర్తు పట్టకుండా కార్లు, సిమ్ కార్డులు మారుస్తూ మేనేజ్ చేస్తూంటాడు. రెండు గన్స్ కొనుక్కుని సేప్టీగా సమీరా ఉండే ప్రాంతానికి చేరుకుంటాడు. ఓ రాత్రి వేళ ఆమెను కిడ్నాప్ చేస్తాడు. అడ్డు వచ్చిన వాచ్‌మన్‌ని కాల్చేస్తాడు. ఇదంతా సమీరాకు అర్థం కాదు. ఎవరితను.. ఎందుకు తనను కిడ్నాప్ చేస్తున్నాడు అనే ఆలోచనలో ఉంటుంది ఆమె. ఆ ప్రశ్నే అడుగుతుంది కూడా.

అప్పుడు మన జై బాబు అసలు విషయం రివీల్ చేస్తాడు. సమీరాని సేఫ్‌గా ఇండియా తీసుకెళ్లటానికి కాంట్రాక్ట్ తీసుకున్నానని, అందులో భాగమే ఈ కిడ్నాప్ అనీ అంటాడు. తనకు కాంటాక్ట్ ఇచ్చింది ఆమె లవర్ దీపేశ్ (జిమ్ సర్భ్)అని చెప్తాడు. అందుకోసం తను పెద్ద మొత్తం తీసుకున్నాడని, ఇండియాలోని అమృతసర్ తీసుకెళ్లి అప్పచెప్తాను అంటాడు. ఆమె కూడా ఓకే అంటుంది. ఇద్దరు ఇండియా బయలుదేరతారు.

అయితే ఈ లోగా పాక్‌లో ఆమె కిడ్నాప్ అయిన విషయం, వాచ్‌మన్ హత్య వైరల్ అవుతాయి. దాంతో ఆ కాంటాక్ట్ అప్పగించిన దీపేష్ భయపడి.. ఆమెను వెనక్కి తీసుకెళ్లి పాక్‌లో దింపేయమని చెప్తాడు. ఆ విషయం తెలిసిన సమీరా షాక్ అవుతుంది. దీపేష్ కన్నా జై .. అసలైన మగాడు అని భావించి దగ్గరవుతుంది. అంతేకాకుండా అతనితో మరో షాకింగ్ విషయం చెప్తుంది. అక్కడ నుంచి కథ మరో టర్న్ తీసుకుంటుంది. ఆ షాకింగ్ విషయం ఏమిటి.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకుంటే బాగుంటుంది.

ఇక రాధిక ఆప్టే - దేవ్ పటేల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ 'ది వెడ్డింగ్ గెస్ట్' అనే హాలీవుడ్ మూవీ, 2019లో అక్కడి థియేటర్స్‌లో విడుదలైంది. అక్కడ ఓకే అనిపించుకుంది. అయితే ఇన్నాళ్లకు నెట్ ప్లిక్స్ వాడు రీజనల్ మార్కెట్‌లో దేవ్ పటేల్‌కు రాధిక అప్టేకు ఉన్న మార్కెట్ గమనించి ఇక్కడ వెర్షన్స్ కూడా రిలీజ్ చేశారు. రాధికా అప్టే (Radhika Apte)పేరుకి హిందీ హీరోయిన్ కానీ మన తెలుగువాళ్లకి బాగా పరిచయం. కాబట్టి ఇక్కడ కూడా బాగానే ట్రెండ్ అవుతోంది.

ఈ సినిమాలో చూడటానికి ఏముంది అంటే … రాధికా ఆప్టే, దేవ్ పటేల్ శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించడం. అప్పట్లో ఆమె లో దుస్తుల సీన్లపై విమర్శలు కూడా వచ్చాయి. ఆ విమర్శలపై స్పందించిన రాధికా.. బోల్డ్ సీన్స్‌లో నటించే విషయంలో తనకు ఎలాంటి భయాలు ఉండవని చెప్పింది. ‘‘చిన్నప్పటి నుంచి ఎన్నో హాలీవుడ్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం చూశా. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలి’’ అంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా ఆ సీన్స్ చూడటానికి జనం ఎగబడుతున్నారనేది నిజం.

టెక్నికల్‌గా చూస్తే హాలీవుడ్ స్టాండర్డ్స్ అంతగా కనపడవు. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ జస్ట్ ఓకే అన్నట్లు ఉంటాయి. ఫోటోగ్రఫి మాత్రం బాగుంటుంది. తెలుగులో రక్త చరిత్ర, ధోని, లెజెండ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రాధిక అప్టేకు ఈ సినిమా కూడా ఇక్కడ మనవాళ్లు గుర్తు పెట్టుకో తగ్గ సినిమా అవుతుందనడంలో సందేహం లేదు.

చూడచ్చా?

సరదాగా ఓ లుక్కేయటానికి కాలక్షేపానికి లోటు లేని సినిమా.. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు

ఎక్కడ చూడవచ్చు?

నెట్ ప్లిక్స్ (తెలుగులో ఉంది)

Read More
Next Story