
మహేశ్ “గ్లోబ్‌ట్రాటర్” 120 దేశాల్లో రిలీజ్, అసలు నిజం ఏమిటి?
రాజమౌళి డ్రీమ్? లేక సోషల్ మీడియా హైపా?
ఈ రోజుల్లో సినిమాకు మార్కెట్ అనేది డైరక్టర్, ప్రొడక్షన్ కంపెనీ లేదా స్టార్ పవర్‌పైనే కాకుండా, దాన్ని ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు? దాని నుంచి క్రియేట్ అయిన బజ్ ఏస్దాయిలో ఉంది అనే విషయం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటోంది. అందుకు రాజమౌళి వంటి దర్శకుల సినిమాలు అతీతం కాదు. అలాగే అల్లు అర్జున్, అట్లీ సినిమా ఈ లిస్ట్ లోకి రాకుండా పోదు.
ఈ బజ్ క్రియేషన్ ముఖ్యంగా సినిమా రిలీజ్ రేంజ్ ఏ స్దాయిలో ఉండబోతోంది? సినిమాలో ఎలాంటి VFX విజువల్స్ చూపిస్తున్నారు? హాలీవుడ్ కంపెనీలు ప్రమోషన్‌లో భాగమయ్యాయా? అనే చర్చతో మొదవుతున్నాయి. దాంతో అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ఆడియన్స్ మైండ్‌లోనూ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది.
ఇదే కంటెక్స్ట్‌లో రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ “గ్లోబ్‌ట్రాటర్” మీద సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్‌లో వస్తున్న ఈ మ్యాగ్నమ్ ఓపస్‌ను ఒకేసారి 120 దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది! ఈ నెంబర్ వినగానే ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్తున్నారనేది నిజం. అదే సమయంలో మరికొందరు ఇది కేవలం కావాలని క్రేజ్, బజ్ కోసం క్రియేట్ చేసిన రూమర్స్ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ టాక్ ఎలా మొదలైంది
SSMB29 సినిమా పనుల నిమిత్తం కెన్యా వెళ్లారు రాజమౌళి. అక్కడ ఆ దేశ క్యాబినెట్ సెక్రెటరీ ముసాలియా ముదవాదిని కలిశారు. రాజమౌళితో భేటీ అనంతరం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ముసాలియా తమ దేశాన్ని SSMB29 షూటింగ్ కు ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈస్ట్ ఆఫ్రికా అంతటా పర్యటించిన రాజమౌళి టీం చివరకు తమ దేశాన్ని ఎంపిక చేసుకుందని కాస్త సంతోషంతో చెప్పారు.
కెన్యాలో రాజమౌళి షూటింగ్ చేస్తారని తెలిపిన ముసాలియా... ఆ తరువాత సినిమా విడుదల గురించి కూడా పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలలో SSMB29 విడుదల అవుతుందని తెలిపారు. 100 కోట్ల మందికి పైగా సినిమా చూస్తారని చెప్పారు. అటువంటి సినిమా చిత్రీకరణ తమ దేశంలో జరుగుతుండడం ఎంతో సంతోషంగా ఉందని వివరించారు.
120 దేశాల రిలీజ్ – నిజమేనా?
ఇక ఇండియన్ సినిమాల ఓవర్సీస్ మార్కెట్ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్, జపాన్, మలేసియా, సింగపూర్, ఫ్రాన్స్ వరకు మాత్రమే స్కోప్ కలిగి ఉంది. ఇవన్నీ కలిపినా రెండు డజన్లను మించవు. అలాంటప్పుడు “120 దేశాలు” అనే మాట వాస్తవమా? లేక సోషల్ మీడియా క్రియేట్ చేసిన హైప్ మాత్రమేనా అనేది ఇప్పుడు యాంటి ఫ్యాన్స్ తో మీడియా వారు మాట్లాడుతున్న అంశం.
హాలీవుడ్ స్టైల్ మార్కెటింగ్?
ఈ సినిమా గురించిన కొత్త టాక్ ఏమిటంటే ఈ సినిమా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కోసం Connekkt Mob Scene అనే హాలీవుడ్ ప్రొమోషన్ ఏజెన్సీ జాయిన్ అవుతోంది. రాజమౌళి ఎప్పుడూ గ్లోబల్ లెవల్ ఆలోచిస్తారు కాబట్టి, ఇది నిజమైతే “గ్లోబ్‌ట్రాటర్” ప్రమోషన్స్ సింపుల్‌గా కాదు – హాలీవుడ్ స్థాయిలో హడావిడి జరుగుతుందని గ్యారంటీ.
VFX అంచనాలు
అలాగే బాహుబలి, RRRతో రాజమౌళి ఇప్పటికే విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌లో గ్లోబల్ మార్క్ వేశారు. కాబట్టి “గ్లోబ్‌ట్రాటర్”లో ఏ రేంజ్ VFX ఉంటుందో అన్నదే డిస్కషన్ లో మరో టాపిక్. కెన్యాలో షూట్ అవుతున్న యాక్షన్ బ్లాక్స్, మ్యాసివ్ సెట్స్ అన్నీ కలిపి గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్ చేస్తున్నారని స్పష్టమవుతోంది.
ఏదైమైనా
మార్కెటింగ్ కోణంలో చూసుకుంటే – “గ్లోబ్‌ట్రాటర్” ఇప్పటికే గ్లోబల్ రిలీజ్ చర్చ ద్వారా బజ్ క్రియేట్ చేసింది. ఇది నిజమో కాదో పక్కన పెడితే… రాజమౌళి సినిమా అనగానే ఆడియన్స్, మీడియా, గ్లోబల్ ట్రేడ్ అంతా అటెన్షన్ ఇస్తారనేది ఫాక్ట్. కానీ అసలు గేమ్ మాత్రం – 120 దేశాల నెంబర్ నిజమైతే ఇది హిస్టరీ, కాదనుకుంటే ఇది సోషల్ మీడియా హైప్!
ఇంతకీ ఈ విషయమై మీరేమనుకుంటున్నారు – “గ్లోబ్‌ట్రాటర్” మార్కెటింగ్ స్ట్రాటజీ నిజంగానే హాలీవుడ్ స్థాయిలో జరిగేలా ఉందా? లేక బజ్‌కే పరిమితం అవనుందా?