రజనీ మార్కెట్ ఏమైంది? ‘వేట్టయన్’అంత దారుణమా, 'భారతీయుడు 2' మించిన డిజాస్టర్?
బాహుబలి 2 తో ప్రారంభమైన ప్యాన్ ఇండియన్ రిలీజ్ కాన్సెప్టుని ప్రతీ సౌతిండన్ ఫిల్మ్ ఎడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్తోంది.
బాహుబలి 2 తో ప్రారంభమైన ప్యాన్ ఇండియన్ రిలీజ్ కాన్సెప్టుని ప్రతీ సౌతిండన్ ఫిల్మ్ ఎడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్తోంది. ప్రతీ పెద్ద సౌత్ సినిమా కూడా హిందీలో రిలీజ్ అవుతోంది. అదే సమయంలో నార్త్ ఫిల్మ్ లు సైతం సౌత్ లో భారీ గా రిలీజ్ చేస్తున్నారు. అయితే రిజల్ట్ మాత్రం అంతంత మాత్రంగా ఉంటోంది. ఏనిమల్ తప్పించి హిందీ హీరోల సినిమాలు ఈ మధ్య ఎవరూ మాట్లాడుకోలేదు. షారూఖ్ డింకీ సినిమా డబ్బింగ్ పూర్తయ్యాక ..మార్కెట్ అంచనా వేసి మిగతా భాషల్లో రిలీజ్ ఆపేసారు.
సౌత్ నుంచి వెళ్లిన కాంతారా, కల్కి, దేవర అంటూ అప్పుడప్పుడూ మాత్రమే వర్కవుట్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న భారీగా రిలీజ్ చేసిన భారతీయుడు 2 హిందీలోనే కాకుండా అంతటా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు రజనీ ‘వేట్టయన్’ వంతు వచ్చింది. ఈ సినిమాలో అమితాబ్ ని అటు ఫహాద్ ఫాజిల్ ని తీసుకుని తెలుగు నుంచి రావు రమేష్ వంటి ఆర్టిస్ట్ లను తీసుకుని ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ చేసారు. అయితే ఫలితం మాత్రం సున్నా.
రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘వేట్టయన్’ఈ రిజల్ట్ ని ఎవరూ ఊహించలేదు. సక్సెస్ ఫుల్ చిత్రం ‘జైలర్’ తర్వాత ఆయన్నుంచి వచ్చిన పూర్తిస్థాయి సినిమా ఇదే కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించడం... రజనీకి తోడుగా అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి తదితర తారాగణం నటించడంతో‘వేట్టయన్’పై మరిన్ని ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. మంచి ఓపినింగ్స్ తో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఓ కొత్త చర్చకు తావిచ్చింది. ఈ సినిమా సౌత్ మార్కెట్ కన్నా అందరి దృష్టీ నార్త్ లో ఎలా వర్కవుట్ అవుతుందనే దానిపైనే దృష్టి ఉంది.
ఈ యేడు సౌతిండిలా సినిమాలు చాలానే బాలీవుడ్ లో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆడియన్స్ ఎటెన్షన్ కు ఎట్రాక్ట్ చేయటంలో ఫెయిలయ్యాయి. అందుకు కారణం అందులో కంటెంట్ ఆల్ ఇండియా మార్కెట్ కు సరపడ లేకపోవటమే. 3 కోట్లు కూడా తిరిగి రాబట్టలేని సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. రజనీకాంత్ తాజా చిత్రం ‘వేట్టయన్’ విషయానికి వస్తే హిందీ ఆడియన్స్ ని ఈ సినిమా కూడా ఇంప్రెస్ చేయలేకపోయింది. సమస్య తమిళనాడుకు సంభందించినట్లు ఉండటం మైనస్ గా మారింది. నార్త్ లో కేవలం ‘వేట్టయన్’చిత్రం 0.70 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. అసలు అక్కడ బజ్ క్రియేట్ చేయలేకపోయింది. అమితాబ్ ఉండటం కూడా సినిమాకు కలిసి రాలేదు. అలాగే మహారాష్ట్రలో రజనీకాంత్ బాగా పాపులర్ ఫేస్. అయినా ఎవరూ పట్టించుకోలేదు. మారిన జనరేషన్ రజనీకాంత్ కు ఓటు వేయలేదు.
కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రానికి ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. ఫర్ట్ పార్ట్ ని నార్త్ లో రిలీజ్ కు ముందు రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సెకండ్ పార్ట్ కు ఆ ఇంప్రెషన్ ఏమి కనిపించలేదు. సినిమా బాగోకపోవటంతో మార్నింగ్ షోకే డబ్బాలు వెనక్కి వచ్చాసాయి. డబ్బులు రికవరీ లేదు. అక్కడ తీసుకున్న నిర్మాతలకు పెట్టిన పెట్టుబడిలో పావు వంతు కూడా రికవరీ లేదు. ఇప్పుడు ‘వేట్టయన్’ది అదే పరిస్దితి.
ఈ సంవత్సరం హను-మాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు హిందీ డబ్బింగ్ లు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. హను మాన్ అక్కడ దుమ్ము రేపింది. కెప్టెన్ మిల్లర్ ని పట్టించుకోలేదు. 0.65 కోట్లు మాత్రమే కెప్టెన్ మిల్లర్ తెచ్చుకుంది. ఆ తర్వాత విజయ్ GOAT చిత్రం 2.10 కోట్లు తెచ్చుకుని బాగానే కలెక్షన్స్ వచ్చాయే అని మళ్లీ అక్కడ మార్కెట్ పై ఆశలు రేపింది. మిగతా దేశమంతటా డిజాస్టర్ అయినా అక్కడ ఓకే అనిపించుకుంది. అంతకు ముందు విజయ్ మాస్టర్ సినిమా కూడా బాగానే ఆడింది. కానీ ఇప్పుడు అదే అంచనాలతో ‘వేట్టయన్’రిలీజ్ చేస్తే భారతీయుడు 2 డిజాస్టర్ స్దాయిలో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ని ముంచేస్తోందని తేలిపోయింది. కాబట్టి కంటెంట్ నార్త్ ఇండియాకు కనెక్ట్ అయ్యేది చూసుకుని మాత్రమే ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకోవాలనే పాఠం ‘వేట్టయన్’ నేర్పినట్లు అయ్యింది.
‘వేట్టయన్’చిత్రం తెలుగులోనూ బాగా నిరాశపరిచింది. ఓపినింగ్స్ తెప్పించుకోలేదు. దసరా శెలవులను క్యాష్ చేసుకోలేని సిట్యువేషన్. రజనీ మార్క్ డైలాగ్స్ తో .. ఫైట్లతో అదిరిపోతుందేమో అనుకున్నవారికే నిరాశ ఎదురైంది. ‘జై భీమ్’ తరహాలోనే మరోసారి డైరక్టర్ న్యాయం, విద్య సమానంగా అందాలనే ఓ బలమైన అంశాల్ని ఎంచుకుని ఈ చిత్రాన్ని మలిచారు. కథ చెప్పిన ఉద్దేశం, దాన్ని ఓ క్రైమ్ థ్రిల్లర్‌గా ఎన్‌కౌంటర్స్‌తో ముడిపెట్టి చెప్పిన విధానం బాగుంది కానీ కొంతదూరం వెళ్లాక మరీ మెసేజ్ ఓరియెంటెడ్ గా మారిపోయింది. రజనీకాంత్ ఇమేజ్‌కి తగ్గ కమర్షియల్ ఎలమెంట్స్ కానీ, ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లు కానీ లేకపోవడంతో సినిమా ఒక దశ దాటిన తర్వాత సోషల్ కామెడ్ తో కూడిన ఓ డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. దాంతో తెలుగులో ఈ సినిమా జస్ట్ ఓకే సినిమా అనిపించుకుంది. ఫస్టాఫ్ అదిరిపోయింది కానీ సెకండాఫ్ సోసో గా ఉందని తేల్చేసారు. ఓవరాల్ గా సినిమా అసలు బాగోలేదని మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యిపోయింది.