హరికథ (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!
x

'హరికథ' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

సినిమాలైనా, వెబ్ సీరీస్ లు అయినా వైడ్ రీచ్ కోసం ఇతిహాసాలు, పురాణాలను బేస్ చేసుకుని వస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే అదో ట్రెండ్ గా మారింది.

సినిమాలైనా, వెబ్ సీరీస్ లు అయినా వైడ్ రీచ్ కోసం ఇతిహాసాలు, పురాణాలను బేస్ చేసుకుని వస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే అదో ట్రెండ్ గా మారింది. అందులోనూ మైథలాజికల్‌ కాన్సెప్టు తీసుకుంటే పాత్రల కు సంభందించిన మేకప్ దగ్గర నుంచి అన్ని కొత్తగా ఆవిష్కరణ జరుగుతాయి. దాంతో అందరూ అటు వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి ఎలిమెంట్స్ తో ప్రేక్షకులలో ఓ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ఈ సీరిస్ రిలీజైంది. తెలుగులో ఉన్న పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ సీరిస్ ఎలా ఉంది, కథేంటి, చూడదగ్గేదేనా వంటి విషయాలు చూద్దాం

కథేంటి

80,90ల్లో.. అరకు ప్రాంతంలో నడిచే ఈ కథలో రంగాచారి (రాజేంద్ర ప్రసాద్) తన టీమ్ తో కలిసి నాటకాలు ఆడుతూ ఉంటారు. విష్ణుమూర్తి దశావతార ఘట్టాలకు సంబంధించి ఒక్కోరోజు ఒక్కో నాటకాన్ని ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆయన ఏ అవతారం గురించి అయితే నాటకాన్ని ఆ రోజు ప్రదర్శించాడో, ఆ అవతారం చేతిలో ఆ ఊరికి చెందిన ఒక్కో వ్యక్తి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఆ ఊరికి చెందిన వ్యక్తులు అలా దారుణంగా చంపబడుతూ ఉండటం అందరిలో షాక్ ని,భయాన్ని కలిగిస్తుంది.

మరీ ముఖ్యంగా నృసింహ అవతారం లో హత్య జరుగుతూ ఉండటం ఒక వ్యక్తి చూడటంతో అది రెట్టింపు అవుతుంది. దాంతో భగవంతుడే దుష్టులను శిక్షిస్తున్నాడనే విషయం అందరూ మాట్లాడుకోవడం మొదలెడతారు. అప్పటి నుంచి అందరికీ భయం పీక్స్ కు చేరుకుంటుంది. ఇదిలా ఉంటే పోలీస్ గా అక్కడ ఉన్న భరత్ (అర్జున్ అంబటి) కి స్వాతితో పెళ్లి కుదురుతుంది. దాంతో విశాఖ నుంచి అతని స్నేహితుడు,మరో పోలీస్ అధికారి విరాట్ (శ్రీరామ్) అక్కడికి వస్తాడు.

అయితే ఓ రోజున భరత్ సైతం హత్యకు గురి అవటంతో విరాట్ షాక్ అవుతాడు. దాంతో అంతకు ముందు జరిగిన హత్యలు గురించి ఆరా తీయడం మొదలెడతాడు. రంగాచారి ప్రదర్శించే నాటకాలకు, ఈ హత్యలకు ఉన్న లింక్ ని విడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో బయటపడ్డ నిజాలు ఏమిటి, అసలు రంగాచారి కేవలం దశావతార ఘట్టాలే ఎందుకు ప్రదర్శిస్తున్నాడు. ఇందులో చామంతి (దివి), ట్రైనీ జర్నలిస్ట్ లీసా (పూజిత పొన్నాడ) పాత్రలేంటి?, వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

సీరియస్ కథ,కథనం, ఇతిహాసం టచ్ ఉన్న ఈ సీరిస్ ప్రారంభం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అలాగే ఈ సీరిస్ లో చర్చించిన విషయం కూడా అర్దవంతమైనదే. అయితే కొంత దూరం వెళ్లాక ఎవరు ఏమిటనేది క్లూ అందిస్తుంది. అలాగే వరుస హత్యలు, వాటి వెనుక ఉన్నదెవరు అనే విషయం కనుక్కోవాలనుకోవటం పెద్దగా ఎక్సైట్మెంట్ గా అనిపించదు. కానీ విష్ణువు దశాఅవతారాలకు, వరుస హత్యలకు లింక్‌ పెట్టిన విధానం చాలా బాగా డిజైన్ చేశారు. ఇక ఈ సీరిస్ లో ఒక్క రాజేంద్రప్రసాద్ పాత్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. శ్రీరామ్ - అర్జున్ అంబటి పాత్రలను ఇంకాస్త టెన్స్ గా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసి ఉండాల్సింది. అలాగే 'దాసు' పాత్రను డిజైన్ చేయడంలో దర్శకుడు మరింత శ్రద్ధ తీసుకుని ఉండవలసిందని పిస్తుంది. దాసు తల్లికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త డోస్ తగ్గించాల్సింది. కంక్లూజన్ రివేంజ్ డ్రామాగా ముగియటం కాస్త ఇబ్బందే. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సీరిస్ లో ఉన్నాయి. దాంతో ఇలాంటి మైనస్ లు ఉన్నా వాటితో కాంపన్సేట్ అయిపోతుంది. ఇంకాస్త ఎమోషనల్ గా కనెక్ట్ చేసి డెప్త్ గా సబ్జెక్ట్ లోకి వెళ్లి ఉంటే ఇంకా బాగా ఎంగేజింగ్ గా ఉండేది.

టెక్నికల్ గా

డైరెక్టర్ కొత్త వాడైనా కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ఆర్టిస్ట్ ల నుంచి మంచి ఫెరఫార్మెన్స్ తీసుకున్నారు. అలాగే విజయ్ ఉలగనాథ్ ఫొటోగ్రఫీ బాగుంది. అడవిలో జరిగే సీన్స్ చాలా బాగా తీశారు. సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఫరవాలేదు. జునైద్ సిద్ధికీ ఎడిటింగ్ నడిచిపోతుంది. డైలాగులు ఛల్తాహై. స్క్రిప్టే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా డిటైలింగ్ చేయాల్సింది. నటీనటుల్లో రంగాచారిగా రాజేంద్ర ప్రసాద్‌ మిగతా అందరినీ డామినేట్ చేసే నటన ప్రదర్శించారు.

చూడచ్చా

కొంత ప్రెడిక్టబులిటీ ఉన్నా థ్రిల్లర్ అభిమానులు నచ్చే అంశాలు ఉన్నాయి. అయితే హింస - రక్తపాతం డోస్ ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కాస్త ఇబ్బంది పెడతాయి.

ఎక్కడుంది

డిస్నీ హాట్ స్టార్ లో తెలుగులో ఉంది

Read More
Next Story