‘అమెజాన్ ప్రైం’లో రానా దగ్గుబాటి నెగ్గుకు వస్తాడా?
ప్రముఖ నిర్మాణ సంస్ద సురేష్ ప్రొడక్షన్స్ వారసుడుగా , స్టూడియో అధినేత కుమారుడు గానే కాకుండా నటుడుగా రానా దగ్గుపాటి పాపులర్.
ప్రముఖ నిర్మాణ సంస్ద సురేష్ ప్రొడక్షన్స్ వారసుడుగా , స్టూడియో అధినేత కుమారుడు గానే కాకుండా నటుడుగా రానా దగ్గుపాటి పాపులర్. సినిమాల్లోనే పుట్టి పెరిగిన ఆయన కు సినిమా విషయాలపై అవగాహన అనంతం. ముఖ్యంగా సినిమాలను శాసిస్తున్న ఓటిటి వ్యవస్థతో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ వంటి పెద్ద సంస్థలతో ఆయన క్లోజ్ గా మెలుగుతూంటారు.మారుతున్న ట్రెండ్ లను, సినిమా బిజినెస్ ని ఆయన ఓ నిర్మాతగా పరిశీలిస్తూంటారు. కోవిడ్ కు ముందు ఆయన చాలా ప్రాజెక్టులు ప్లాన్ చేసారు. కానీ రకరకాల కారణాలతో అవేమీ మెటీరియలైజ్ కాలేదు. అయితే అవకాసం దొరికినప్పుడల్లా మంచి సినిమాలను ప్రమోట్ చేయటం, ప్రెజెంట్ చేసి వాటికి గుర్తింపు తీసుకువచ్చి, మార్కెట్ లోకి తీసుకురావటం వంటివి చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ (Amazon Prime) కు ది రానా దగ్గుబాటి షో ‘The Rana Daggubati Show’అనే ఓ షోని హోస్ట్ చేస్తున్నారు.
ఆ షో బిజీలో ఉన్న రానా దగ్గుబాటి ప్రస్తుతం తెలుగు మార్కెట్ పై ఓటిటి(OTT) ఇంపాక్ట్ ని, బిజినెస్ వివరాలను మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లో ఓటిటి కు సంభందించిన చాలా విషయాలపై క్లారిటీ ఇండస్ట్రీ వర్గాలకు దొరికింది. ముఖ్యంగా ఓటిటి సంస్దలు ..నియంతల్లా వ్యవహిస్తూ సినిమా నిర్మాతలను ఇరుకున పెడుతున్నారనే చర్చకు ఆయన సమాధాన మిచ్చారు. ఓటిటిల ప్రెజెంట్ సిట్యువేషన్ ని తన మాటల్లో వివరించి చెప్పే ప్రయత్నం చేసారు. “ఏ ఓటిటి సంస్థ కూడా సినిమాలని డిక్టేట్ చేయదు. మన దగ్గర సేలబుల్ కంటెంట్ ఉంటే , ఎవరూ ఎవరినీ డిక్టేట్ చేయరు. రిస్క్ క్యాండిడేట్ లను మాత్రమే వాళ్లు డిక్టేట్ చేస్తారు. ఓటిటి ..నిర్మాతలను బిజినెస్ పరంగా సేఫ్ గా ఉంచుతోంది. ఎక్కువ సినిమాలు చేసేందుకు అవకాశం ఇస్తోంది ”అన్నారు. అదెలాగో చెప్పుకొచ్చారు. ఇంతకీ రానా చెప్పిందేమిటి
రానా మాట్లాడుతూ....“మనకు కేవలం నాలుగు నుంచి ఐదు ఓటిటి ప్లాట్ ఫామ్ లు మాత్రమే ఏక్టివ్ గా ఉన్నాయి. అవి అన్ని సినిమాలు కొంటాయని అనుకోవద్దు. కొనలేవు కూడాను. ఆ ఓటిటి సంస్థలు తెలుగుకు మాత్రమే పరిమితం కాదు. దేశంలో ఉన్న మిగతా లాంగ్వేజ్ ఫిల్మ్స్ కూడా కవరేజ్ చేయాలి. మనం దేశం మొత్తం అన్ని కలిసి 400-500 సినిమాలు దాకా నిర్మాణం చేస్తున్నాము. కొన్నింటిని థియేటర్ కోసం మాత్రమే కాకుండా ఓటిటిలకు కూడా రెడీ చేస్తున్నాము. కానీ ఉన్న కాసిని ఓటిటి సంస్థలు వాటిని మొత్తం కొనలేవు. వాళ్లు మొదట తాము కొన్న సినిమాలు లేదా వెబ్ సీరిస్ ల నుంచి రెవిన్యూ జనరేట్ చేసుకోవాలి. ఇంతకు ముందు తెలుగు నుంచి ఎక్కువ సినిమాలు వాళ్లు తీసుకునేవారు.
కానీ ఇప్పుడు వేరే భాషలు, రాష్ట్రాల నుంచి సినిమాలు వస్తున్నాయి ఎక్కువగా. దాంతో వాళ్ళకు చాలా ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఎక్కడైతే బాగా వర్కవుట్ అవుతుందనుకుంటున్నారో వాటినే వాళ్లు కొనుక్కుంటారు. అవి అంతర్జాతీయ సంస్దలు . వాటి లెక్కలు వాటికి ఉంటాయి. మన లెక్కలు వాళ్లకు అనవసరం. అలాగే రెండు మూడేళ్లు మాత్రమే ఓటిటి బిజినెస్ ఇలా స్పీడుగా సాగుతుంది. అందరూ అన్ని రోజులు ఇలాగే నడుస్తాయి అనుకుంటున్నారు. కానీ వాళ్ల దగ్గర కావాల్సిన కంటెంట్ దొరికాక ఆచి,తూచి మందుకు వెళ్తారు. ఎల్లకాలం ఇలాగే నడవదు. థియేటర్ మార్కెట్ లాగ ఓటిటి మార్కెట్ ఉండదు అని తేల్చి చెప్పారు.
రానా మాటలను బట్టి అర్దమయ్యే విషయం భవిష్యత్తులో ఓటిటి లు మరిన్ని రూల్స్ ,రెగ్యులేషన్స్ తెస్తాయి. మనం చేసిన సినిమాలు అన్నీ కొనరు. వారికు ఏ సినిమాలు లేదా వెబ్ సీరిస్ లు, డాక్యుమెంటరీల ద్వారా ఎక్కువ రెవిన్యూ జనరేట్ అవుతుందో అటే అడుగులు వేస్తారు. అలాగే మన దగ్గర ఖచ్చితంగా అద్బుతమైన సేలబుల్ కంటెంట్ ఉంటే వాళ్లు తీసుకుంటారు. లేనప్పుడు అటు వైపు ఆశపడటం అనవసరం. ఓటిటి మార్కెట్ పై నిజానికి ఇది మంచి విశ్లేషణ అని చెప్పాలి. రానా వంటి మార్కెట్ ఎనాలసిస్ చేసే నిర్మాత, నటుడు చెప్పిన మాటలు వంద శాతం నిజం ఉంటాయనటంలో ఏ సందేహం లేదు. దాన్ని బట్టే నిర్మాతలు సినిమాలు ప్లాన్ చేసుకోవాలి. ఓటిటిపై ఆధారపడటం తగ్గించి థియేటర్ రెవిన్యూకు ప్లాన్ చేసుకోవాలి.
రానా దగ్గుబాటి ఓటీటీ కోసం ఓ టాక్ షో చేయబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ టాక్‌షోకు ది రానా దగ్గుబాటిషో అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నవంబర్ 23 నుంచి టాక్ షో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.ఈ టాక్ షోకు సంబంధించిన ప్రోమోను అమెజాన్ ప్రైమ్ శుక్రవారం రిలీజ్ చేసింది. ఈ టాక్ షో ప్రోమోలో టాలీవుడ్ హీరోలు నాగచైతన్య, నాని, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జాతో పాటు కన్నడ హీరో రిషబ్ శెట్టి, మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ కనిపించారు. హీరోయిన్లు శ్రీలీల, ప్రియాంక మోహన్, మీనాక్షి చౌదరి కూడా టాక్ షోలో సందడి చేసినట్లుగా చూపించారు. దిగ్గజ దర్శకులు రాజమౌళితో పాటు రామ్ గోపాల్ వర్మ దర్శనమిచ్చారు.