Vijay and Rashmika marriage
x

ఒక్కటైన రష్మిక-విజయ్.. ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా పెళ్లి! (ఫొటోో గ్యాలరీ)

టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటియ్యారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన వీరి పెళ్లి విశేషాలు మీకోసం.


గత కొన్నేళ్లుగా వీరి ప్రేమపై సాగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఈరోజు ఉదయం వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఐటీసీ మెమెంటోస్ (ITC Mementos) రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం వేడుకగా జరిగింది. దాదాపు దశాబ్ద కాలం నాటి వీరి ప్రేమకథ ఈ శుభ ముహూర్తంతో అధికారికంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

పెళ్లయిన తర్వాత రష్మిక తొలి పోస్ట్

వివాహ వేడుక ముగిసిన వెంటనే రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. విజయ్ దేవరకొండను తన భర్తగా పరిచయం చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాశారు. నిజమైన ప్రేమ అంటే ఏమిటో, మనశ్శాంతిగా ఉండటం అంటే ఏమిటో విజయ్ తనకు నేర్పించారని ఆమె పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కలలుగన్న మహిళగా ఈరోజు మారానంటే దానికి కారణం విజయ్ అని, ఆయన తన జీవితంలోకి రావడం తన అదృష్టమని రష్మిక తన పోస్ట్‌లో వివరించారు.

సంతోషంలో అభిమానులు

విజయ్‌కి భార్యగా కొత్త జీవితాన్ని ప్రారంభించడం పట్ల రష్మిక ఎంతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. జీవితాంతం కలిసి ఉత్తమమైన క్షణాలను గడుపుదామని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తూ తన ప్రేమను చాటుకున్నారు. రష్మిక షేర్ చేసిన ఈ పోస్ట్ నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

దశాబ్ద కాలం నాటి తమ అనుబంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లిన ఈ జంట, ఇప్పుడు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

Read More
Next Story