రిస్క్ తీసుకున్న రష్మిక – రక్త పిశాచి పాత్రతో సర్ప్రైజ్!
x

రిస్క్ తీసుకున్న రష్మిక – రక్త పిశాచి పాత్రతో సర్ప్రైజ్!

అశ్వత్థామ లాగా – శపించబడిన అమరత్వం, శాశ్వతంగా బాధలో బ్రతకడమే కాన్సెప్ట్.

మన సినిమాలు ఇప్పుడు జానపదాలు, పురాణాలు, మైథాలజీని తీసుకుని వాటికి కల్పితాన్ని జోడించి కొత్త ప్రపంచాలను తెరపై సృష్టిస్తున్నాయి. కాంతారా, హనుమాన్, మిరాయ్ లాంటి హీరో-ఓరియెంటెడ్ సినిమాల తర్వాత ఇప్పుడు హీరోయిన్-ఓరియెంటెడ్ ఎపిక్‌లు కూడా మొదలయ్యాయి.

ఇటీవలే మలయాళంలో లోక చాప్టర్ 1: చంద్ర అనే చిన్న సినిమా, యక్షిణి పాత్రను వాంపైర్ స్టైల్‌లో చూపిస్తూ, మౌత్ టౌక్ తోనే రూ.270 కోట్లకు పైగా కలెక్ట్ చేసి షాకిచ్చింది. అందులో కళ్యాణి ప్రియదర్శిని పాత్ర రక్తం తాగుతూ , మరణం లేకుండా బ్రతుకుతూంటుంది. ఈ పాత్ర కో లవ్ స్టోరీ కూడా పెట్టారు. అందులోంచి పుట్టే ఫన్ జనాలను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే తరహాలో మరో సూపర్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ హిందీ నుంచి వస్తోంది.

రష్మిక మందాన వాంపైర్ అవతారం!

రష్మిక మందాన, బాలీవుడ్‌లో “థామా (Thamma)” అనే హారర్-రోమాంటిక్ డ్రామాలో తడక అనే వాంపైర్ పాత్రలో కనిపిస్తోంది. ఆమెతో పాటు హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా వాంపైర్‌గా కనిపిస్తాడు. కానీ ట్విస్ట్ ఏమిటంటే – అతను ఒక చరిత్రకారుడు కూడా! అంటే, అతను భారతీయ పురాణాల్లో వెంపైరిజం మూలాలను అన్వేషిస్తూ, ఒక రహస్య ప్రేమకథలో చిక్కుకుంటాడు.

ట్రైలర్ ఇప్పటికే విడుదలై, రష్మిక లుక్‌నే హైలైట్ అంటున్నారు. ఈసారి దివాళీకి, అక్టోబర్ 21న థియేటర్స్‌లోకి రానుంది.

"థామా" – అశ్వత్థామ నుంచి ప్రేరణా?

ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే… ఈ సినిమాకు మొదట వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ అని పేరు పెట్టారు. కానీ తర్వాత ‘థామా’గా మార్చారు. థామా అనే టైటిల్ అసలు “అశ్వత్థామ” నుండి తీసుకున్నదట. అశ్వత్థామ లాగా – శపించబడిన అమరత్వం, శాశ్వతంగా బాధలో బ్రతకడం – వాంపైర్ కాన్సెప్ట్‌కి దగ్గరగా ఉంటుంది. కృష్ణుడు ఇచ్చిన శాపం వలన యుగయుగాల పాటు రక్తస్రావం ఆగని గాయంతో బ్రతికిన అశ్వత్థామ ప్రతిబింబమే ‘థామా’. అంటే సినిమా కంటెంట్ కూడా ఒక శపించబడిన అమరత్వం చుట్టూ తిరుగుతుందనేది హింట్.

అంటే, ఈ సినిమా వెనక ఫిలాసపీ: "అమరత్వం అనేది వరం కాదు, వేదన."

రెండు టైమ్ లైన్స్ లో...

“థామా” కథలో అయుష్మాన్ ఖురానా ఒక చరిత్రకారుడి పాత్రలో కనిపిస్తాడు. అతను భారతీయ జానపదం, పురాణాలలో వెంపైరిజం మూలాలను అన్వేషిస్తాడు. కథ రెండు టైమ్‌లైన్స్‌లో సాగుతుంది — ఆధునిక భారతదేశం, ప్రాచీన విజయనగరం. మ్యాడాక్ ఫిల్మ్స్ శైలిలో హారర్, రొమాన్స్, హిస్టరీ అన్నీ కలిపి ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. అయితే దీనిని తమ “మొదటి లవ్ స్టోరీ”గా ప్రమోట్ చేయడం వలన ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

మ్యాడాక్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో భాగం

ఈ సినిమా మ్యాడాక్ ఫిల్మ్స్ హారర్-కామెడీ యూనివర్స్‌లో ఐదో సినిమా. ‘స్త్రీ, భేదియా, మూంజ్యా’ బ్లాక్‌బస్టర్స్ తర్వాత, ఈ యూనివర్స్ నుంచి రాబోతున్నందుకే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి!

రష్మిక రిస్కీ ట్రై

సాధారణంగా టాప్ హీరోయిన్‌లు దెయ్యం లేదా రక్తపిశాచిలాంటి పాత్రలకు దూరంగా ఉంటారు. కానీ రష్మిక మాత్రం ధైర్యంగా అంగీకరించి, ఇప్పుడు అందరి చర్చల్లో హాట్ టాపిక్ అయిపోయింది.

థామా హైలైట్స్

రష్మిక & ఆయుష్మాన్ జంటగా మొదటిసారి , హారర్ + హిస్టరీ + లవ్ స్టోరీ కలయిక , "అశ్వత్థామ శాపం" ఆధారంగా వెంపైర్ ట్విస్ట్, మ్యాడాక్ ఫిల్మ్స్ హిట్ ఫ్రాంచైజ్‌లో భాగం

ఇప్పుడు “థామా” కూడా ‘స్త్రీ’ లాంటి సెన్సేషన్ అవుతుందా? లేక రిస్క్ తీసుకున్న రష్మికకు ఇది గేమ్-చేంజర్ అవుతుందా? అనేదే బాలీవుడ్ భాక్సాఫీస్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం.

Read More
Next Story