కోర్టు ఆర్డర్:  ‘మన శంకర వరప్రసాద్ గారు’ కు, రివ్యూలు, రేటింగ్స్ బంద్!
x

కోర్టు ఆర్డర్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ కు, రివ్యూలు, రేటింగ్స్ బంద్!

యాంటీ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్


ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలను కావాలనే బుక్ మై షో లో రేటింగ్స్ తగ్గిస్తున్నారని, యాంటీ ఫ్యాన్స్ తక్కువ రేటింగ్ తో రివ్యూస్ పబ్లిష్ చేస్తున్నారని కొంతమంది నిర్మాతలు తెరమీదకు వచ్చి మాట్లాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మెగాస్టార్ సినిమా టీం, ఇప్పుడు ఈ సినిమా విషయంలో సినిమా చూసినవారు, చూడని వారు ఎవరూ కూడా తమ సినిమాకి బుక్ మై షో లో రివ్యూ కానీ, రేటింగ్ కానీ ఇవ్వకూడదని.. ఈ మేరకు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే...

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSVG) సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది. డిజిటల్ మాన్యుపులేషన్, కావాలని చేసే నెగిటివ్ క్యాంపెయిన్ల నుండి సినిమాను కాపాడుకోవడానికి మేకర్స్ అత్యంత ధైర్యమైన అడుగు వేశారు.

బుక్ మై షోలో 'డిజేబుల్' మెసేజ్!

ప్రస్తుతం బుక్ మై షో (BookMyShow) ప్లాట్‌ఫామ్‌పై ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా పేజీని సందర్శిస్తే “Ratings & Reviews disabled as per court order” (కోర్టు ఆదేశానుసారం రేటింగ్స్ మరియు రివ్యూలు నిలిపివేయబడ్డాయి) అనే మెసేజ్ కనిపిస్తోంది. సినిమా చూడకముందే ఫేక్ రివ్యూలు ఇవ్వడం, కావాలని రేటింగ్స్ తగ్గించడం వంటి చర్యలను అరికట్టడానికి కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

యాంటీ పైరసీ పార్టనర్లతో కలిసి మాస్టర్ ప్లాన్..

ఈ అసాధారణ నిర్ణయాన్ని అమలు చేయడానికి చిత్ర నిర్మాతలు Block BIGG మరియు Aiplex వంటి యాంటీ పైరసీ సంస్థలతో చేతులు కలిపారు. సోషల్ మీడియా, బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్న తరుణంలో, సినిమా థియేట్రికల్ వసూళ్లకు విఘాతం కలగకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త ట్రెండ్‌కు నాంది?

ఆన్‌లైన్ ప్రచారాలు లేదా మేనిప్యులేటెడ్ స్కోర్‌ల ద్వారా కాకుండా, థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రమే తమ స్వంత నిర్ణయాన్ని తీసుకోవాలని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. మెగాస్టార్ తీసుకున్న ఈ స్టాండ్ భవిష్యత్తులో ఇతర పెద్ద సినిమాలకు కూడా మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉన్న ఇతర సినిమాల మేకర్స్ కూడా ఇదే తరహా చట్టపరమైన రక్షణ కోసం కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

అంటే రవితేజ ‘భక్తులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలకు కూడా బుక్ మై షో లో రివ్యూస్ కానీ, రేటింగ్స్ కానీ ఇచ్చే అవకాశం ఉండదన్నమాట.

రిలీజ్ అప్‌డేట్: మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ జనవరి 12, 2026న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి మాస్ ఇమేజ్ కలగలిసిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read More
Next Story