రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం (ఈటీవీ విన్) మినీ రివ్యూ
x

రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం' (ఈటీవీ విన్) మినీ రివ్యూ

నక్సలిజం సబ్జెక్టు ని కొత్త యాంగిల్ లో ఫన్ కలిపి అందిస్తే అదిరిపోద్ది కదా అనే ఐడియా ఓ కొత్త డైరక్టర్ కు వచ్చింది. అదే ఈ సినిమా.


నక్సలిజం నేపధ్యంలో వచ్చే సినిమాలకు ఇప్పుడు డిమాండ్ ఉందా... ఆర్.నారాయణ మూర్తి నాటి 'ఎర్రసైన్యం' .. 'దండోరా' వంటి సినిమాలు వచ్చి సూపర్ హిట్టయ్యాయి.

ఇప్పుడు నక్సలిజం సబ్జెక్టు..వరకట్నం అంత ఓల్డ్ సబ్జెక్ట్ అయ్యిపోయింది. ఎవరైనా నక్సలిజం మీద సినిమా అంటే ఎక్కడ ఉన్నాడురా ఈ డైరక్టర్ అని చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో అదే నక్సలిజం సబ్జెక్టు ని కొత్త యాంగిల్ లో ఫన్ కలిపి అందిస్తే అదిరిపోద్ది కదా అనే ఐడియా ఓ కొత్త డైరక్టర్ కు వచ్చింది. వెంటనే 'రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం' అంటూ వ్యవస్దపై సూటిగా సెటైర్ రివాల్వర్ ని గురిపెట్టాడు.

అయితే అది పేలిందా...నేల పాలైందా...అంటే ఈటీవీ విన్ ఓటిటిలోకి తొంగి చూడాల్సిందే.


స్టోరీ లైన్ గా చూస్తే ...అది 2009...తుపాకుల గూడెం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరు అడవిని ఆనుకుని ఉంటుంది. ఆ ఊళ్లో చాలా మంది కుర్రాళ్లు..వాళ్లలో ఎక్కువ శాతం చదువు సంధ్యా లేనివాళ్లు, ఉద్యోగాలు లేనివాళ్లు. వాళ్లలో కుమార్ (శ్రీకాంత్ రాథోడ్) ఒకడు. అతని ఎగస్ట్రా క్వాలిఫికే,న్... ఆ ఊరికి చెందిన మమత ( జయేత్రి)తో ప్రేమలో ఉండటం. సర్లేరా నాయనా ..ఉద్యోగం సద్యోగం లేకుండా పిల్లను పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు..కాబట్టి ఏదో ఒక ఉద్యోగం పట్టుకుని రా..పిల్లనిస్తా అంటుంది ఆ అమ్మాయి తల్లి. అప్పుటికప్పుడు మన బాబు జాబ్ ఇచ్చేదెవరు...ఆ క్రైసిస్ టైమ్ లోనే ఓ గోల్డెన్ ఆపర్చునిటి ఒకటి కనిపిస్తుంది...అదేమిటంటే...
ఆ అడవుల్లో ఉండే నక్సలైట్స్ శివన్న ( శివరామ్) దళాన్ని దెబ్బకొట్టాలని హోం మినిస్టర్ ప్లాన్ చేస్తాడు. నక్సలైట్స్ కు ఓ ఆఫర్ ఇస్తాడు. లొంగిపోయిన వారికి 3 లక్షలు .. సొంత ఇల్లు .. పోలీస్ జాబ్ ఇస్తామని ప్రకటిస్తాడు. అయితే పోలీస్ లు మరో ప్లాన్ చేస్తారు. నకిలీ నక్సలైట్లను రంగంలోకి తీసుకొచ్చి .. వాళ్లు లొంగిపోతున్నట్టుగా మీడియాలో చూపించాలనేది పోలీస్ డిపార్టుమెంట్ ప్లాన్ చేస్తారు. దాంతో ఈ విషయం తుపాకుల గూడెంలో తెలుస్తుంది. పోలీస్ ఉద్యోగాలు ఈజీగా కొట్టేయచ్చు అని తమను తాము నక్సలైట్స్ గా చూపించుకోవాలని నిర్ణయించుకుంటారు. మన హీరో మెయిన్. అక్కడ నుంచి అసలు డ్రామా మొదలవుతుంది. ఒకడు మీ అందరికీ పోలీస్ జాబ్ లు రావాలంటే తలో లక్ష ఇవ్వండి లాగేస్తాడు కూడా పనిలో పనిగా.

పాపం ఆ ఊరు కుర్రాళ్లలో ఓ వందమంది ఓ శుభ ముహూర్తం చూసుకుని తమను తాము నక్సలైట్స్ గా ప్రకటించుకుంటూ నక్సలైట్స్ వేసే డ్రస్ లు వేసుకుని ఆ ప్లేస్ లో నిలబడతారు. రేపో మాపో పోలీస్ జాబ్ లు వచ్చేస్తాయనే కాన్ఫిడెన్స్ తో ఊపు మీద ఉంటారు. అయితే వీళ్ళ దరిద్రం బాగోక అదే టైమ్ లో అక్కడకి దగ్గరలో కూంబింగ్ ఫోర్స్ ను నక్సలైట్స్ హతమార్చడంతో, హోమ్ మినిష్టర్ ఆ జాబ్ స్కీమ్ ను రద్దు చేస్తాడు. అంతేకాదు తమకు ఎదురుతిరిగిన నక్సలైట్స్ ను ఉపేక్షించవద్దని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. పోలీస్ లు ఈ నకిలీ నక్సలైట్స్ పని పట్టపడ్డటానికి బయిలుదేరతారు. అప్పుడు ఏమైంది...ఫన్ ..పెయిన్ ...
డైరక్టర్ జైదీప్ విష్ణు డిజైన్ చేసుకున్న స్టోరీ లైన్ బాగుంది.ఫన్ బాగానే వర్కవుట్ అయ్యింది. అయితే స్టోరీ లైన్ లో ఉన్నంత డ్రామ్ ఎందుకనో తెరమీదకు రాలేదు. అలాగని పూర్తిగా నిరాశపరచదు. మణిశర్మ సంగీతం .. శ్రీకాంత్ అరుపుల కెమెరా వర్క్ ..డైరక్టర్ కు బాగా సపోర్టు ఇచ్చాయి. ఆర్టిస్ట్ లు కొత్తవాళ్లైనా బాగా చేసారు.

చూడచ్చా...

ఓ కొత్త ప్రయత్నం...అందులోనూ ఫన్ ఉంది..ఓటిటికు ఫెరఫెక్ట్ ఫిల్మ్ ... చూడచ్చు..


నటీనటులు: ప్రవీణ్ కందెల, శివరామ్ రెడ్డి, శ్రీకాంత్ రాథోడ్, జైత్రి మకానా, వంశీ వూటుకూరు, శరత్ బరిగెల, వినీత్ కుమార్, విజయ్ మచ్చ తదితరులు సంగీత దర్శకులు: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ ఏర్పుల

ఎడిటర్: జైదీప్ విష్ణు

దర్శకుడు : జైదీప్ విష్ణు

నిర్మాతలు: వారధి క్రియేషన్స్


Read More
Next Story