యాక్షన్ సినిమాలపై ‘ధురందర్’ మరణ శాసనం?
x

యాక్షన్ సినిమాలపై ‘ధురందర్’ మరణ శాసనం?

వర్మ సంచలన వ్యాఖ్యలు!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ధురందర్’ (Dhurandhar) నామస్మరణే వినిపిస్తోంది. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. అయితే, ఈ సినిమా సక్సెస్ టాలీవుడ్ మేకర్స్‌లో వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) చేసిన విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

హీరో ఎంట్రీ లేదు.. కానీ మైండ్ బ్లాక్!

సాధారణంగా మన భారతీయ సినిమాల్లో హీరో అంటే ఎలివేషన్లు, భారీ ఎంట్రీ సీన్లు ఉండాలి. కానీ ‘ధురందర్’ వీటన్నింటికీ బ్రేక్ చేసిందని ఆర్జీవీ పేర్కొన్నారు. సినిమాలో హీరోకు ఎలాంటి గ్రాండ్ ఎంట్రీ ఉండదు, పైగా ప్రారంభంలోనే హీరో దెబ్బలు తింటాడు. దశాబ్దాలుగా వస్తున్న కమర్షియల్ ఫార్ములాను ఈ సినిమా దెబ్బ కొట్టిందని వర్మ విశ్లేషించారు.

అలాగే ఒకప్పుడు ఆర్‌ఆర్‌ఆర్, హనుమాన్ సినిమాలు బెంచ్‌మార్క్ సెట్ చేస్తే, ఇప్పుడు ‘ధురందర్’ ఆ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘పుష్ప 2’ క్లైమాక్స్ కూడా వర్కవుట్ అవ్వదా?

వర్మ చేసిన వ్యాఖ్యల్లో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే.. పుష్ప 2 గురించి ఆయన చేసిన కామెంట్స్. ప్రస్తుతం ప్రేక్షకుల టేస్ట్ పూర్తిగా మారిపోయిందని, ‘పుష్ప 2’లో ఉండే అల్ట్రా-మాస్ క్లైమాక్స్ సీక్వెన్స్‌లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులను మెప్పించకపోవచ్చని ఆయన బాంబు పేల్చారు. కేవలం వీఎఫ్ఎక్స్ (VFX) నమ్ముకుని తీస్తే.. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

ప్రమాదంలో పాన్-ఇండియా ప్రాజెక్టులు!

కేవలం భారీ విజువల్స్ ఉంటే సరిపోదని, కంటెంట్ బలంగా లేకపోతే జనం థియేటర్లకు రారని ఆర్జీవీ మాటలను బట్టి అర్థమవుతోంది. ‘ధురందర్’ దెబ్బకు ఇప్పటికే పలు భారీ బడ్జెట్ సినిమాలు తమ షూటింగ్ ప్లాన్స్ మార్చుకుంటున్నాయని, కొన్ని ప్రాజెక్టులు రద్దు అయ్యే అవకాశం కూడా ఉందని ఇండస్ట్రీ టాక్.

ధురందర్ 2 కోసం వెయిటింగ్..

సరిగ్గా నెల రోజుల్లో ‘ధురందర్ 2’ రాబోతోంది. మొదటి భాగం సృష్టించిన ప్రకంపనల నేపథ్యంలో, రెండో భాగం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని మేకర్స్ భయపడుతున్నారు. ఒకవేళ పార్ట్-2 కూడా హిట్ అయితే, ఇక పాతకాలపు యాక్షన్ సినిమాలకు ఎండ్ కార్డ్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

దురంధర్ తెలుగు సినిమా పరిశ్రమకు ఓ హెచ్చరిక ?

ఇది యాక్షన్ సినిమాల్ని నాశనం చేయలేదు, కానీ వాటిని నిజాయితీగా ఆలోచించమని చెప్తుంది. ఇకపై కేవలం భారీ బడ్జెట్, VFX, హీరో ఎలివేషన్‌తో సినిమాలు నడవవు అన్న విషయం స్పష్టమైంది. కథే కేంద్రబిందువుగా ఉండాలి, విజువల్స్ దానికి సాయంగా మాత్రమే ఉండాలి.దురంధర్ చూపించింది ఏంటంటే హీరోని దేవుడిలా చూపించాల్సిన అవసరం లేదు. అతన్ని మనిషిలా చూపించినా ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు.

ఈ మార్పును అర్థం చేసుకున్న దర్శకులు, నిర్మాతలు దురంధర్ని ఒక టర్నింగ్ పాయింట్‌గా మలుచుకుంటారు. అర్థం చేసుకోని వాళ్లకు మాత్రం ఇది ఒక ఫిల్టర్‌లా మారి, బలహీనమైన సినిమాలను ప్రేక్షకుల దగ్గరే ఆపేస్తుంది.

Read More
Next Story