రోటి కపడా రొమాన్స్‌ మూవీ ott రివ్యూ
x

'రోటి కపడా రొమాన్స్‌' మూవీ ott రివ్యూ

యూత్ సినిమాలకు తెలుగులో ఆదరణ బాగానే ఉంటుంది. అయితే అవి వారు పర్శనల్ గా కనెక్ట్ అయ్యే స్థాయిలో ఉండాలి.

యూత్ సినిమాలకు తెలుగులో ఆదరణ బాగానే ఉంటుంది. అయితే అవి వారు పర్శనల్ గా కనెక్ట్ అయ్యే స్దాయిలో ఉండాలి. యూత్ సినిమాలుతో వచ్చి వర్కవుట్ అయ్యి నిలబడిన నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఉన్నారు. దాంతో ఎప్పటికప్పుడు కొత్త దర్శకులు యూత్ ఫుల్ లవ్ స్టోరీలను మన ముందుకు తెస్తున్నారు. అలా వచ్చిన చిత్రమే 'రోటి కపడా రొమాన్స్‌' . టైటిల్ తో విభిన్నత చూపించిన ఈ చిత్రం థియేటర్ లో యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు ఈటీవి విన్ ద్వారా ఓటిటిలో ప్రవేశించింది. ఈ చిత్రం కథేంటి...ఇక్కడ ఆడియన్స్ ని ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.

స్టోరీ లైన్

చిన్ననాటి స్నేహితులు హ‌ర్ష (హ‌ర్ష న‌ర్రా), రాహుల్ ( సందీప్ స‌రోజ్‌), విక్కీ (సుప్ర‌జ్ రంగా), సూర్య (త‌రుణ్‌) . వీళ్లంతా గోవా ట్రిప్ వెళ‌తారు. ఈ ట్రిప్‌లోనే వారి జీవితం అనుకోని మ‌లుపులు తిరుగుతుంది. వీరి జీవితాల్లో అమ్మాయిలు ఉన్నార‌నే తెలుస్తుంది. రేడియో జాకి అియన సూర్య కు అభిమానిగా జీవితంలోకి దివ్య (నువేక్ష‌) వ‌స్తుంది. జాబ్ విష‌యంలో శ్వేత‌తో (మేఘ‌లేఖ‌) విక్కీకి ఏర్ప‌డిన పరిచ‌యం ప్రేమ‌గా మారుతుంది.బాయ్ ఫ్రెండ్‌గా నాట‌కం ఆడ‌మ‌ని హ‌ర్ష‌ను సోనియా (ఖుష్బూ చౌద‌రి) అడుగుతుంది. రాహుల్ త‌న ఆఫీస్‌లోనే ప‌నిచేసే ప్రియను (సోనియా ఠాకూర్‌) ప్రేమిస్తాడు. కన్ఫ్యూజన్స్, మిస్ అండర్‌స్టాండింగ్స్ తో ఈ నలుగురు ప్రేమ కథలు పట్టాలు తప్పుతాయి. బ్రేకప్ లతో వీరి జీవితాల్లో నిరాశ అలుముకుంటుంది. అయితే గోవా ట్రిప్ తర్వాత వీరి లైఫ్ లో మార్పులు వస్తాయి. అవేంటి, వారి ప్రేమ కథలు ఏ ఒడ్డుకు చేరుకున్నాయనేదే మిగతా కథ.

ఎలా ఉంది

చెప్పుకోవటానికి కథ గా ఏమి లేదు. సీన్స్ తోనే మ్యాజిక్ చేయాలనుకున్నారు. స్క్రీన్ ప్లేలో తడబాటు లేకపోవటంతో సాఫీగానే ముందుకు వెళ్లింది. అలాగే కథనంలో ఫ్రెష్‌నెస్‌ ఉంది. ఈ జనరేషన్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ప్రేమ, కెరీర్‌, బ్రేకప్‌ వీటి మధ్యే కథను నడిపారు. సినిమాలోని పాత్రలు కూడా మనకు తెలిసి ఉన్నట్లే అనిపిస్తాయి. ఫస్టాఫ్ ప్రేమ కథలు పరిచయం , బ్రేకప్ లు బాగానే ఉన్నా, సెకండాఫ్ రెజిల్యూషన్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి డల్ అయ్యిపోయింది. తెలిసిన పాత కథనే కొత్త కోణంలో యూత్‌కి కనెక్ట్ చేసారు దర్శకుడు విక్రమ్ రెడ్డి. కాకపోతే సినిమాకు సరిపడ ఎమోషనల్ డెప్త్ లేదేమో అనిపించింది.

టెక్నికల్ గా చూస్తే..

దర్శకుడు కొత్తవాడైనా నాలుగు ప్రేమకథలను ఎక్కడ కూడా తడబడకుండా ముందుకు వెళ్లటం నచ్చుతుంది. అలాగే కొత్త ఆర్టిస్ట్ ల నుంచి కూడా మంచి అవుట్ ఫుట్ రాబట్టుకున్నారు. అయితే ఈ జనరేషన్ కు ఏ మాత్రం ఎక్కుతుందనేది చూసుకున్నట్లు లేరు. రిలేష‌న్‌షిప్స్‌లో ఉండే అభిప్రాయ‌భేదాలు, వాటి వ‌ల్ల వ‌చ్చే క‌న్ఫ్యూజ‌న్స్‌ను ఇంకాస్త అర్దవంతంగా చెప్పవచ్చు అనిపించింది. ఇలాంటి కథలకు మ్యూజిక్, కెమెరా వర్క్ కీలకం, అవి రెండు ఈ సినిమాకు ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఎడిటింగ్ సెకండాఫ్ ని ఇంకాస్త స్పీడు చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి. నటీనటుల్లో హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగ తమ పాత్రల్లో కొత్త వాళ్లైనా బాగా చేసారు. ముఖ్యంగా విక్కీ పాత్రలో సుప్రజ్‌ రంగ పంచిన ఫన్ అందరికి గుర్తుండిపోతుంది.

చూడచ్చా

యూత్ లవ్ స్టోరీలు మీకు ఇంట్రస్ట్ ఉంటే దీన్ని చూడవచ్చు. నాలుగు కథల్లో ఏదో ఒక కథకి కనెక్ట్ అయ్యి, తెరపై కనిపించే పాత్రని ఓన్ చేసుకుంటే నచ్చుతుంది. లేకపోతే బోర్ కొట్టేస్తుంది. యూత్ టార్గెట్, వారు చూస్తేనే బెస్ట్

ఎక్కడుంది

ఈటీవి విన్ లో తెలుగులో ఉందీ సినిమా

Read More
Next Story