మరో అరుదైన గౌరవాన్ని పొందిన ‘‘ ఆర్ఆర్ఆర్’’
x

మరో అరుదైన గౌరవాన్ని పొందిన ‘‘ ఆర్ఆర్ఆర్’’

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం‘‘ ఆర్ఆర్ఆర్’’ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. లాస్ ఏంజిల్స్ లోని ప్రఖ్యాత అకాడమీ మ్యూజియం ఆఫ్..


దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ చిత్రానికి మరో గౌరవం లభించింది.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో గల అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో వరిజినల్ సౌండ్ ట్రాక్ ల ద్వారా రూపొందించిన "మ్యూజికల్ టేప్‌స్ట్రీస్" ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలైన ఆర్ఆర్ఆర్ తో పాటు స్లమ్ డాగ్ మిలియనీర్, లగాన్ చిత్రాలు ఉన్నట్లు తెలిపింది.

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలోని మ్యూజియం మే 18న లాస్ ఏంజిల్స్‌లోని డేవిడ్ జెఫెన్ థియేటర్‌లో ఉపన్యాసం నిర్వహించనున్నట్లు తెలిపింది.
అకాడమీ అవార్డులు అందుకున్న "RRR' (2022), 'స్లమ్‌డాగ్ మిలియనీర్' (2008), 'లగాన్' (2001) చిత్రాల సంగీత సాగరంలో ఓలాలాడేందుకు మాతో చేరండి అంటూ అకాడమీ ఓ ప్రకటను విడుదల చేసింది.
ఉపన్యాసం తర్వాత డ్యాన్స్ కంపెనీ బోలీపాప్, సదుబాస్ (క్లాసికల్ తబలా కళాకారుడు రాబిన్ సుఖాడియా, ఎలక్ట్రానిక్ సంగీత నిర్మాత అమీత్ మెహతా ద్వయం) లైవ్ తబలాప్రదర్శనతో మూడు చిత్రాల సంగీతాన్ని తిరిగి అర్థం చేసుకుంటారని ప్రకటనలో వివరించారు.
బ్రిటిష్ వలసపాలన కాలంలో ఇద్దరు స్వత్రంత సమరయోధుల వాస్తవ కథల నుంచి స్పూర్తిని పొందిన ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ను తెరకెక్కించారు. ఇందులో కొమరంభీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరీ సీతారామరాజు పాత్రంలో రామ్ చరణ్ కనిపించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 12వందల కోట్లను కలెక్ట్ చేసింది. సినిమాలోని తెలుగు ట్రాక్ "నాటు నాటు" పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ ను గెలుచుకుంది. ఇది భారతీయ నిర్మాణంలో గెలుచుకున్న తొలి ఆస్కార్ అవార్డు కావడం విశేషం. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన చిత్రం లగాన్. ఇందులో బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించారు. లగాన్ ఆస్కార్ లో ఉత్తవ విదేశీ భాషా విభాగంలో పోటీ పడింది. ఐదు నామినీల్లోకి వచ్చిన చివరి భారతీయ చిత్రం. ఇది 2001లో విడుదల అయింది. అయితే చివరకు ‘నో మ్యాన్ ల్యాండ్’ చిత్రం ఆస్కార్ ను ఎగరేసుకుపోయింది.
"స్లమ్‌డాగ్ మిలియనీర్" బ్రిటీష్ ప్రొడక్షన్, దీనికి డానీ బాయిల్ దర్శకత్వం వహించారు. ఇది 2008లో విడుదల అయింది. ఈ చిత్రానికి గాను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, గీత రచయిత గుల్జార్ తో సహా మొత్తం ఎనిమిది విభాగాల్లో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌గా రెహమాన్ మరో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. భారతీయ సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి రిచర్డ్ ప్రైక్, ఇయాన్ ట్యాప్‌లతో కలిసి ఉత్తమ సౌండ్ మిక్సింగ్ ట్రోఫీని పంచుకున్నారు.
Read More
Next Story