సాయి థన్సిక  ‘ఐందం వేదం’వెబ్ సీరిస్ రివ్యూ
x

సాయి థన్సిక ‘ఐందం వేదం’వెబ్ సీరిస్ రివ్యూ

కొన్ని మైనస్ లు ప్రక్కన పెడితే ఇంట్రస్టింగ్ ప్రిమైజ్ చివరిదాకా కట్టిపారేస్తుంది.




సాయి థన్సిక ‘ఐందం వేదం’వెబ్ సీరిస్ రివ్యూ
ఒకప్పుడు ‘మర్మదేశం’అనే టీవీ సీరియల్ సెన్సేషన్. ఇప్పటికీ దాన్ని చాలా మంది గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ దర్శకుడు ఎల్ నాగరాజన్ ఆ తర్వాత రెండు మూడు చేసారు కానీ అంత గుర్తింపు రాలేదు. అయితే ఇంతకాలానికి ఓ వెబ్ సీరిస్ తో తన స్టైల్ నేరేషన్ తో థ్రిల్లర్ కథాంశానికి మైథాలాజీని జోడిస్తూ మన ముందుకు వచ్చారు. 'ఐందం వేదం' టైటిల్ తో రూపొందిన ఈ తమిళ సిరీస్, తెలుగుతో సహా ఇతర భాషల్లోను 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. సాయి ధన్సిక ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ ఎలా ఉంది., చూడదగినదేనా అనేది ఇప్పుడు చూద్దాం.

స్టోరీ లైన్

కలకత్తాకు చెందిన అనూ (సాయి ధన్సిక) తన తల్లి అస్థికలను 'గంగ'లో కలపడానికి ఆమె 'కాశీ'కి చేరుకుంటుంది. అక్కడ ఆమెకి ఒక స్వామీజి తారసపడతాడు. ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమె చేతిలో పురాతన కాలంనాటి ఒక చిన్న పెట్టె పెట్టి, దానిని 'అయ్యంగారపురం'లోని శివాలయం పూజారికి అందజేయమని చెబుతాడు. అంతేకాకుండా తాను భూమి మీదకు వచ్చిన పని అయ్యిందని ఊహించని విధంగా వెంటనే యాక్సిడెంటల్ గా ఆయన చనిపోతాడు. ఆ షాక్ లో ఆ పెట్టె ని అక్కడే వదిలేసి వచ్చి పాండిఛ్చేరి బయిలు దేరుతుంది. అయితే ఆమె అనుకున్నట్లుగా జరగదు. ఆ పెట్టె ఆమెను మళ్లీ చేరుతుంది. ఆమె ఎక్కిన కారు అటు తిరిగి , ఇటు తిరిగి 'అయ్యంగారపురం' వైపు మళ్లుతుంది.

'అయ్యంగారపురం' శివాలయంలో ప్రధాన పూజారి అయిన 'రుద్రపతి' ( వైజీ మహేంద్ర) కొడుకు 'సాంబుడు'కి ఆ పెట్టెను అందజేస్తుంది. ఆ తరువాత ఆమె ఆ ఊరు నుంచి వెళ్లిపోదామనకుంటే అది సాధ్యం కాదు. ఏదో సమస్య అడ్డుపడుతుంది. ఆమెకు ఏమీ అర్దం కాదు. ఇక ఆ శివాలయంకు ఓ ప్రత్యేకత ఉంటుంది. బ్రహ్మదేవుడికి సంబంధించిన సన్నిధానం ఆ ఆలయంలోనే రహస్యంగా ఉంటుందని అక్కడి వాళ్లు నమ్ముతారు. వెయ్యి ఏళ్ల తరువాత అది బయటపడే సమయం రానుందని వెయిట్ చేస్తూంటారు. నాలుగు గ్రహాలు సూర్యుడికి ఎదురుగా సమాంతర రేఖలోకి వచ్చినప్పుడు ఆ అద్భుతం జరుగుతుందని చెప్పుకుంటూంటారు. అందుకు సంభందించిన తాళపత్ర గ్రంధాలు ఉంటాయి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.

ఇక బ్రహ్మ దేవుడికి సంబంధించిన ఆ సన్నిధానాన్ని రక్షించే బాధ్యత మూడు కుటుంబాలకు అప్పగించబడిందనీ, అందులో అనూ కూడా ఒక కుటుంబానికి చెందిన కారణంగానే, కాశీ నుంచి ఆమె ఆ పెట్టె తీసుకుని రావడం జరిగిందని రుద్రపతి చెప్తాడు. ఆమె వచ్చిన పని పూర్తి కాలేదు కాబట్టే అక్కడ నుంచి వెళ్లలేకపోతోందని చెప్తారు. అనూ తీసుకొచ్చిన పెట్టెలో 'నిధి'కి సంబంధించిన రహస్యాలు ఉండొచ్చని భావించిన ఆ ఊరు ప్రెసిడెంట్, ఆ పెట్టెను దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే మరిన్ని పాత్రలు ఆ ఊరుకి రకరకాల కారణాలతో చేరుకుంటారు. అయితే ఆ పెట్టెలో ఏముంది. చివరకు అను ఏమైంది...అక్కడ ఏం అద్బుతం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే వెబ్ సీరిస్ మొత్తం చూడాల్సిందే.

ఏముంది ఈ సీరిస్ లో

ఇప్పటికి ప్రపంచంలో నాలుగు వేదాలు చలామణిలో ఉన్నాయి. ఐదవ వేదం గురించి ఈ కథ. ఈ ఐదవ వేదం విషయం ఓ పురాతన తాళపత్ర గ్రంధంలో ఉంటుంది. ఆ వేదం వలన ప్రపంచ మానవాళి భవిష్యత్తు మారిపోతుంది. ఆ పాయింట్ చుట్టూ కథ అల్లుకున్నారు. . ప్రధానమైన పాత్రలన్నీ ఒక్కొక్కటిగా ఆలయం ఉన్న 'అయ్యంగారపురం' ఊరుకు చేరుకోవడం ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. ఐదవ వేదానికి సంబంధించిన ఆనవాళ్లను తెలుసుకోవడానికి పరోశోధన,మరో ప్రక్క జరుగుతన్న హత్యలు, పురాతన గ్రంధాలు, శిల్పాలులోని భాషను డీ కోడ్ చేయటం వంటివి ఆసక్తిగా మలిచారు. అయితే ఈ సీరిస్ ని సగంలోనే ఎండ్ చేసేసారు. పూర్తి క్లారిటీ ఇవ్వరు.

అనూ పాత్ర .. ఆమె తండ్రి పాత్ర .. గురూజీ .. పతి .. మిత్రన్ .. కేతకి .. అజ్ఞాత యువకుడి ఎవరి పాత్రలకు సరైన నాలెడ్జ్ మనకు ఇవ్వరు. దాంతో మనకు కాస్త కన్ఫూజింగ్ గా ఉంటుంది. అయితే మెయిన్ థ్రెడ్ బలంగా ఉండటంతో చివరి వరకూ చూడగలగుతాము. ఫెరఫార్మెన్స్ లు, టెక్నికల్ యాస్పెక్ట్స్ సీరిస్ ని విసుగు లేకుండా ముందుకు తీసుకెళ్లగలిగాయి. అలాగే ఈ సీరిస్ కొన్ని చోట్ల పరుగెత్తినా కొన్ని చోట్ల బాగా డ్రాగ్ అయ్యింది. అయితే వాటిని దాటితేనే సీరిస్ ని పూర్తి గా చూడగలుగుతాము. అలాగే మైధాలిజీ ఎలిమెంట్స్ కొన్ని చోట్ల కన్ఫూజన్ కు గురి చేస్తాయి. అలాగే సీన్స్ లో వివరణ కూడా ఎక్కవైంది. ఏవి ఎలా ఉన్నా ఎపిసోడ్స్ ని చివరి దాకా చూడగలుగాము. స్టోరీ ఐడియాలో ఆ సత్తా ఉంది.
టెక్నికల్ గా చూస్తే ..

.శ్రీనివాసన్ దేవరాజన్ సినిమాటోగ్రఫీ, రేవా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రెజీష్ ఎడిటింగ్ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నటీనటుల స్ట్రాంగ్ ఫెరఫార్మెన్స్ లు కలిసి వచ్చాయి. మరీ ముఖ్యంగా సాయి ధన్సిక అయితే అదరకొట్టింది. విజువల్ ఎఫెక్ట్ లు సినిమా స్దాయిలో ఉన్నాయి. అయితే స్క్రిప్టులో థ్రెడ్ లు ఎక్కువ అవటం, కొన్ని చోట్ల అవసరానికి మించి కథనం స్లో అవటం,. కన్ఫూజ్ చేసే మైధలాజికల్ ఎలిమెంట్స్ ఇబ్బంది పెట్టాయి.

చూడచ్చా

ఈ మైథలాజికల్ థ్రిల్లర్ కొత్త ఎక్సపీరియన్స్ ని ఇస్తుంది. కొన్ని మైనస్ లు ప్రక్కన పెడితే ఇంట్రస్టింగ్ ప్రిమైజ్ చివరిదాకా కట్టిపారేస్తుంది. విజవల్స్ కూడా స్టన్నింగ్ చేసే విధంగా ఉండటం కలిసొచ్చే అంశం. వీకెండ్ మంచి కాలక్షేపమే.

ఎక్కడ చూడచ్చు

జీ 5 లో తెలుగులో ఈ సీరిస్ ఉంది.


Read More
Next Story