![IMDb లో సాయి పల్లవి టాప్ 5 చిత్రాలు- ఏ ఓటీటీలో చూడచ్చు IMDb లో సాయి పల్లవి టాప్ 5 చిత్రాలు- ఏ ఓటీటీలో చూడచ్చు](https://telangana.thefederal.com/h-upload/2025/02/06/510871-whatsapp-image-2025-02-06-at-121745-pm.webp)
IMDb లో సాయి పల్లవి టాప్ 5 చిత్రాలు- ఏ ఓటీటీలో చూడచ్చు
'హైబ్రిడ్ పిల్ల' గా తెలుగువారికి దగ్గరైన అందం, అభినయం సాయి పల్లవి.
'హైబ్రిడ్ పిల్ల' గా తెలుగువారికి దగ్గరైన అందం, అభినయం సాయి పల్లవి. తెరపై సహజంగా నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సౌత్ బ్యూటీ సినిమా రిలీజ్ అవుతోందంటే సినిమా ప్రియులకు పండగే. పక్కన ఎవరు హీరో ఉన్నా అనవసరం ఆమె ఉంటే చాలు చూసేస్తామంటారు.
సాయి పల్లవి వైద్య విద్యను అభ్యసిస్తూనే 2015లో తన తొలి చిత్రం ప్రేమమ్‌కు సైన్ చేసింది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసిందే లేదు. నాగ చైతన్యతో కలిసి నటించిన ఆమె తాజా చిత్రం తండల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో OTT ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న ఆమె టాప్ ఐదు IMDb-రేటింగ్ ఉన్న చిత్రాలను ఇక్కడ చూడండి.
1. ప్రేమమ్ (2015)
సాయి పల్లవి మలయాళం 'ప్రేమమ్' సినిమా ద్వారానే పూర్తి స్థాయిలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందే ఆమె సినిమాల్లో నటించింది. 'కస్తూరీ మాన్', 'ధామ్‌ధూమ్' అనే రెండు తమిళ చిత్రాల్లో చిన్నపాటి పాత్రలు చేసినా రాని గుర్తింపు ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా వచ్చేసింది.
ఈ సినిమా ఎక్కడ చూడచ్చు : Disney+ Hotstar
IMDb Rating: 8.3
2. గార్గి (2022)
సాయి పల్లవి (Sai Pallavi) నటించిన ప్రయోగాత్మ చిత్రం గార్గి (Gargi). గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2022 జులై 15న విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇందులో టీచర్‌గా నటించిన సాయి పల్లవి.. తన తండ్రిని కాపాడుకునేందుకు చేసిన పోరాటం ఆకట్టుకుంది. మధ్యతరగతి యువతి క్యారెక్టర్‌లో ఆమె ఒదిగిపోయిన తీరుకు సినీ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.
ఈ సినిమా ఎక్కడ చూడచ్చు : SonyLIV
IMDb Rating: 8.1
3. Paava Kathaigal (2020)
సాయి పల్లవి లో ఉన్న నటి నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది అనటానికి పావ కధైగళ్ చక్కని ఉదాహరణ. నాలుగు కథల సమాహారమయిన ఈ చిత్రంలో సాయి పల్లవి నటించిన సెగ్మెంట్‍కి ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. ప్రకాష్‍రాజ్ కూతురిగా సాయి పల్లవి ఇందులో కనిపిస్తుంది. తండ్రికి ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిన కూతురిగా సాయి పల్లవి నటించింది.
రెండేళ్ల తర్వాత ఆమె ఆచూకీ తెలుసుకుని వచ్చిన తండ్రి కూతురు గర్భవతి కావడంతో సీమంతం చేస్తానంటూ ఇంటికి తీసుకెళ్తాడు. కుటుంబ పరువు తీసిందనే కోపంతో ఆమె గర్భవతి అని కూడా చూడకుండా విషం ఇచ్చేస్తాడు. కంటి ముందే కూతురు చనిపోతున్నా కానీ చలించకుండా చూస్తాడే తప్ప బ్రతికించాలని చూడడు. ఈ సెగ్మెంట్‍లో సాయి పల్లవి నటన గురించి ఇప్పుటికీ సోషల్ మీడియా అంతా గొప్పగా మాట్లాడుకుంటారు. విమర్శకులు కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సినిమా ఎక్కడ చూడచ్చు : Netflix
IMDb Rating: 8.0
4. ఫిదా (2017)
వరుణ్ తేజ్, 'ప్రేమమ్' బ్యూటీ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఫిదా సినిమా నిర్మాతకి లాభాల పంట పండించింది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచే కాకుండా విమర్శకుల నుంచి సైతం మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌తోపాటు పూర్తి తెలంగాణ యాసలో సాయి పల్లవి పాత్ర చెప్పిన డైలాగ్స్, ఎమోషన్ సీన్స్‌లో ఆమె చూపిన పర్‌ఫార్మెన్స్ 'ఫిదా' ఆడియెన్స్‌ని నిజంగానే ఫిదా చేసాయి.
ఈ సినిమా ఎక్కడ చూడచ్చు : Amazon Prime Video
IMDb Rating: 7.4
5. శ్యామ్ సింగ రాయ్ (2021)
నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీలోనాని, వాసు, శ్యామ్ సింగరాయ్ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు.సాయి పల్లవి తన హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ మరియు తన నాట్యంతోనూ ఆకట్టుకుంది.
ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ భారమైన పాత్రను చాలా తన ప్రతిభతో సునాయసంగా తెరపైన మెరుపులు మెరిపించారు. ఇప్పటి వరకు గ్లామర్ తారగా, ఫెర్ఫార్మర్‌గా చూసి ఉన్నాం. కానీ శ్యామ్ సింగరాయ్‌లో ఆమె ఫెర్ఫార్మర్‌గా మరో లెవెల్‌లో కనిపిస్తుంది. దేవదాసి పాత్రలో ప్రేక్షకుల మనసుకు మరింత దగ్గరవుతుంది.
ఈ సినిమా ఎక్కడ చూడచ్చు : Netflix
IMDb Rating: 7.6
నటిగా తమిళంలో, తెలుగు ఫిలింఫేర్, సౌత్ ఇండియన్, ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ అందుకుంది. అలాగే 2020లో అత్యంత ఆదరణ పొందిన అండర్ 30 సెలబ్రిటీల ఫోర్బ్స్ ఇండియా జాబితాలో టాప్‌లో నిలిచింది. అలా గ్లామర్ షో దూరంగా ఉంటూ కమర్షియల్ హిట్స్ అందుకోవడం హీరోయిన్లలో ఒక్క సాయి పల్లవికే సాధ్యం. ఆమె నటించిన తండేల్ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.