మాదీ జై- వీరు సంబంధం- సల్మాన్
x
SALMAN KHAN, BOLLYWOOD

మాదీ జై- వీరు సంబంధం- సల్మాన్

షారుక్ తో తెరపై నా బంధం ఇంత బలంగా ఉందంటే కారణం తెరవెనక మా స్నేహం అంతకంటే బలంగా ఉండటమే అని బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అన్నారు. మేము ఇద్దరం కలిసి థియెటర్లో వస్తే చరిత్రే అవుతుందని, మా స్నేహాం bollywood అల్ టైం గ్రేట్ షోలే సినిమాలోని జై - వీరు లతో ఆయన పోల్చారు. అభిమానులు ఇద్దరు యాక్షన్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని ఇష్టపడుతున్నారని అన్నారు. అభిమానులకు తమ స్నేహం గురించి కరణ్ అర్జున్ సినిమా నుంచే తెలుసని పేర్కొన్నారు.


సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఇద్దరు మూడు దశాబ్దాల క్రితం దాదాపు ఒకే సమయంలో తమ కెరీర్ ను ప్రారంభించారు. అనేక సూపర్ హిట్లు, కొన్ని పరాజయాలు పలకరించిన విజయవంతంగా ఇండస్ట్రీలో నిలదొక్కుని అగ్రస్థానానికి ఎదిగారు. ఈ మధ్య విడుదలైన పఠాన్, టైగర్ 3 చిత్రాల్లో ఒకరి సినిమాల్లో ఒకరు అతిథి పాత్రల్లో కనిపించారు.

కింగ్ ఖాన్ కు దేశ వ్యాప్తంగా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే నాకు ఉన్నారు. అలాంటి మేమిద్దరం కలిస్తే అది చరిత్రే అవుతుందని పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. షారుక్ ను జై( షోలే లో ధర్మేంద్ర) తనను వీరుగా( షోలే లో అమితాబ్ పాత్ర) అభిమానులు పోలుస్తున్నారని, అది తనకు ఎంతో సంతోషంగా ఉందని పీటీఐ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మా ఇద్దరికి స్నేహంలో మధురానుభూతులు ఉన్నాయని అన్నారు. మేము ఇద్దరం కలిసి షూటింగ్ చేస్తే ఏదో పని చేస్తున్నట్లు ఉండదని, అంతా సరదాగా గడిచిపోతుందని చెప్పారు.

బాలీవుడ్ చరిత్రను షోలేకు ముందు, తరువాతగా సినిమా ట్రేడ్ పండితులు విశ్లేషిస్తారు. ఇందులో అప్పటి బాలీవుడ్ స్టార్లు ధర్మేంద్ర, అమితాబ్ నటించారు. దీంతో వారు ఓవర్ నెైట్ స్టార్ లు గా మారారు. ఇందులో విలన్ పాత్ర గబ్బర్ సింగ్ కూడా ఇప్పటికి సినీ జనాలకు బాగా గుర్తే. స్నేహం ప్రధాన ఇతివృత్తంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు సల్మాన్ తండ్రి సలీంఖాన్ ఓ రచయిత. కాగా సహ రచయితగా జావేద్ అక్తర్ పనిచేశారు.

Read More
Next Story