ఏ వతన్ మేరే వతన్ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
x

'ఏ వతన్ మేరే వతన్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

జనాల్లో దేశ భక్తి తగ్గిపోతోందా...లేక వేరే కారణమా. ఈ సినిమా ని పట్టించుకోవటం లేదు? మహాత్మాగాంధీ మునిమనవడుకి నచ్చిన చిత్రం. సామాన్యులకు ఎక్కటం లేదు. ఎందుకు?


“మేము ఎదుగుతున్న సమయంలో ఉషాబెన్ మెహతాను గురించి తెలుసుకున్నాము. ఆమె నేను కుర్రాడుగా ఉన్నప్పుడు మార్గదర్శకత్వం వహించింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్య కాంగ్రెస్ రేడియోలో ఆమె చేసిన వ్యాఖ్యానాలు, కథలు చాలా విన్నాను. నేను #ఏ_వతన్_మేరే_వతన్ చూడగానే ఆ రోజులు మళ్లీ కళ్ల ముందు కనిపించాయి. ఉషాబెన్‌ను సజీవంగా తీసుకొచ్చిన @SaraAliKhanకు ధన్యవాదాలు." అంటూ హాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఓ సినిమా చూసిన తర్వాత ప్రశంసిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నిజానికి అది ఖచ్చితంగా ఆసక్తికరమైన విషయమే. అయితే ఆ సినిమా ఆ స్దాయి వారికి కాకుండా సామాన్యులను కూడా ఆకట్టుకుంటే ఆ లెక్కే వేరే రకంగా ఉంటుంది. కానీ ఈ సినిమా జనాల్లోకి పెద్దగా వెళ్లటం లేదు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో .వచ్చిన ఈ సినిమా నిజానికి స్ఫూర్తిని పొందవలసిన ఉన్న కథతోనే వచ్చింది. అయితే ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది.ఎందుకని..


ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటంటే... అప్పట్లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, గుర్తింపుకు దూరంగా ఉండిపోయిన 'ఉష మెహతా' అనే ఒక విప్లవనారి కథ 'ఏ వతన్ మేరే వతన్' . 1930లలో మొదలయ్యే ఈ కథ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో నడుస్తుంది. ఆంగ్లేయుల ఆగడాలు చూస్తూ పెరుగిన ఉష (సారా అలీఖాన్)కు తను కూడా దేశం కోసం ఏదైనా చెయ్యాలని ఉంటుంది. అయితే ఆమె తండ్రి హరిప్రసాద్ (సచిన్ ఖేడ్కర్) కు అది నచ్చదు. ఆయనో జడ్జి..ఆంగ్లేయులకి మద్దతుదారుడు. అది ఇంకా కోపాన్ని తెప్పిస్తూంటుంది ఆమెకు. దేశం అంతా దేశభక్తితో ఊగిపోతూంటుంది. మరో ప్రక్క మహాత్మా గాంధీ ఇచ్చిన 'డూ ఆర్ డై' (కరో యా మరో) పిలుపు ఇస్తారు. ఆ పిలుపు 22 ఏళ్ల ఉషా మెహతా (సారా అలీ ఖాన్) ని ఆ ఉద్యమం లో పాల్గొనేలా చేస్తుంది. ఆ క్రమంలో తండ్రి ఆమెను బంధిస్తే...తప్పించుకుని పారిపోయి మరీ దేశం తరఫున పోరాటం మొదలెడుతుంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రేడియో స్టేషన్ నిర్వహిస్తుంది. ఆమెకు రామ్ మనోహర్ లోహియా (ఇమ్రాన్ హష్మీ) నుంచి మద్దతు లభిస్తుంది. అయితే ఆమెను ప్రేమిస్తున్న కౌశిక్ (అభయ్ వర్మ)కు ఇలా ఆమె అన్నీ వదిలేసి దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్దపడటం నచ్చదు. 'కాంగ్రెస్ రేడియో' పేరుతో ప్రసారమయ్యే ఈ పోగ్రామ్ లు ప్రజలను ఉద్యమం దిసగా ప్రేరిపిస్తూంటాయి. దాంతో బ్రిటీష్ వారు ఎలాగైనా ఆ స్టేషన్ ని క్లోజ్ చేయాలని ముంబై ఇన్‌స్పెక్టర్ (అలెక్స్ ఓ నీల్) రంగంలోకి దింపుతారు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించే వాహనంతో గాలింపు మొదలెడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఉష మొదలెట్టినా రేడియో తో ఆమె లక్ష్యం ఎంతవరకూ నెరవేరుతుంది? అనేది మిగతా కథ.

సినిమా తీయటం బాగానే తీసారు. 1942 కాలానికి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు. అందులోనూ సక్సెస్ అయ్యారు. కానీ బడ్జెట్ లిమిటేషన్స్ అనుకుంటాను...పెద్దగా లొకేషన్స్ ఛేంజ్ లేకుండా చుట్టేసిన ఫీలింగ్ వచ్చింది. అయితే డైరక్టర్ కష్టం మాత్రం కనిపిస్తుంది. అప్పటి కాస్ట్యూమ్స్ , వాహనాలు,ఆయుధాలు,ఫోన్లు,రేడియోలు ఇవన్నీ సహజంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు అమలేందు చౌదరి ఫొటోగ్రఫీ .. ముకుంద్ - అక్షదీప్ - శశి సుమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా పనికొచ్చాయి. అయితే స్క్రిప్టు మాత్రం సరిగ్గా చేయలేదనిపిస్తుంది. ఉష క్యారక్టర్ లో ఉత్సాహం,ధైర్యం మనకు అంతగా కనపడవు. అవి ఎలివేట్ అయ్యే ఎపిసోడ్స్ లేవు. ఏదో కథగా నడిచిపోతుంది కానీ ఎక్కడా గూస్ బంప్స్ వచ్చే పరిస్దితి లేదు. ఇక ఉషా మెహతా పాత్రకు సారా అలీ ఖాన్ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదనే చెప్పాలి. గెటప్ బాగానే కుదిరింది కానీ దేశభక్తి అనే ఎమోషన్ లో ఆమెలో మనకు ఎలివేట్ కాలేదు. అమాయకత్వం కనపడినట్లుగా మిగతావేమీ పలకలేదు. స్టోరీ లైన్ బాగున్నా..దాన్ని జనాలకు నచ్చే స్క్రిప్టుగా చేయటంలో తడబడ్డారు. దాంతో జనాలకు ఈ సినిమా అంతగా కనెక్ట్ కావటం లేదనే చెప్పాలి.

చూడచ్చా

దేశభక్తి తో ఈ సినిమాని చూడాలి తప్పించి, ఏదో ఎమోషన్ ని ఎక్సపెక్ట్ చేస్తే దెబ్బ తింటాము.

ఎక్కడ చూడచ్చు

అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో ప్రసారం అవుతోంది.


Read More
Next Story