సత్యరాజ్ త్రిబాణధారి బార్బరిక్  మూవీ రివ్యూ
x

సత్యరాజ్ 'త్రిబాణధారి బార్బరిక్' మూవీ రివ్యూ

థ్రిల్ ఉంది, మిథ్ ఉంది, కానీ సినిమానే?

సైకియాట్రిస్ట్ శ్యామ్ (సత్యరాజ్) ఎంతో ప్రేమగా అన్నీ తానే అయ్యి పెంచుకుంటున్న మనవరాలు నిధి (మేఘన)మిస్సవ్వటం ఆందోళనలో పడేస్తుంది. స్కూలుకు వెళ్లి రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో, శ్యామ్ ఆందోళనతో పోలీసుల సహాయం కోరతాడు. కానిస్టేబుల్ చంద్రం (సత్యం రాజేష్)తో కలిసి నిధిని వెతికే ప్రయత్నం చేస్తాడు. ఆ ఇన్విస్టిగేషన్ లో లోతుకి వెళ్ళే క్రమంలో అనేక నిజాలు బయిటకు వస్తూంటాయి.

ఇదిలా ఉంటే మరో ప్రక్క విదేశాలకు డబ్బు కోసం ప్రయత్నిస్తూంటాడు రామ్ (వశిష్ఠ సింహా), అతని స్నేహితుడు దేవా (క్రాంతి కిరణ్) జూదం ఆడి అప్పులు పాలై డబ్బులు కోసం డెస్పరేట్ గా ఉంటాడు. వీళ్లిద్దరూ కలిసి ఓ ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ కు నిధి మిస్సవ్వటానికి సంభందం ఏమిటి? ఇంతకీ శ్యామ్ తన మనవరాల కోసం ఏం చేశాడు? అలాగే పురాణ గాథలోని బార్బరీకుడు ఈ కథలో ఎలా వచ్చాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

“త్రిబాణధారి బార్బరిక్” టైటిల్ వినగానే వెంటనే క్యూరియాసిటీ కలుగుతుంది. బార్బరిక్ అంటే ఘటోత్కచుడి కొడుకు, కేవలం మూడు బాణాలతో యుద్ధాన్ని పూర్తి చేసే సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఈ డివైన్/మైథాలాజికల్ ఐడియా సినిమాకు ఏ విధంగా లింక్ అవుతుందో అని ఆసక్తి పుడుతుంది. అదే ఈ సినిమాకు USP. ఈ మైథాలజీని ప్రస్తుత కథలో లింక్ చేయడం, ప్రేక్షకుల అంచనాలను సంతృప్తిపరచడమే ఈ సినిమా లక్ష్యం కావాలి. అయితే, డివైన్ ఎలిమెంట్ తెరపై అంత ప్రభావవంతంగా అనిపించలేదు.

మరో ప్రక్క ఇప్పటి ట్రెండ్ చూసుకుంటే, వర్తమానంలో జరిగే కథలకు చారిత్రక నేపథ్యం లేదా డివైన్ ఎలిమెంట్ జోడించడం బాక్సాఫీస్ సక్సెస్ లో కీలకం అయ్యింది. “కార్తికేయ 2”, “కాంతార”, “కల్కి” వంటి సినిమాలు దీని ద్వారా ప్రేక్షకులను కొత్త అనుభూతికి ముంచెత్తాయి. ఈ ఫార్ములా ఎప్పుడు బాగా పనిచేస్తుందంటే – ప్రేక్షకులకు సహజంగా అనిపించాలి, కథతో సింక్ కావాలి; లేకపోతే మొత్తం వంటకం చెడిపోతుంది.

“త్రిబాణధారి బార్బరిక్”లో డైరెక్టర్ ఎంచుకున్న డివైన్ ఎలిమెంట్ ఇంట్రస్టింగ్ గా ఉంది. దర్శకుడు దీన్ని ప్రస్తుత కథకు లింక్ చేయడానికి కష్టపడ్డాడు. కానీ ప్రధాన సమస్య ఏమిటంటే – డివైన్ ఎలిమెంట్ అనుకున్నంత ప్రభావవంతంగా తెరపై ప్రెజెంట్ చేయలేకపోయాడు, సింక్ పూర్తిగా కుదరలేదు.

“A divine hook without proper sync is like a high-concept idea with weak execution – it teases, but doesn’t fully land.”

మంచి థ్రిల్లర్స్‌కి అసలైన బలం సబ్‌టెక్స్ట్. కథలోని లేయర్లు నేరుగా కంటపడకుండా, ఆడియన్స్ ఊహల్లో, సైలెన్స్‌లో, సన్నివేశాల మధ్య నుంచి వెలువడాలి. కానీ ఈ సినిమా మాత్రం ఫిలాసఫీనే కథ అని అనుకుని కొన్ని చోట్ల విసిగిస్తుంది.

ఇది ఒక సింపుల్ పోలికతో అర్థమవుతుంది. సూపర్ హిట్ విక్రమ్ వేద సినిమాలో కాంటపరరీ కథల్ని ఆధారంగా తీసుకుని, అప్పటి విక్రమ్ , భేతాళ కథలను బేస్ పెట్టుకుని, వాటి తాత్వికతను సైలెంటుగా, సన్నివేశాల గుండా నెమ్మదిగా మేళవించారు. కానీ బార్బరిక్ లో మాత్రం అది జరరగలేదు. ఎలా అనిపిస్తుందంటే – “ఒకవేళ విక్రమ్ వేదలో విజయ్ సేతుపతి, బేతాళుడి వేషం వేసుకుని, పెద్ద పెద్ద డైలాగులతో తన తత్వాన్ని బిగ్గరగా చెప్పేసినట్లయితే ఎలా ఉంటుందో?” అదే ఇక్కడ జరిగింది.

అయితే “వాట్నెక్స్ట్?” అన్నట్లుగా దర్శకుడు ప్రేక్షకుల్లో క్యూరియాసిటిని పెంచడంలో విజయం సాధించాడు. కథలో సస్పెన్స్ , మినిమల్ ట్విస్టులు,ముఖ్యంగా ఇంట్రవెల్ సీన్ సినిమాకు హైలెట్ గా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్టులతో ముందుకు తీసుకు వెళ్లి సినిమాను ముగించటం కలిసొచ్చింది.

ఎవరెలా...

సత్యరాజ్ కు ఫిట్ అయ్యేలా ఒక టెయిలర్‌ మేడ్ రోల్. నటన న్యాచురల్‌గా ఉంది.ముఖ్యంగా చివరి పదిహేను నిమిషాల్లో ఆయన నటన హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే వసిష్ట సింహకు మంచి రోల్ ఇచ్చారు, చాలా బాగున్నాడు. versatility ఉన్న హీరో అనిపించుకున్నాడు. సత్యం రాజేష్ సగటు రేంజ్‌లోనే – "just about okay". ఉదయభానుకు మంచి పాత్రే కానీ చెప్పుకునేటంత విషయం ఉన్న సీన్స్ పడలేదు.

కుషేందర్ రమేష్ కెమెరావర్క్ బాగుంది, నైట్ సీన్స్ విజువల్స్ అదిరిపోతాయి. ఇన్ఫ్యూషన్ బ్యాండ్ అందించిన BGM, మ్యూజిక్ చాలా బాగుంది. డైలాగ్స్, మిథాలజీ రిఫరెన్స్‌లు బాగానే వర్కవుట్ చేసారు. దర్సకుడు స్క్రీన్ ప్లే పరంగా కొంచెం కొత్తగా ట్రై చేశాడు కానీ.. కన్ఫ్య్యూజన్ లేకుండా కథను చెప్పలేకపోయాడు.

ఫైనల్ థాట్

ఇలాంటి థ్రిల్లర్ కథలకు అవసరమైంది స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ డెప్త్. అవి ఆ ఎక్సపీరియన్స్ surface-levelగా మాత్రమే మిగిలిపోయింది. తాత తన మనవరాలను కిడ్నాప్ చేసిన వారిని వెతుకుతూ, మహాభారత యోధుడి కథతో ప్రభావితం అవ్వడం అనేది నిజంగానే juicy pulp స్టోరి. సరైన execution ఉంటే, ఇది raw, స్ట్రేంజ్, సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యేది.

Read More
Next Story