ఆ ‘రహదారి’ కోసం ఎన్ని కష్టాలు అనుభవించాడో..!
x

ఆ ‘రహదారి’ కోసం ఎన్ని కష్టాలు అనుభవించాడో..!

నేడు రజనీకాంత్ 75 వ బర్త్ డే


‘‘ శృంగార వీర.. అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా.. వయస్సైన నీ స్టైల్, అందం ఇంకా నిన్నువదిలిపోలేదు’’ నరసింహం సినిమాలో రజనీకాంత్, తన ఇంటికి వచ్చినప్పుడు నీలాంబరి( రమ్యకృష్ణ) చెప్పిన డైలాగ్.. దీనికి ప్రతిగా తలైవా.. ‘‘ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ.. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు’’ అంటారు.

1999 లో విడుదలైన ‘నరసింహ’ సినిమా ఎంతో సెన్సేషన్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. తమిళ్, తెలుగు, కన్నడ, కేరళలో కలెక్షన్ల వర్షం కురిపించింది. కే ఎస్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ.. 1980 లలో కన్నడ సినీ ప్రముఖులలో ఒకరైన అశోక్ ‘‘ ది ఫెడరల్‌’’తో మాట్లాడుతూ.. “ నీలాంబరి (రమ్య కృష్ణన్), నరసింహ (రజినీకాంత్) మధ్య జరిగిన సంభాషణలోని ఈ సన్నివేశం ఇంకా జనాన్ని ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు అవుతోంది. అప్పుడూ ఇప్పుడూ శివాజీ( రజనీకాంత్ అసలు పేరు) వ్యక్తిత్వం అసలు మారలేదన్నారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానుల పట్ల అలాగే ప్రేమగా ఉన్నారు. అదే వినయం, ముక్కుసూటి తనం, ప్రేమలో మార్పులేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం (డిసెంబర్ 12) 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా, 1970ల ప్రారంభంలో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో రజనీకాంత్‌కి సన్నిహిత మిత్రుడు, అతని క్లాస్‌మేట్ అయిన అశోక్, తన స్నేహితుడు రజనీకి నటన పట్ల ఉన్న స్టైల్, అభిరుచి, అంకితభావాన్ని గుర్తు చేసుకున్నారు.
BTS నుంచి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వరకు..
శివాజీ రావు గైక్వాడ్‌గా జీవితం ప్రారంభించిన రజనీ అప్పటి బెంగుళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (BTS)లో బస్ కండక్టర్‌గా పనిచేస్తూనే నాటికలో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. నటనలో డిప్లొమా చేసేందుకు 1973లో మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు.
రజనీ గతంలో బెంగుళూరులో BTS బస్ నంబర్ 10Aలో కండక్టర్‌గా ఉండేవారు. ఓ రోజు ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన మహాభారతంలోని కురుక్షేత్ర నాటకంలోని దుర్యోధనుడి పాత్రను పోషించాడు. నాటకంలో ఎలాంటి ఉత్సాహం చూపేవారో అలాగే ప్రయాణికులకు టికెట్లు జారీ చేసేవారు. శివాజీని రెగ్యూలర్ గా చూస్తున్న అతని స్నేహితుడు, బస్ డ్రైవర్ పి. రాజ్ బహదూర్ మద్రాస్ లోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరమని బలవంతం చేసేవాడు.
అతని ప్రోత్సాహంతో అడయార్ లో ఫిల్మ్ కోర్స్ చేశాడు. ఆయనలోని నటుడుని ప్రఖ్యాత డైరెక్టర్, నిర్మాత కే. బాలచందర్ గుర్తించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘‘ అపూర్వ రాగంగల్’’ (1975) లో ఓ చిన్న పాత్రను ఆఫర్ చేశాడు. అందులో రజనీకాంత్ పాత్ర పేరు మేజర్ చంద్రకాంత్, ఇది అతని కలర్ కు సూట్ అయ్యే విధంగా ఉంది.
1980 నాటికి, రజనీ తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించి దక్షిణ భారత చిత్రసీమలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోగలిగారు. తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో, రజనీ 170కి పైగా సినిమాల్లో నటించారు ( వేట్టైయాన్ అతని 170వ చిత్రం) సినిమా రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు ” అని ఇన్‌స్టిట్యూట్‌లో రజనీతో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ అతని స్నేహితుడు అశోక్ భావోద్వేగంతో చెప్పారు.
తన స్టైల్, ఆక్టింగ్ లోని వివిధ పద్ధతులపై దృష్టి..
కొన్ని సంవత్సరాల క్రితం, ఈ రచయితతో ఒక సంభాషణ సందర్భంగా, ప్రముఖ చిత్రనిర్మాత రవీంద్రనాథ్ (33 సంవత్సరాల క్రితం, వీరప్పన్ జీవించి ఉన్నప్పుడు అటవీ దొంగ వీరప్పన్‌పై సినిమా తీశాడు) మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో రజనీకి మరో మంచి స్నేహితుడు. “నేడు, రజనీ ఆసియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటులలో ఒకరు. శాశ్వత బ్రాండ్ విలువను కొనసాగిస్తూనే ఉన్నారు ‘సూపర్ స్టార్ రజనీ.
సురేష్ కృష్ణ బెంగళూరులో రజనీ గడిపిన రోజుల సారాంశాన్ని తీసుకొని కె బాలచందర్ కు చెందిన కవితాలయ ప్రొడక్షన్స్ కోసం అన్నమాలి (1992) చిత్రాన్ని రూపొందించారు. ఈ అన్నామలై రజనీని స్టార్ నుంచి సూపర్ స్టార్‌గా మార్చింది. రజనీకాంత్ గురించి, ఆయన స్టైల్ గురించి రవీంద్రనాథ్ ఉద్వేగంగా మాట్లాడారు. “రజనీ నడక శైలి, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ అన్ని ఆయనే స్వయంగా అభివృద్ధి చేసిన ప్రత్యేకమైనవి, అసమానమైనవి ”అని ఆయన చెప్పారు.
సిగరెట్ తిప్పడం
2014లో మరణించిన రవీంద్రనాథ్, కొంతమంది సినిమా జర్నలిస్టులను కలిసినప్పుడల్లా నటన పట్ల రజనీకి ఉన్న నిబద్ధత గురించి గొప్పగా మాట్లాడేవాడు. మేమంతా ఫిల్మ్ కోర్స్ క్లాసులు అయిపోగానే ఆయా పనుల్లో నిమగ్నమయ్యేవాళ్లం. అయితే రజనీ మాత్రం తన శైలికి, ప్రత్యేకతకు పదును పెట్టేవాడు. ఇదే అతడిని అందరిలో ప్రత్యేకంగా నిలిపింది.
ఇన్‌స్టిట్యూట్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేసి సాధించిన రజనీ 'సిగరెట్ ఫ్లిప్పింగ్' సిగ్నేచర్‌ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇతర విద్యార్థులు సహజమైన నటనా పద్ధతులపై దృష్టి పెడుతున్నప్పుడు, శివాజీ దృష్టి శైలీకృత నటనా పద్ధతులపై పడిందని గుర్తుచేసుకునే వారు.
పుట్టన్న కనగల్ ఆశ్రితుడు
“ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకునే రోజుల్లో, శివాజీ తన కుటుంబం, స్నేహితులు పంపే డబ్బుతో జీవించేవాడు. అతని లక్ష్యం ఒకటే.. నటన నైపుణ్యాన్ని నేర్చుకోవడం, స్నేహితులు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం. శివాజీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన కన్నడ నిర్మాత పుట్టన్న కనగల్. పుట్టన్న కథా సంగమం (1976)లో రజనీకాంత్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరినప్పుడు, శివాజీకి ఉండడానికి స్థలం కావాలి. మొదట్లో, అతను అశోక్, నన్ను చేరే వరకు, ఒక మురికి గుంట మూలలో పడుకునేవాడు. రోజుకు కేవలం ఒక పూట భోజనం మాత్రమే చేసేవాడు.
శివాజీని మొదటిసారి కలుసుకోవడం...
గత ఏడాది బీఈఈ కల్చర్ పబ్లికేషన్ ప్రచురించిన తన 122 పేజీల గేలియ శివాజీ (శివాజీ స్నేహితుడు) పుస్తకంలో రజనీతో తనకున్న అనుబంధాన్ని అశోక్ గుర్తు చేసుకున్నారు. నిజానికి, రవీంద్రనాథ్ మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఉన్న రోజుల్లో అశోక్, శివాజీతో కలిసి ఒకే గదిని పంచుకున్నారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించబడిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శివాజీతో తన మొదటి సంఘటనను పంచుకుంటూ .. సినీ నిర్మాత పుట్టన్న కనగల్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. "చివరిగా నేను, రవీంద్రనాథ్, రఘునందన్, చంద్రహాస అల్వా, శివాజీరావు, అమర్ ముల్లా, శశిభూషణ్ ఎంపికయ్యాం." అన్నారు.
కృష్ణన్ మెస్‌లో శివాజీ జీవితం
ఇన్‌స్టిట్యూట్‌లో చదివే సమయంలో అసలు పేరు వేణుగోపాల్‌ అయిన అశోక్‌కి ఆ రోజుల్లో శివాజీ ఆర్థిక పరిస్థితి స్పష్టంగా గుర్తుంది. “రవీంద్రనాథ్, నేను పూనమలై రోడ్‌లోని హోటల్ అరుణ్‌లో ఉండేవాళ్లం. శివాజీ సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని కృష్ణన్ మెస్‌లో బస చేశారు. ఆ సమయంలో అతని ఆస్తులు ఒక గుడ్డ సంచి, ఒక ప్యాంటు, మూడు చొక్కాలు, ఒక కాటన్ లుంగీ, ఒక జత చెప్పులు, నంజనగూడు టూత్ పౌడర్ (తక్కువ ధర కలిగిన పొడి. ).
శివాజీ నివసించే పరిస్థితి చూసి నేను పూర్తిగా కలవరపడ్డాను. హోటల్ అరుణ్‌లో మాతో ఉండమని బలవంతం చేశాం. ఆ సమయంలో శివాజీ దగ్గర డబ్బు లేదు. బెంగుళూరులోని అతని స్నేహితులు అతనికి కాస్త మద్దతుగా నిలిచారు. శివాజీకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి బట్టలు లేవు కాబట్టి, తగిన వేషధారణ వచ్చేంత వరకు డ్యాన్స్ క్లాస్‌కు హాజరు కావద్దని చెప్పారు ” అని అశోక్ చెప్పారు.
కుక్కలు - బిస్కెట్లు
అశోక్ వారి కష్టాలను వివరిస్తూ.. ముఖ్యంగా శివాజీ సరైన తిండి లేక తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. ఈ సందర్భం వివరిస్తున్న సమయంలో అశోక్ గొంతు శృతి తప్పింది. కొన్ని నిమిషాల తరువాత తేరుకున్న ఆయన తరువాత మాట్లాడుతూ.. “మా జేబులు ఖాళీ అయినప్పుడు టీతో పాటు చవకైన బిస్కెట్లు తినేవాళ్ళం. ఒకసారి, నేను, శివాజీ బిస్కెట్లు తింటుంటే, కొన్ని వీధి కుక్కలు ప్రత్యక్షమయ్యాయి. శివాజీ కొన్ని బిస్కెట్లు వాటిపైకి విసిరాడు. మొదటి సెమిస్టర్ తర్వాత, శివాజీ కోర్సును విడిచిపెట్టాలని అనుకున్నాడు. కానీ అతి కష్టం మీద కర్నాటకకు చెందిన మా స్నేహితులు అతన్ని ఉండటానికి ఒప్పించారు’’ అని అశోక్ చెప్పారు.
“ ఇప్పుడు కూడా, నేను అతనికి వేణును మాత్రమే, అతను నాకు ఇప్పటికీ అదే పాత శివాజీ. శివాజీకి స్నేహం అంటే ఇదే. వాడు కొంచెం కూడా మారలేదు. అప్పుడప్పుడు కలిసినప్పుడు ఇప్పటికీ అదే స్నేహం, అదే అనుభూతి ’’ అని అశోక్ అన్నారు.
క్రౌడ్ పుల్లర్ శివాజీ..
“ మొదటి నుంచి, శివాజీకి జనాలను ఆకర్షించే సామర్థ్యం ఉంది. బెంగుళూరులో తన నాటక థియేటర్ రోజుల్లో కూడా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే, పట్టుకోగల ఈ సామర్థ్యం నేటికీ తగ్గలేదు. అతని ఆన్‌స్క్రీన్ చరిష్మా, అసమానమైన శైలి, పంచ్‌లైన్‌లు, 'మ్యాన్ ఆఫ్ ది స్ట్రీట్' లుక్స్, డౌన్-టు ఎర్త్ నిజ జీవిత వ్యక్తిత్వం ప్రేక్షకులను అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. శివాజీ నటించే విధానం నాకు బాగా నచ్చింది’’ అని అశోక్ అన్నారు.
మా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ సంస్థ మొదటి బ్యాచ్‌లో 36 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దురదృష్టవశాత్తు, అందులో చాలా తక్కువమంది మాత్రమే సినీరంగంలో నిలదొక్కుకున్నారు. మా బ్యాచ్ మెట్ అందరి కష్టాలను తీర్చడానికి ఓ సినిమా నిర్మించి లాభాలను అందరికి సమానంగా పంచాడు.
రాజకీయాలు: రాజ్‌కుమార్‌ అడుగుజాడల్లోనే రజనీ..
రాజకీయాలలో రజనీ సందడి దాదాపు 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అనేక రాజకీయ పార్టీలు అతన్ని ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడ్డాయి. చివరగా, రజనీకాంత్ 2017లో తన స్వంత రాజకీయ పార్టీని ప్రారంభించాలనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే దేవుడి నుంచి అందుకున్న స్పష్టమైన హెచ్చరిక అందుకున్న ఆయన రాజకీయ ప్రవేశం విరమించుకున్నారు.
రాజకీయాల నుంచి వైదొలగాలని తన స్నేహితుడి నిర్ణయం గురించి అడిగినప్పుడు, అశోక్ మాట్లాడుతూ, “రజనీ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే, అతను 'రాజకీయ చిహ్నం' అయ్యి ఉండేవాడు. అతను ఆధ్యాత్మిక రాజకీయ నాయకుడు కావచ్చు. కానీ రజనీ మాత్రం రాజకీయాల్లోకి రావడానికి రాజ్‌కుమార్ నిరాకరించారు. అతని మోడల్ మరియు ఐకాన్. అయినప్పటికీ, అతను ఆధ్యాత్మిక గుణంతో రాజకీయాలను శాసించగలడని నేను భావిస్తున్నాను” అని అశోక్ వ్యాఖ్యానించారు.


Read More
Next Story