ప్రభుదేవా 'కరటక దమనక' రివ్యూ
పంచతంత్రంలో మిత్ర భేదం సీరిస్ లో ప్రధాన పాత్రలు కరటక దమనకలు. ఆ పాత్రల స్వభావాలని సమకాలీన ప్రపంచంలోకి తీసుకొచ్చి అదే టైటిల్ తో సినిమా చేయాలనుకోవటం ఇంట్రెస్టింగ్
పంచతంత్రంలో మిత్ర భేదం సీరిస్ లో ప్రధాన పాత్రలు కరటక దమనకలు. అవి చాలా కపటత్వం తో కూడిన నక్కలు. ఆ పాత్రల స్వభావాలని సమకాలీన ప్రపంచంలోకి తీసుకొచ్చి అదే టైటిల్ తో సినిమా చేయాలనుకోవటం ఇంట్రెస్టింగ్ విషయం. ఎందుకంటే పంచతంత్ర కథలలోని ఆ నక్కలు పూర్తిగా చతురత, మోసంతో తో ఎప్పటికప్పుడు మాయోప నిండి ఉంటాయి. అవి చేసే పనులు మంచి డ్రామా క్రియేట్ చేసి ఆసక్తి కలిగిస్తాయి. మరి ఇవే టైటిల్ తో తీసిన ఈ సినిమా ఆ స్దాయిని ఏ మేరకు ప్రతిబింబించింది. కన్నడంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు వారిని ఏ మేరకు ఆకట్టుకుంది. అసలు కథేంటో చూద్దాం.
స్టోరీ లైన్
విరూపాక్ష (శివరాజ్‌కుమార్), బసవరాజు (ప్రభుదేవా) ఇద్దరూ క్లోజ్ ప్రెండ్స్. మోసాలు చేస్తూ, దొరికినప్పుడు జైల్లో కాలక్షేపం చేస్తూంటారు. అలా ఓ సారి జైల్లో ఉన్నప్పుడు అక్కడికి సీఏం చెకింగ్ కోసం వస్తుండటంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జైలర్ (రాక్‌లైన్ వెంకటేష్) జాగ్రత్తపడుతుంటాడు. అదే టైమ్‌లో ఓ ఖైదీ ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తాడు. అయితే తమ మాటలతో బురిడీ కొట్టించి ఆ ఖైదీని విరూపాక్ష, బసవరాజు కాపాడుతారు.
దాంతో ఇంప్రెస్ అయిన ఆ జైలర్ ... విరూపాక్ష, బవసరాజులను జైలర్ ఓ పని కోసం నందికోలూరు అనే ఊరికి పంపిస్తాడు. ఆ ఊరు చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ తాగడానికి నీళ్లు ఉండవు. ఇంకా ఈ రోజుల్లోనూ జనం వాటర్ ట్యాంక్ ల దగ్గర కొట్టుకుంటూంటారు. ఇలా కరువుకాటకాలతో ఇబ్బందిపడలేక ఆ ఊరిలోని జనం సిటీలకు వలస వెళ్లిపోతారు. దాంతో ఆ ఊరిలో చాలా కొద్ది మందే ఉంటారు. దానికి తోడు ఎమ్మెల్యే (రంగాయన రఘు) కూడా ఊరి ప్రజలపై కక్ష గట్టి మంచి నీటి ట్యాంకర్లు కూడా రాకుండా అడ్డుపడుతుంటాడు. మరో ప్రక్క ఆ ఊరిలో జాతర జరిపించాలని ఊరి పెద్ద, జైలర్ తండ్రి రామన్న (తణికెళ్ల భరణి) తాపత్రయపడుతూంటాడు.
ఈ క్రమంలో జైలర్ హీరోలిద్దరు బసవరాజు, విరూపాక్షలను పనిగట్టుకుని మరీ ప్రాంతానికి ఎందుకు పంపించాడు? ఊరి జాతర జరిపించగలిగారా? వలస వెళ్లిన ప్రజలను తిరిగి ఊరికి రప్పించేందుకుఈ ఇద్దరు స్నేహితులు వేసిన ప్లాన్ ఏమిటి? వీళ్లిద్దరిని ప్రేమించిన కుసిమి (ప్రియా ఆనంద్) ., కెంపీని (నిశ్వికా నాయుడు) ఏమయ్యారు. అనే విషయాలు తెలియాలంటే కరటక దమనక(Karataka Damanaka Review) సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ షోలే నుంచి ప్రేరణ పొంది ఈ కథ చేసుకున్నారని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అయితే అందులో ఉన్న గబ్బర్ సింగ్ లాంటి పాత్ర ఇక్కడా లేదు. అలాగే ఈ సినిమాలో చూపించిన పరిస్థితులు ఇప్పుడు లేవు. ఊళ్లో జనం నీళ్ల కోసం బిందెలతో ఈ కాలంలో కొట్టుకుంటున్నారంటే నమ్మబుద్ధి కాదు. అలాగే ఆ ఊళ్లో ఒక్క సెల్ ఫోన్ ఉండదు. ఏ ఆధునిక ,సాంకేతిక పరిజ్ఞానం వాడే జనం ఉండరు. అంతా ఎనభైల్లో ఆగిపోయిన జనంలా ఉంటారు. కరటక, దమనక పాత్రల్లో శివరాజ్‌కుమార్, ప్రభుదేవా అవుట్‌డేటెడ్ స్టోరీని తమ కామెడీ టైమింగ్‌తో నిలబెట్టేందుకు ఎంత కష్టపడినా పెద్దగా ఫలితం లేకపోయింది. స్క్రిప్టులో బలం లేకపోవడంలో వారి కష్టం వృథాగానే మారింది.
ఈ కథను దర్శకుడు యోగిరాజ్ భట్ ఓ మసాలా ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దాలనుకున్నారు. అలాగే ఎమోషన్ ని బాగా దట్టించారు. అయితే సినిమాలో సృజనాత్మక కొరవడింది. చాలా ప్రిడిక్టబుల్ గా కథనం సాగింది. నార్త్ కర్ణాటక ప్లేయర్ లో సినిమాని తీశారు. ప్రభుదేవా, శివరాజ్ కుమార్ మధ్య బలమైన కెమిస్ట్రీ పండించాలని వారి మధ్య సీన్సే రాసుకుంటూ వెళ్లారు. దాంతో కథ ప్రక్కకు వెళ్లిపోయి వారిపైనే సినిమా పూర్తిగా డిపెండ్ అయ్యే సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. విలన్స్ అయినా స్ట్రాంగ్ గా ఉన్నారా అదీ లేదు. హీరోయిన్స్ పాటలకు, హీరోలను పొడగటానికే తమ టైమ్ స్పెండ్ చేశారు. విలన్ రవిశంకర్ ...తమిళ విలన్ లను గుర్తు చేస్తూ అతి చేస్తూంటాడు. ఓవరాల్ గా సినిమా ఏ కోణం నుంచి మెప్పించదు. టెక్నికల్ గానూ సినిమా సోసోగా ఉంది. ప్రభుదేవా డాన్సింగ్ స్కిల్స్ మనని మెప్పిస్తాయి. ఓ పాటలో శివరాజ్‌కుమార్, ప్రభుదేవా డ్యాన్స్ స్టెప్స్ ఆడియెన్స్‌ను అలరిస్తాయి.
చూడచ్చా
ఈ అవుట్‌డేటెడ్ కమర్షియల్ మూవీని ప్రభుదేవా అభిమాలకు నచ్చుతుంది. ఓటిటి లో కాబట్టి సీన్స్ ని ఫార్వర్డ్ చేస్తూ బాగున్న చోట స్టే అయ్యి చూడచ్చు.అంతవరకూ ఓకే
ఎక్కడుంది.
అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది