
మొండి అమ్మాయిలు : 'జిద్ది గర్ల్స్' వెబ్ సిరీస్ రివ్యూ!
ఇంతకీ ఈ సీరిస్ లో కథేంటి, ఓవర్ గా ఉందా, ఓవర్ ది బోర్డు వెళ్ళిందా , వెళ్తే ఏ మేరకు వంటి విషయాలు చూద్దాం.
‘ఓవర్ ది బోర్డ్’అనేది సినిమాలను దాటి వెబ్ సీరిస్ లలోకి ప్రయాణిస్తోంది . రెగ్యులర్ గా కనిపించే దాని కంటే ఇంకాస్త మసాలా దట్టించి వదలటమే ఇలాంటి సీరిస్ ల, సినిమాల పరమార్దం. యూత్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈమధ్య సినిమా వాళ్లు, సీరిస్ లు తీసేవాళ్లు గీత దాటేస్తున్నారు. ఇక సెన్సార్ లేని వెబ్ సీరిస్ లలో అయితే మోడ్రన్ ట్రెండ్ పేరుతో ఓవర్ ది బోర్డ్ వెళ్లటం చాలా సాధారణం అయిపోయింది. సినిమాల్లో అయితే యాక్షన్, హీరోయిజం లాంటి అంశాల్లో ఓవర్ చేస్తున్నారు. సీరిస్ లలో అయితే రిలేషన్స్, కాలేజ్ సీన్స్ లతో ఓవర్ ది బోర్డ్ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సీరిస్ కూడా అలాంటి జాబితాలో చేరేందుకు ప్రయత్నం చేసింది. ఇంతకీ ఈ సీరిస్ లో కథేంటి, ఓవర్ గా ఉందా, ఓవర్ ది బోర్డు వెళ్ళిందా , వెళ్తే ఏ మేరకు వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
ఢిల్లీలోని ఒక రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజ్ మటిల్డా హౌజ్. అందులో చాలా మంది అమ్మాయిలు చదువుతుంటారు. అందులో వాలిక .. దేవిక .. వందన .. త్రిష .. పరూ తబస్సుమ్ అనే ఐదుగురు అమ్మాయిల చుట్టూ కథ జరుగుతూంటుంది. ఒక్కొక్కరిది ఒక్కో తరహా మనస్తత్వం. ఫ్రెషర్స్ అయిన వీరు తమ ఆలోచనలు,కోరికలతో కాలేజీలో అడుగు పెడతారు. అక్కడ రూల్స్ కి వ్యతిరేకంగా ఫోర్న్ చూడటం, లవ్, రొమాన్స్, పబ్ లు అంటూ రెచ్చిపోతారు. అవి తమకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నా లైట్ తీసుకుని ముందుకు వెళ్తూంటారు. అయితే ఓ సారి సెక్స్ ఎడ్యుకేషన్ ఫిల్మ్ ని ఓ స్టూడెంట్ లీడర్ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు అది ఫోర్నోగ్రఫీగా ప్రచారం జరుగుతుంది. దాంతో పెద్ద వివాదం అవుతుంది.
దాంతో కాలేజ్ ప్రిన్సిపాల్ మాళవిక దత్తా (రేవతి) మీడియాకి ఎక్కుతుంది. ఫలితంగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవలసి వస్తుంది. అప్పుడు ఆ కాలేజీ కి ప్రిన్స్ పాల్ గా లతా బక్షి (సిమ్రాన్) వస్తుంది. ఆమె చాలా స్ట్రిక్ట్ . కాలేజ్ లో జరుగుతున్న కొన్ని అల్లరి పనులకు,పిల్లలకు చెక్ చెప్పాలనుకుంటుంది. అందుకోసం లతా బక్షి కొన్ని రూల్స్ పెడుతుంది.ఆ రూల్స్ కు స్టూడెంట్స్ ఎలా స్పందించారు? చివరకి కాలేజీ వదిలి వెళ్లిపోయిన ప్రిన్సిపాల్ మాళవిక తిరిగి వెనక్కి వచ్చిందా, చివరకు ఏమైంది వంటి విషయాలు చుట్టూ ఈ సీరిస్ కథ తిరుగుతుంది.
విశ్లేషణ
కొత్త కథలు కావాలి. అయితే అవి గీత దాటనంతవరకే అనేది ఓటీటీ జనాల, విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం. ఈ సీరిస్ యూత్ ని టార్గెట్ చేస్తూ తీశారు. అమ్మాయిల కథను రెగ్యులర్ గా కాకుండా పాయింటాఫ్ వ్యూ మార్చి కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ క్రమంలో కొంత పాతదనం తెలియకుండానే చొచ్చుకు వచ్చేసింది. అలాగే ఈ సీరిస్ ని చూస్తుంటే ప్రెంచ్ డైరెక్టర్ Teddy Lussi-Modeste తీసిన The Good Teacher అలాగే జర్మనీ ఫిల్మ్ The Teachers Lounge గుర్తుకు వస్తాయి. ఈ రెండు కలగలపి చేసినట్లు అనిపిస్తుంది. అయితే ఇండియన్ వాతావరణానికి తగ్గట్టు చాలా భాగం ఎడాప్ట్ చేసారనే చెప్పాలి.
క్లాస్ రూమ్ డైనమిక్స్, స్టాఫ్ రూమ్ పాలిటిక్స్ ని మిక్స్ చేసి కొత్తగా రాసుకున్నారు. స్టూడెంట్ చేతిలో అవమానపడి బయటకు వెళ్లిన టీచర్ , తన అమాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవటమే వీటన్నిటిలోనూ ప్రధాన పాయింట్. అయితే అంతా బాగానే ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు స్టోరీ నేరేషన్ వీక్ గా ఉండటం,క్యారెక్టర్ బలంగా లేకపోవడం సీరిస్ ని స్ట్రాంగ్ గా ప్రజెంట్ చేయలేకపోయింది. అలాగే కథనం కూడా అంత ఆర్గానిక్ గా లేకపోవడం కూడా సీరిస్ ని అనుకున్న స్థాయిలో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ల లేకపోయింది.
టెక్నికల్ గా
ఇప్పటికే "ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్" వంటి బోల్డ్ వెబ్ సిరీస్‌ను నిర్మించిన ప్రీతిష్ నంది కమ్యూనికేషన్స్ పతాకంపై రంజిత ప్రీతిష్ నంది, ఇషితా ప్రీతిష్ నంది "జిద్దీ గర్ల్స్" ను నిర్మించారు. గతంలో నలుగురు అమ్మాయిల చుట్టూ కథనంతో వచ్చిన సిరీస్‌కు కొనసాగింపుగా, ఇప్పుడు ఐదుగురు అమ్మాయిల కథతో ఈ కొత్త వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సీరిస్ కు టెక్నికల్ గా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. కానీ స్క్రిప్టే వీక్ గా ఉంది.
చూడచ్చా
ఈ సీరిస్ ఎక్కువగా టీచర్, స్టూడెంట్ రిలేషన్ షిప్స్ చుట్టూ తిరుగుతుంది. సరదాగా సాగే పోయే సీన్స్ అయినా అక్కడక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు తగులుతాయి. ఫ్యామిలీలతో చూసేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది పడక్కర్లేదు.
ఎక్కడుంది
అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ దాదాపు 34 నుంచి 43 నిమిషాల నిడివితో ఉంటుంది.