ఏదైనా ఒక సంఘటనో వ్యక్తో ఇంట్రస్టింగ్ గా కనిపించినపుడు దాన్ని కథగా రూపొందించాలనే ఆలోచన రావటం సహజం . అయితే మనం రోజువారి చూస్తున్న ప్రపంచాన్ని, పాత్రలను యాజిటీజ్ దింపాలంటే కాస్తంత ధైర్యం, ఎదటివారిని గిచ్చాలనే చిన్న చిలిపితనం అవసరం. అది కరుణ్ జోహార్ కు ఉంది అని అని ‘కాఫీ విత్ కరణ్’ ద్వారా అర్దమైంది.
బాలీవుడ్ లో నిత్యం జరగే తెరవెనక కథలు నుంచి, దూరదూరంగా ఉండే బంగళాల నుంచి, రాత్రి క్లబ్ పార్టీల్లో వినపడే కబుర్లు తీసుకుని అల్లిన కథ లా ఉంది.
ఈ సీరిస్ ప్రధానంగా రఘు ఖన్నా ( ఇమ్రాన్ హష్మీ) చుట్టూ తిరుగుతుంది. అతను విక్టర్ ఖన్నా (నసీరుద్దీన్ షా) అనే సీనియర్ సక్సెస్ ఫుల్ బాలీవుడ్ నిర్మాత కొడుకు. తమ సంస్దలో ఎన్నో సక్సెస్ లు ఇచ్చిన ఆయన తన వారసుడు రఘు ఖన్నాకు సంస్దను అప్పచెప్పేస్తాడు. అయితే రఘు ఖన్నా ట్రెండ్ పేరుతో పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నాడని ఆయనలో అసంతృప్తి. ఈ విషయంలో మాటల యుద్దం జరుగుతూంటుంది. మరో ప్రక్క ఆ సంస్ద నుంచి వచ్చిన ఓ సినిమాని మహిక (మహిమ) విమర్శిస్తుంది. ఆమె ఓ టీవీ ఛానల్ లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. ఆమె ఆ విమర్శ చేయటం గిట్టని రఘు ఖన్నా ఆమెను తన పరపతి ఉపయోగించి జాబ్ లోంచి తీయించేస్తాడు. ఈ విషయం విక్టర్ ఖన్నా కు తెలుస్తుంది. దాంతో ఆయన ఆమెను ఇంటికి పిలిపించి మాట్లాడతాడు. ఆ తర్వాత తన స్టూడియోపై సర్వ హక్కులు ఆమెకు రాసి సూసైడ్ చేసుకుంటాడు. అప్పుడు రివీల్ అవుతుంది. ఆమె మరెవరో కాదు ఆయన మనవరాలు అని..రెండో భార్యకు చెందిన సంతతి అని. ఈ విషయం తన తల్లిని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటుంది మహిక. ఇదంతా రఘు ఖన్నాని తీవ్రమైన సంక్షోభంలో పడేస్తుంది. తను కాకుండా విక్టర్ ఖన్నా రెండో బార్య ఫ్యామిలీ వారు వారసులు అవటాన్ని సహించలేకపోతాడు. అక్కడ నుంచి రఘు ఖన్నా తన విశ్వరూపం చూపెడతాడు. కొత్త ప్రాజెక్టులు ఏమీ ముందుకు వెళ్లనివ్వడు. అయితే ఇవేమీ లెక్క చేయకుండా మహిక ...తమ సంస్థలో ఈగో ప్రొబ్లెమ్స్ కారణంగా ఆగిపోయిన '1857' సినిమాను తిరిగి పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు మొదలెడతుంది. అప్పుడు రఘు ఖన్నా ఏం చేసాడు. మొదటి బార్య కొడుక్కి, రెండో బార్య మనమరాలుకు మధ్య జరిగే ప్యామిలీ వార్ ఈ సీరిస్ . ఈ మధ్యలో చాలా క్యారక్టర్స్ వచ్చి వెళ్తూంటాయి. శ్రియా శరణ ఓ కీలకమైన పాత్రలో కనిపించింది.
ఇది ఓ టీవీ సీరియల్ కథలా అనిపిస్తుంది.అయితే కరణ్ జోహార్ వంటి పెద్ద నిర్మాతలు తీయటం, ఫామ్ లో ఉన్న ఆర్టిస్ట్ లు నటించటంతో ఓ లుక్ వచ్చింది. ఈ సీరిస్ పూర్తిగా పొటిన్షియల్ ని కోల్పోయిందని చెప్పలేం కానీ కొత్తగా అనిపించదు. ఇండస్ట్రీలో ఉండే ఓ లీడింగ్ కుటుంబం గురించిన కథ చెప్తుంది. ఆ కుటుంబంలో ఉండే లొసుగులు, సంభందాలు, ఆస్దులు కోసం పోరాటాలు, ఇగో క్లాషెష్ ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. సెక్స్ ..స్కాండిల్స్ కామనే. కొన్ని రియల్ లైఫ్ పాత్రలను తెలివిగా చొప్పించే ప్రయత్నం చేసారు. అయితే ఎక్కువ లోతుగా వెళ్లలేదు. బాలీవుడ్ రియల్ లైఫ్ స్టోరీలను రెగ్యులర్ గా ఫాలో అయ్యివారికి ఈ షో టైమ్ ఆల్రెడీ చూసిసినట్లే అనిపిస్తుంది. పాపులర్ అయ్యిన కొన్ని స్టోరీ లను కలిపి అందించారని అర్దమవుతుంది. ఇది హింది ఫిల్మ్ ఇండస్ట్రీ పై తీసిన కథ. ఏది నిజం, ఏది కల్పితం అనేది ప్రేక్షకుడు ఊహకు వదిలేస్తూ సీన్స్ వస్తూంటాయి. సాధారణ వ్యూయర్ కు ఈ సినిమా కాస్మోపాలిటన్ ప్లాంటేషన్ లైఫ్‌స్టయిల్‌తో పాటు, అక్కడ వాళ్ళ జీవితాల్ని సైతం అంతే కరుగ్గా పరిచయం చేస్తాయి. పట్టుమని పది పాత్రలు కూడా లేవు కానీ అవి ఖచ్చితంగా మనకన్నా బాలీవుడ్ జనాలను బాగా కలవరపాటుకి గురి చేస్తాయి. కథలోని పాత్రలనే కాక, వాతావరణం కూడా యాజటీజ్ ప్రెజెంట్ చేయటం కలిసొచ్చింది.
ఏదైమైనా గొంగళీలో అన్నం తింటూ వెంట్రుకలు ఏరకూడదు అంటారు. అయితే బాలీవుడ్ ఆ మాటలు విననట్లు ఉంది. తన మీద తనే నెగిటివ్ క్యాంపైన్ చేసుకుంటోంది అనిపిస్తుంది ఈ సీరిస్ చూస్తూంటే. అసలే సినిమా పరిశ్రమపై మనకు ఉన్న అభిప్రాయాలు అంతంత మాత్రం. వాటిని కండీషనింగ్ చేయటానికి అన్నట్లు బాలీవుడ్ అంటే పెద్ద చెత్త ప్రపంచం అని ఎస్టాబ్లిష్ చేస్తూంటారు. పైకి కనపించే తళుకులు వెనకాల నల్లటినలుపు ఉందనే చెప్పకనే చెప్తూంటారు. తాజాగా ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో వచ్చిన షో టైమ్ సీరిస్ కూడా అదే పని చేయాటనికి పూనుకుంది. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరిస్ హిందీ ఇండస్ట్రీలోని జీవితం, అక్కడ రాజకీయాలు చుట్టూ తిరిగే ఓ ప్రెడిక్టబుల్ స్టోరీ.
4 నాలుగు ఎపిసోడ్స్ ద్వారా బాలీవుడ్ ని ఆవిష్కరించగలిగారా లేదా అనేది ప్రక్కన పెడితే...నసీరుద్దీన్ షా క్యారక్టర్ కోసం ఈ సీరిస్ చూడచ్చు ఇమ్రాన్ హష్మీ .. రాజీవ్ .. మౌనీ రాయ్ .. మహిమ చాలా బాగా చేసారు. ఈ ఎపిసోడ్స్ లో శ్రియ కు దక్కింది తక్కువే. వివేక్ షా ఫొటోగ్రఫీ .. ఆనంద్ నేపథ్య సంగీతం సీరిస్ కు తగినట్టుగానే అనిపిస్తాయి. మిగతా ఎపిసోడ్స్ జూన్ నుంచి స్ట్రీమింగ్ అవుతాయని చెప్పారు. కాబట్టి నచ్చితే మిగతా ఎపిసోడ్స్ కోసం జూన్ దాకా వెయిట్ చేయాలి. కరణ్ జోహార్ - అపూర్వ మెహతా నిర్మించిన ఈ సిరీస్ కీ, మిహిర్ దేశాయ్ - అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు.
చూడచ్చా
సినిమా పరిశ్రమ ని పై నుంచే కాకుండా లోపల నుంచి కూడా ఓ లుక్కేద్దామనుకుంటే మంచి ఆప్షన్.
ఎక్కడ స్ట్రీమింగ్
'హాట్ స్టార్'లో (తెలుగు ఆడియోతో ఉంది)