అమరన్  తెలుగులో  500% రికవరీ, అసలు ఎంతకు కొన్నారు, ఎంత వచ్చింది? !
x

'అమరన్' తెలుగులో 500% రికవరీ, అసలు ఎంతకు కొన్నారు, ఎంత వచ్చింది? !

శివ కార్తికేయన్(Sivakarthikeyan), సాయి పల్లవి(Sai Pallavi) కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘అమరన్’ (Amaran).

శివ కార్తికేయన్(Sivakarthikeyan), సాయి పల్లవి(Sai Pallavi) కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘అమరన్’ (Amaran). ఈ సినిమాకు ముందు ఇక్కడ శివకార్తికేయన్ సినిమాలు ఏమీ ఆడిన దాఖలాలు లేవు. అలాగే ఈ చిత్రం కూడా దేశభక్తి ప్రధాన మైన సినిమా కావడంతో తెలుగులో ఆడుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే చిత్రంగా అమరన్ ని డబ్బింగ్ సినిమాలా కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా దీనిని బాగా ఓన్ చేసుకున్నారు. సెకండ్ వీకెండ్ లో మల్టిప్లెక్స్ లలో ఎక్కువ చోట్ల హౌస్ ఫుల్ పడ్డాయి. ఈ క్రమంలో తెలుగు వెర్షన్ ఎంత పెట్టి కొన్నారు. అసలు ఎంత రికవరీ అయ్యింది అనే విషయాలు చూద్దాం.

ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకుడు. 2014లో వీరమరణం పొందిన గొప్ప సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని దర్శకుడు ‘అమరన్’ని రూపొందించాడు. ఈ చిత్రం మొదటి వారం తెలుగు స్ట్రెయిట్ సినిమాతో కిరణ్ అబ్బవరం KAతోనూ, రెండవ వారం వరుణ్ తేజ మట్కా తోనూ, సూర్య నటించిన కంగువా సినిమాతోనూ పోటీ పడింది. అయితే కంగువా, మట్కా రెండు సినిమాలు టాక్ సరిగ్గా లేకపోవడం కలిసొచ్చింది. ఈ సినిమాకు వచ్చిన బజ్ తో సెకండ్ వీకెండ్ సైతం సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రైట్స్ కేవలం ₹4 కోట్ల కే తీసుకున్నారు. అంటే బ్రేక్ ఈవెన్ ₹8 కోట్లుగా ఫిక్స్ అయ్యింది. అయితే ఊహించని విధంగా ఈ సినిమా 500% పెట్టిన పెట్టుబడి రాబడి తెచ్చి పెట్టింది. ₹40 కోట్ల గ్రాస్ దాకా ఈ సినిమా తీసుకు వచ్చినట్లు సమాచారం. ట్రేడ్ విశ్లేషకులు అంచనా ప్రకారం ఈ సినిమా ₹50 కోట్లు దాకా వెళ్ళింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా కొన్నవారికి లాభాలు తెచ్చిపెట్టింది.

వాస్తవానికి నిజ జీవిత కథలను తెరకెక్కించడం చాలా కష్టం. అందులో డ్రామా తక్కువ ఉంటుంది. చెప్పడానికి చాలా ఉంటుంది. ఏది వదిలేయాలి, ఎక్కడ ఎమోషన్ వస్తుందో చూసుకుని ముందుకు వెళ్లాలనేది స్క్రిప్ట్ నుంచి పెద్ద టాస్క్, ఏ మాత్రం తేడా వచ్చినా, కల్పన ఎక్కువైనా విమర్శలు వస్తాయి. 2014లో కాశ్మీర్ లో ఓ స్పెషల్ ఆపరేషన్ లో వీరమరణం పొంది, భారతదేశపు అత్యున్నత పురస్కారమైన అశోక చక్రతో గౌరవించబడ్డ గొప్ప సైనికుడు తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తమిళంలో తెరకెక్కిన చిత్రం “అమరన్” (Amaran).

వాస్తవానికి ఈ సినిమా కథగా చూస్తే చాలా ఫ్లాట్ గా ఉంటుంది. కానీ తెరపై దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా నేరేట్ చేశాడు దర్శకుడు. తెలుగులో ఇదే తరహా కథ,కథనంతో అడవి శేషు ప్రధాన పాత్రలో “మేజర్” సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ “అమరన్” కూడా అలాగే మొదలవుతుంది. కానీ డిఫరెంట్ పాయింటాఫ్ వ్యూతో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. వాస్తవాలను, దేశభక్తిని తగు మోతాదులో ఉంది,సినిమాటెక్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి సినిమా చేశారు.

అలాగే చేస్తారని ప్రేక్షకులు ఊహించి వస్తారు కాబట్టి అక్కడ దాకా ఏ సమస్యా రాలేదు. అయితే దేశభక్తి అనేది సినిమాల్లో పెద్దగా వర్కవుట్ కాని టైమ్ ఇది. దాంతో ఈ స్క్రిప్టు ని 365 కోణంలో చూసుకుని, సాయి పల్లవి నటనను బేస్ చేసుకుని ముందుకు వెళ్లారు. అలాగే క్లైమాక్స్ అంటే చివరకి ఏం జరుగుతుందో చూసేవారికి పూర్తిగా తెలిసే ఉంటుంది. అలాగని స్వెచ్చ తీసుకుని కొత్త ట్విస్ట్ లు, టర్న్ లు కలపలేరు. కలపకూడదు అని ఫిక్సై చేసారు. అయితే ఎమోషన్ తో ఆ భాగాన్ని గెలిచారు డైరెక్టర్.

చిత్రం కథేంటి

ఇది హీరోయిన్ పాయింటాఫ్ వ్యూలో అంటే రెబెక్కా వర్గీస్ (సాయి పల్లవి) పాయింటాఫ్ వ్యూలో నడిచే కథ. ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) జన్మించిన ఏడు నెలలకి పుట్టిన ఆమె.. అతడితో ఏడడుగులు వేసి, అతడి అమరుడు అయ్యాక కూడా ఏడు జన్మలకు నువ్వే నా ప్రాణం అని నడిచిన ఓ మహిళ కథనం. చెన్నైకు చెందిన ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) కాలేజీలో ఇందు రెబెక్కా వర్గీస్ (సాయి పల్లవి) తో పరిచయం ,ఆ తర్వాత ప్రేమతో మొదలవుతుంది. ముకుంద్ ఆర్మీలో చేరడంతో ఇందు తండ్రికి ఇష్టం ఉండదు. మరో ప్రక్క మతాలు వేరు అవటం కూడా వారి పెళ్లికి అడ్డంగా మారింది.

ఇటు ముకుంద్ తల్లి కూడా ఆ పెళ్లికి ఒప్పుకోదు. కానీ మెల్లిగా కుటుంబాన్ని ఒప్పిస్తాడు. ఆ తర్వాత ఆర్మీలో చేరి ఎదుగుతాడు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా కాశ్మీర్ లోయలోని తీవ్రవాదులపై విరుచుకుపడతాడు. ఆ క్రమంలోనే అతను ప్రాణాలు పోగొట్టుకుంటాడు? అయితే ఈ జర్నీలో ఇందు పాత్ర ఏమిటి? ఆమెకు ముకుంద్ ఏం ప్రామిస్ చేసాడు? వాళ్లిద్దరి బంధం ఎలా ఇప్పటికీ సజీవంగా ఉంది? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.

Read More
Next Story