లగ్జరీ కార్లు స్మగ్లింగ్: దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లపై ఈడీ దాడులు
x
దుల్కర్ సల్మాన్

లగ్జరీ కార్లు స్మగ్లింగ్: దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లపై ఈడీ దాడులు

భూటాన్ నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుని కేరళలో నమోదు చేసి విక్రయం


లగ్జరీ కార్ల స్మగ్లింగ్ నెట్ వర్క్ పై దర్యాప్తులో భాగంగా ‘‘ఆపరేషన్ నమ్ ఖోర్’’ పలు ప్రభుత్వ విభాగాల అధికారుల బృందం చేపట్టింది. ఈ చర్యలలో భాగంగా కస్టమ్స్ అధికారులు ప్రముఖ మలయాళ సినీ తారలైన దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ సహ అనేకమంది సినీతారల ఇళ్లలో అధికారుల సోదాలు నిర్వహించారు.

దిగుమతి సుంకాలను తప్పించుకోవడానికి భూటాన్ నుంచి అక్రమంగా రవాణా చేయబడిన ఖరీదైన వాహనాలపై దర్యాప్తు దృష్టి సారించింది. ఈ కార్లను కేరళలో నకిలీ పత్రాలను ఉపయోగించి చట్టవిరుద్ధంగా తిరిగి నమోదు చేసి, హై ప్రొఫైల్ కొనుగోలుదారుకు విక్రయించారని అధికారులు అనుమానిస్తున్నారు.
దుల్కర్ కార్ల స్వాధీనం..
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 ప్రదేశాలలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కొచ్చి, తేవార, తిరువనంతపురంలోని నటుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు.
కొనసాగుతున్న సోదాల ఫలితంగా ఇప్పటి వరకూ నటుడు దుల్కర్ సల్మాన్ కు చెందిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కేరళ హైకోర్టు దుల్కర్ ను కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం.. అడ్డుడికేటింగ్ అథారిటీ నుంచి తన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ను తాత్కాలికంగా విడుదల చేయాలని ఆదేశించింది. ఆపరేషన్ నమ్ ఖోర్ సమయంలో కస్టమ్స్ అధికారులు ఈ వాహానాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మనీలాండరింగ్ కోణం..
ఈ కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేయడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. నటుడు పృథ్వీరాజ్ అమిత్ చక్కలక్కల్ ఇళ్లలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. దుల్కర్ సల్మాన్ చెన్నై నివాసంపై కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Read More
Next Story