శ్రీలీల కెరీర్‌కి డేంజర్ అలర్ట్?
x

శ్రీలీల కెరీర్‌కి డేంజర్ అలర్ట్?

ఇలా కొనసాగితే ప్రమాదం


చాలా తక్కువ టైంలో టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన హీరోయిన్ శ్రీలీల. ఎనర్జిటిక్ డాన్స్, గ్లామర్‌ — ఈ రెండు అసెట్‌లతో పాపులర్ అయ్యింది. కానీ ఇప్పుడు అవే ప్లస్ పాయింట్లు ఆమెకి రిస్క్‌గా మారుతున్నాయన్న మాట. ఆడియెన్స్ నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి — “గ్లామర్, పాటల వరకే పరిమితం… యాక్టింగ్‌ ఎక్కడ?” అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

వాస్తవానికి తెలుగు పరిశ్రమలో శ్రీలీల అడుగుపెట్టినరోజు నుంచే ఒక విషయం స్పష్టమైంది ...స్క్రీన్ ఎనర్జీ, గ్లామర్, డాన్స్. ఈ మూడు ఆమె బ్రాండ్‌గా మారాయి. కానీ స్టార్‌డమ్‌కి మాత్రమే ఇవి సఫీషియంట్ కాదు. స్టేన్‌బుల్ స్టార్డమ్ కి కావాల్సింది రేంజ్, కారెక్టర్ డెప్త్, క్రియేటివ్ రిస్క్ . దాంతో శ్రీలీలా పబ్లిక్ ఇమేజ్ "గ్లామర్ ప్యాకేజీ" వరకే కట్టుబడుతోంది.

స్క్రిప్ట్ సెలక్షన్‌పై ఘాటు కామెంట్లు

ఈ ఏడాదిలో శ్రీలీల మూడు సినిమాలు చేసింది — రాబిన్‌హుడ్, జూనియర్, మాస్ జాతర. మూడు సినిమాల్లో కూడా ఆమెకు పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ఒక్క సీన్ కూడా లేదని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. పాటలు, డ్యాన్స్, క్యూట్ లుక్స్‌… అంతే. పాత్రలో లోతు? భావోద్వేగాలు? డైలాగ్ ఇంపాక్ట్? — సేమ్ రిపీట్ ఫార్ములా. “శ్రీలీలా అంటే పాటలు – అంతే” అన్న బ్లైండ్ ఇమేజ్ ఇప్పుడు ప్రమాదకరంగా మారుతోంది.

ఆమె ఇటీవల చేసిన ‘రాబిన్‌హుడ్’, ‘జూనియర్’, ‘మాస్ జాతర’ మూడు సినిమాల్లోనూ ఒకే నేరేటివ్ ప్యాటర్న్ కనిపించింది — పాట, గ్లామర్‌ షాట్స్, కామెడీ ప్లేస్‌మెంట్, డ్యాన్స్ హైలైట్స్, కానీ పెర్ఫార్మెన్స్‌కు స్కోప్?- నిజం చెప్పాలంటే లేదు. స్క్రిప్ట్ నిర్ణయాల్లో ఆమె కమర్షియల్ టూల్ స్థాయికి తగ్గిపోతోంది. ఇది అండర్‌యుటిలైజేషన్ మాత్రమే కాదు — టైప్‌కాస్టింగ్ అలారం.

పాత టాలీవుడ్‌లో ఇది చాలు. కానీ ఇప్పటి ఆడియెన్స్ వాస్తవం వేరే:

పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నారు

యాక్టింగ్ ప్రూవ్ చేసే పాత్రలు కావాలి

ఎమోషనల్ స్టేక్స్ డిమాండ్ చేస్తున్నారు

డైరెక్టర్లు కూడా ఫాలో అవుతున్న షార్ట్‌కట్?

డైరెక్టర్లు కూడా శ్రీలీలా క్యారెక్టరైజేషన్ ని కేవలం ఎంటర్టైన్‌మెంట్‌కు మాత్రమే సెట్ చేస్తున్నారని రీమార్క్స్. స్టోరీకి ఏం యాడ్ అవ్వడం లేదు… స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా పర్పస్ లేదు. కమర్షియల్ పాయింట్ నుంచే చూసినా — ఎంటర్టైన్‌మెంట్ సీన్స్ కూడా అసలు వర్కౌట్ కావడం లేదు.

సాయి పల్లవి లైన్ ఎందుకు ఫాలో కావడం లేదు?

ఆడియెన్స్ కంపారిజన్ కూడా స్టార్ట్ చేశారు — “సాయి పల్లవి కూడా డ్యాన్స్‌కే ఫేమస్… కానీ పాత్రలతో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. శ్రీలీలా మాత్రం డ్యాన్స్‌కే స్టక్ అయిపోయింది” అంటూ నెటిజన్లు అంటున్నారు.

ఆడియెన్స్, క్రిటిక్స్ ఇప్పటికే శ్రీలీలాని కేవలం మ్యూజిక్ కలెక్టర్ల స్టెప్ క్వీన్ గా చూసే ప్రమాదం ఉంది. ఇక్కడే ఖచ్చితంగా దిశ మార్చుకోవాలి —

ఇంకా మూడు ఇలాంటి సినిమాలు చేస్తే ఇమేజ్ క్లీన్‌గా ఒకే లేయర్ అయిపోతుంది.ఇది కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు ఆమెను టాప్ స్టార్ చేస్తాయి… లేదా గ్లామర్ ట్యాగ్‌లో లాక్ చేస్తాయి.

ఇప్పటికీ శ్రీలీల గ్లామర్ కంపోర్ట్ జోన్‌లోనే పోతుందా? లేక ట్రైనింగ్ తీసుకుని, డెప్త్ ఉన్న రోల్స్ ఎంచుకుంటుందా?

శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా ఉంది. అలానే తెలుగులో అక్కినేని అఖిల్ సరసన 'లెనిన్' అనే మూవీ కూడా చేస్తోంది.

Read More
Next Story