
'ఉయ్యాలా జంపాలా' హీరోయిన్ అవికా గోర్ పెళ్లి ఎలా జరిగిందంటే.
‘బాలిక నుంచి వధువు వరకూ..’ అవికా గోర్ పెళ్లి ఫోటోలు
‘చిన్నారి పెళ్లికూతురు’ నిజంగానే పెళ్లి కూతురయ్యారు. నిజ జీవితంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. విశేష గుర్తింపుపొందిన నటి అవికా గోర్ (Avika Gor) పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఉయ్యాలా జంపాలా హీరోయిన్ గా తెలుగులో పెద్ద హిట్ సాధించిన అవికా గోర్ తన ప్రియుడు మిళింద్ చద్వానీని పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబర్ 30న తన ప్రియుడు మిళింద్ చద్వానీని వివాహమాడారు.
‘బాలిక నుంచి వధువు వరకూ..’ అనే క్యాప్షన్‌తో అవికా కొన్ని పిక్స్ షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి (Avika Gor Wedding Photos). అభిమానులు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అవికా గోర్ బాలీవుడ్ టీవీ సీరియల్ నటి. బాలికా వధువులో “ఆనంది” పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఉయ్యాలా జంపాలా (2013) సినిమాలో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. తరువాత కేరింత, క్రష్ లాంటి సినిమాల్లో నటించారు.
మిళింద్ చద్వానీ టెలివిజన్ షోలు Splitsvilla (MTV), Roadies ద్వారా పాపులర్ అయ్యారు. అలాగే కొన్ని హిందీ సీరియల్స్, రియాలిటీ షోలలో పాల్గొన్నారు. ఆయన సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త. క్యాంప్ డైరీస్ పేరిట ఓ ఎన్జీవోను నెలకొల్పారు. అంతకుముందు ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. 2019లో ఓ టీవీలో ప్రసారమైన ‘రోడీస్ రియల్ హీరోస్’ షోతో బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కొన్నాళ్లక్రితం మిళింద్, అవికా మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత స్నేహితులయ్యారు.
వీరి ప్రేమ, సంబంధం గురించి ఇద్దరూ సోషల్ మీడియాలో బహిరంగంగానే పంచుకున్నారు. 2020 తర్వాత వారు తరచూ కలసి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వచ్చారు. పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
‘ఉయ్యాలా జంపాలా’తో హీరోయిన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన అవికా తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. తర్వాత, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’ తదితర చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఆమె లేటెస్ట్ మూవీ ‘షణ్ముఖ’ ఈ ఏడాది మార్చిలో విడుదలైంది.
ఈ వివాహం వారి షో Pati, Patni Aur Panga సెట్స్‌లో జరిగినదిగా ప్రకటించారు. వారి ప్రేమకథ 2020లో హైదరాబాద్ నుంచి మొదలైంది.
Avika ఇన్‌స్టాగ్రామ్‌లో “easiest yes of my life” అని తన ఫియాన్స్ చేసిన ప్రపోజల్‌ను గురించి తన భావాలను పంచుకున్నారు. వివాహం సందర్భంగా హల్దీ, మెహెందీ వంటి సంప్రదాయ కార్యక్రమాలు షో సెట్స్‌లో జరిగినట్లు వార్తలు వచ్చాయి. “joota chupai” పేరుతో ఒక వినోదాత్మక కార్యక్రమం కూడా జరిగింది, ఇందులో హినా ఖాన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
వివాహానికి ముందు Avika & Milind ముంబైలోని Siddhi vinayak ఆలయాన్ని దర్శించుకున్నారు, ఆశీర్వాదాలు తీసుకున్నారు.
Next Story