
‘శుభం’ కథ కంటే నిర్మాతగా సమంత కథే ఇంట్రెస్టింగ్?
కథ పరంగా జస్ట్ ఓకే, మార్కెట్ పరంగా బిజినెస్ స్మార్ట్‌నెస్ చూపించిన ప్రాజెక్ట్ ఇది
తెలుగు సినిమా పరిశ్రమలో "స్టార్ పవర్" అనేది పెద్ద రిసోర్స్. కానీ ఒక స్టార్ హీరోయిన్ నిర్మాతగా మారి, స్టార్ హంగుల్లేని చిన్న కథను తీసుకుని, దాన్ని మార్కెటింగ్ విజయంగా మార్చడానికి ఉపకరిస్తుందా? సమంత రూత్ ప్రభు ఈ విషయంలో న్యూ ఏజ్ నిర్మాతలకు ఓ బెంచ్ మార్క్‌గా మారబోతోందా. ఆమె తొలి నిర్మాణం ‘శుభం’, కథ పరంగా జస్ట్ ఓకే అయితే, మార్కెట్ పరంగా బిజినెస్ స్మార్ట్‌నెస్ చూపించిన ప్రాజెక్ట్ ఇది.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) తొలిసారి నిర్మాతగా మారి ప్రొడ్యూస్ చేసిన సినిమా 'శుభం' (Subham). శుక్రవారం ఇది విడుదలైంది. దీనితో పాటే శ్రీవిష్ణు (Srivishnu) '#సింగిల్' (#Single) తో పాటు మరో ఆరేడు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఈ మొత్తం చిత్రాలలో శ్రీవిష్ణు '#సింగిల్', సమంత 'శుభం' చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ బరిలో గట్టెక్కబోతున్నాయి. అయితే చెప్పుకోదగ్గ కలెక్షన్స్ లేకుండా శుభం సినిమా ఎలా బయిటపడబోతోంది?
రివ్యూలు యావరేజ్, కలెక్షన్స్ సోసో ..అయినా
బాక్సాఫీసు దగ్గర యావరేజ్ మార్కులు తెచ్చుకొంది ‘శుభం’. రివ్యూలు కూడా ‘ఓకే ఓకే సినిమా’ అన్నాయి. దర్శకుడు ఇంకాస్త ఎఫెక్ట్ పెట్టాల్సిందని తేల్చేశాయి. మొత్తానికి సమంతకు ఇది మిశ్రమ అనుభవం. కాకపోతే నిర్మాతగా సంతృప్తి దొరకాలంటే ఆర్థిక పరమైన లెక్కలు తేలాలి.
ఈ సినిమా ఆర్థిక పరంగా సేఫ్ జోన్‌లో పడిపోయిందన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. జీ తెలుగు సంస్థ ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది. ఆ రూపేణా ఈ సినిమా తన పెట్టుబడిని, కొద్దో గొప్పో లాభాన్ని కలిపి రాబట్టుకోగలిగింది. అలా చూస్తే సమంత తొలి అడుగులోనే విజయం సాధించినట్టు. అసలు గేమ్ సినిమా కంటెంట్‌లో కాదు. ప్యాకేజింగ్‌లో ఉంది.
“ప్రస్తుతం సంప్రదాయమైన సినిమా మార్కెటింగ్ వల్ల పెద్దగా కలిసి రావటం లేదు – స్టోరీ బేస్డ్ బ్రాండింగ్ స్ట్రాటజీ లకు ఆదరణ పెరుగుతోంది. వాటిని ఎంత తెలివిగా తమ కథలో ఇమిడ్చి మార్కెటింగ్ చేస్తారనే దగ్గరే సగం విజయం”
— కోమల్ మకిజా, ఇండస్ట్రీ బ్రాండింగ్ కన్సల్టెంట్
జీ తెలుగు బ్రాండింగ్ టై-ఇన్ – మార్కెటింగ్
ఓటీటీ, శాటిలైట్ హక్కులు అమ్ముడుపోవడం కూడా ఈరోజుల్లో చిన్న విషయమేమీ కాదు. మీడియం రేంజ్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీ బేరాల్లేక బోరుమంటున్నాయి. ఇలాంటి దశలో సమంత తన సినిమాని విడుదలకు ముందే అమ్మేసింది. సమంతకు ఉన్న ఇమేజ్ అందుకు ప్లస్ అయ్యింది.
సమంత సినిమాను మొదలు పెట్టే దశలోనే జీ తెలుగు ఛానెల్‌ను సంప్రదించిందని తెలుస్తోంది. ఎందుకంటే ఓ ఛానల్ లో వచ్చే సీరియల్ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఆ ఛానెల్ తమదే అయితే ...సినిమా ఎలా ఉన్నా ఛానల్ బ్రాండింగ్ పెరుగుతుంది. అందుకే జీ తెలుగుని ముందుగా సంప్రదించి, బ్రాండింగ్ మాట్లాడుకొని, అప్పుడు సినిమా మొదలెట్టారు. అది ఓ రకంగా మంచి ఆలోచన. బ్రాండింగ్ కి కమిట్ అయిన జీ తెలుగు.. ఆ తరవాత శాటిలైట్, ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది.
ఇది "కథ - కమర్షియల్ - కమ్యూనికేషన్" అన్న మూడు స్తంభాల మీద నిలబడిన వ్యూహం.
“ఈ రోజుల్లో సినిమా రిలీజ్ తర్వాత ఓటీటీకి వెళ్లడం వేరు. కానీ కథను చెప్పి, అందులో విషయాలను హైలెట్ చేసి ఓటీటీ హక్కులు ముందుగానే అమ్మడం – అది ట్రస్ట్ మీద కాదు, పక్కా ప్లానింగ్ మీద జరగాలి.”
— అరుణ్ రావు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ అనలిస్ట్,ముంబై
మీడియం సినిమాలకు ఇది ఓ లెసన్
తెలుగు సినిమా మార్కెట్‌లో ప్రస్తుతం మిడ్ బడ్జెట్ ఫిలింలు ఎక్కువగా రూపొందుతున్నాయి. థియేటర్ల బిజినెస్ కన్నా ఎక్కువగా OTT, శాటిలైట్ మీద వచ్చే ఆదాయం మీద ఇవి ఆధారపడుతున్నాయి. ఇలాంటి వాళ్లు శుభం మార్కెటింగ్ స్ట్రాటజీ ని పరిశీలించవచ్చు.
సమంత తన స్టార్డమ్‌ను వాడుకుని, బ్రాండెడ్ కంటెంట్ డీల్స్ తో తన సినిమాను వెంటనే లాభాల్లోకి తీసుకెళ్లింది. ఇది నిర్మాతలకు ఒక wake-up call. మాస్ యాక్షన్ మూవీ చేయలేకపోయినా – సరిగ్గా మార్కెట్ చేయగలిగితే, లాభాలు సాధ్యమే అని చెప్పినట్లు అయ్యింది.
కంటెంట్ క్వాలిటీ సరిపోదు
వాస్తవానికి ‘శుభం’ లో కంటెంట్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఏదో ఓ షార్ట్ ఫిల్మ్ ని చూస్తున్నట్లు, ఓటిటి కోసం తీసిన సినిమాని తెరపై చూస్తున్న ఫీల్ వచ్చింది. ప్రేక్షకుడికి పూర్తిగా కనెక్ట్ కాలేకపోయింది.
స్ట్రాటజీతో సినిమా హక్కులు అమ్మేయడం వేరు – కానీ దీని ద్వారా వచ్చే నమ్మకం నిలబడాలంటే, కంటెంట్ క్వాలిటీ పెరగాలి. సమంత వ్యాపారపరంగా విజయం సాధించింది, కానీ బ్యానర్ కి long-term trust నిర్మించాలంటే – ఈ కథల్లో authentic touch ఉండాలి అనేది నిజం.
విశేషం ఏమంటే 'శుభం' ప్రీమియర్స్ కు కూడా మంచి స్పందన లభించిందని, అలానే మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ బాగున్నాయని, రోజు రోజుకూ ఇవి పెరుగుతున్నాయని సమంత చెప్తోంది. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో రాబోయే రోజుల్లో మరింత చక్కని స్పందన తమ చిత్రానికి వస్తుందని సమంత ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
నిర్మాణ పరంగా ఇది ఒక “కేస్ స్టడీ”
ఇక సమంత నిర్మాతగా మారుతున్నట్టు తెలియగానే చాలా మంది నిరుత్సాహపర్చారు. ప్రస్తుతం చిన్న సినిమాలకు ఆదరణ లభించడం లేదని, లేనిపోని రిస్క్ ఎందుకనే నెగటివ్ వాయిస్‌లు ఎక్కువయ్యాయి. కానీ ఆమె ఆలోచించిన విధానం, నిర్ణయాలపై అంకితభావం, వ్యూహాత్మక ఆలోచన – ఇవన్నీ కలిసి సమంతను తన మొదటి నిర్మాత అనుభవాన్ని విజయంగా మలచడానికి సహాయపడ్డాయి.
ఏదైమైనా నిర్మాణ పరంగా ఇది ఒక “కేస్ స్టడీ” లాంటి ప్రాజెక్ట్.
ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత నిర్మించిన తొలి చిత్రం 'శుభం'. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు నటించారు. సమంత అతిధి పాత్రలో మెరిసింది.
Next Story