సుదీప్ సారథి ఓటిటి మూవీ రివ్యూ!
x

సుదీప్ 'సారథి' ఓటిటి మూవీ రివ్యూ!

సారధి ( 'హెబ్బులి') అనేది పూర్తిగా సుదీప్ ఫ్యాన్స్ కోసం డిజైన్ చేసిన స్పెషల్ సర్వింగ్. ఎలాగో చదవండి





అడపాదడపా తెలుగులో కనిపించే సుదీప్‌కి ఇక్కడ ఓ మాదరి క్రేజ్‌ ఉందనే చెప్పాలి. 'ఈగ' సినిమాలో విలన్ పాత్రలో తన మేనరిజం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో తెలుగులోనూ ఆయనకు మాస్ ఫాలోయింగ్ మొదలైంది. ఆ తర్వాత 'బాహుబలి'లో చేసిన సీన్స్ , 'సైరా'లో ఒక సీరియస్ కామెయో— ఇవన్నీ ఆయనను తెలుగులో ఒక రెస్పెక్టబుల్ నటుడుగా నిలబెట్టాయి. దాంతో ఆయన కన్నడ సినిమాలు ఇక్కడ డబ్బింగ్ చేసి వదలటం మనవాళ్లు ఓ సంప్రదాయంగా పెట్టుకున్నారు. లేకపోతే 2017లో రిలీజైన సినిమాని ఇప్పుడు డబ్ చేసి ఓటిటిలో వదలటం ఏమిటి..ఎంత నమ్మకం లేకపోతే ఆ ధైర్యం చేస్తారు. ఇంతకీ ఈ సినిమా కథేంటి ,ఎలా ఉందంటంరా?

స్టోరీ లైన్

కెప్టెన్ రామ్ (సుదీప్) – ఇండియన్ ఆర్మీలో టాప్ para-commando. యుద్ధం అంటే అతనికో ఆట. దేశం కోసం ఏదైనా త్యాగం చేయడానికి రెడీ. ఒక హోస్ట్‌యేజ్ రిస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని, ఆ సమయంలో ఓ డాక్టర్ అయిన నందిని (అమలా పాల్) రక్షిస్తాడు. ఆ తర్వాత ఆమెతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇంతలో ఊహించని విషాదం…

రామ్‌ అంటే ప్రాణం పెట్టే అన్న సత్యమూర్తి (రవిచంద్రన్) ఆత్మహత్య చేసుకున్నట్టు వార్త. వెంటనే హోమ్ టౌన్‌కి వెళ్తాడు. వదిన (కావేరి)కి, ఆమె కూతురు రీతూని ఓదార్చి అండగా ఉంటాడు. కానీ రామ్ మనసు ప్రశాంతంగా ఉండదు. అన్న మృతిపై ఫొరెన్సిక్ రిపోర్టుల్లో కొన్ని క్లారిటీ లేకపోవడంతో అనుమానం కలుగుతుంది. దానికి తోడు తన అన్న ఫ్యాన్ కు ఉరిపోసుకుని చనిపోయే అంత పిరికివాడు కాదు. అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు.

ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది…

రామ్ ఇన్విస్టిగేషన్ మొదలుపెట్టేలోపే—ఒక దుర్మార్గుడైన రాజకీయ నాయకుడు అరసికేరె అంజప్ప (పి. రవిశంకర్), ఓ shady ఫార్మా కంపెనీ యజమాని అమృత్ షా (రవికిషన్), అతని క్రూరమైన తమ్ముడు కబీర్ (కబీర్ దూహన్ సింగ్) లాంటి డేంజరస్ మనుషుల గురించి తెలుస్తుంది.

దాంతో తన అన్న నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఏదైనా ఊహించని కుట్రకు బలయ్యాడా? ఇంకా లోతుగా ధర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో మరిన్ని దారుణ విషయాలు బయిటకు వస్తాయి.

సారధి (కన్నడంలో ‘హెబ్బులి’) – ఇది ఫుల్ యాక్షన్, ఫుల్ ఎమోషన్‌తో కూడిన revenge drama టర్న్ తీసుకుంటుంది. కెప్టెన్ రామ్‌కి ఇది పర్సనల్… అసలు నిజం బయటపెట్టే వరకూ అతడు ఆగడు! అని విలన్స్ కు తెలుసిపోతుంది. ఆ విలన్స్ ఎవరు......అసలేం జరిగిందనేది మిగతా కథ.

ఎనాలసిస్
ఇతర సుదీప్ సినిమాల్లాగే, సారధి( ‘హెబ్బులి’) కూడా ఒక మాస్ బ్యాంగ్‌తో స్టార్ట్ అవుతుంది — స్పష్టంగా ప్లాన్ చేసిన రిస్క్యూ ఆపరేషన్ సీన్‌తో. ఈ సీక్వెన్స్ చూస్తే… హాలీవుడ్ యాక్షన్ మూవీ Act of Valor గుర్తొచ్చేలా ఉంటుంది. దానికి తగ్గ స్టైల్, టెక్నికల్ ప్రెజెంటేషన్ ఉన్నా, అసలు కథలో ఉన్న 'రివేంజ్ థ్రిల్లర్' పొటెన్షియల్ మాత్రం పూర్తిగా వృథా అయింది. డైరెక్టర్ ఎస్ కృష్ణ, కథ కూడా తనే రాయడంతో — హిరోఎలివేషన్‌కి ఎక్కువ స్పేస్ ఇచ్చి, అసలైన ఎమోషన్, డ్రామా, థ్రిల్ అన్నింటినీ పక్కన పెట్టేశాడు.

ఒక రేంజ్‌లో స్టార్ట్ అయిన సినిమా… ఆ తర్వాతే మళ్లీ లైన్‌లోకి రాలేదు. ఎందుకంటే —హీరో తప్పించి వేరే దృష్టి లేదు. వేరే ఏ పాత్రకు డెప్త్ ఇచ్చే ప్రయత్నమే చేయలేదు, స్క్రీన్‌ప్లే వదిలేసారు. కథతో కనెక్షన్ లేకుండా పాటలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి. ఈ రకమైన నేరేషన్ చూసే వారి మీద పెద్ద బరువు వేసింది.

హీరో తెరపై కనిపిస్తే చాలు – స్టోరీ ఫ్లో మర్చిపోవచ్చు అన్నట్టు ఉంది. దీంతో, మొదటి 20 నిమిషాల్లో ఊపందుకున్న సినిమా… తర్వాత ఒక స్లో ఫ్రీ-ఫాల్‌లోకి జారిపోతుంది. అంటే సినిమా పూర్తిగా బాగాలేదా అనాలా? కాదు. సుదీప్ స్టైల్, మాసిలి యాక్షన్ ఫాన్స్‌కు సెట్ అవుతుందొచ్చు. కానీ ఓ బలం ఉన్న థ్రిల్లర్‌ను, "హీరోను దేవుడిలా చూపించాల్సిందే!" అనే మైండ్‌సెట్‌తో వృథా చేసిన ఉదాహరణ ఇది.

ఎవరెలా చేసారు

సుదీప్ మళ్లీ ఒక author-backed మాస్ పాత్రలో ప్రవేశించి, అది పూర్తిగా ఎంజాయ్ చేసినట్టు స్క్రీన్ మీద కనిపించడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఇంటెన్స్‌తో నిండిన పెర్ఫార్మెన్స్, అక్కడక్కడా వచ్చే పవర్‌పుల్ డైలాగ్స్‌తో బాగానే అనిపిస్తుంది. కానీ, దురదృష్టవశాత్తూ…ఇది దాదాపు ఎనిమేదేళ్ల క్రితం సినిమా. కాబట్టి ఆ పాత వాసనలు వస్తూంటాయి. ఇక అమలా పాల్ లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్‌ను దారుణంగా వృథా చేశారు. బాగా మిక్స్ చేసిన స్క్రిప్ట్‌లో ఆమె పాత్ర తలకిందులుగా – ఒక వైపు తీరికలేని ప్రేమ చూపిస్తూ, మరోవైపు లాజిక్‌కు దూరంగా వుంచారు.

అంతే కాదు, ఎక్కువ హీరో-సెంట్రిక్ సినిమాల్లో లాగే ఇక్కడ villains పూర్తిగా నలిగిపోతారు. పీ రవిశంకర్, రవికిషన్, కబీర్ దూహన్ సింగ్ లాంటి మంచి నటులను… స్క్రీన్ మీద ఓ రెండు డైలాగ్స్ చెప్పించి, తర్వాత హీరో చేతిలో దెబ్బలు తినే పనికే వాడినట్టు అనిపిస్తుంది. కథను నడిపించాల్సిన విలన్లు, ఇక్కడ తలలు పట్టుకునే తలలేని మనుషుల్లా మారిపోయారు.

ఇంకా… ఈ స్టైల్ సినిమాల్లో తప్పనిసరిగా వచ్చే బలహీన కామెడీ ట్రాక్. చిక్కన్న ఓసారి మళ్లీ ఎంటర్ అవుతాడు. అది వేరే రేంజ్ cringe.

ఫైనల్ థాట్

సారధి ( 'హెబ్బులి') అనేది పూర్తిగా సుదీప్ ఫ్యాన్స్ కోసం డిజైన్ చేసిన స్పెషల్ సర్వింగ్. సుదీప్ అభిమానులకు మాత్రం బాగా నచ్చుతుంది. కానీ… కంటెంట్, బలమైన కథ, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఆశించే ప్రేక్షకులు మాత్రం దీనికి దూరంగా ఉండటమే మంచిది.
ఎక్కడ చూడచ్చు

ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది.


Read More
Next Story