
విజయ్
జననాయగన్ నిర్మాత పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
తిరిగి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించిన అత్యున్నత ధర్మాసనం
జననాయగన్ సినిమా విషయంలో టీవీకే చీఫ్ విజయ్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వాలని కోరుతూ నిర్మాత వేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి మంజూరు చేయాలన్న సింగిల్ జడ్జీ ఆదేశాలను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈ పిటిషన్ లో సవాల్ చేశారు.
జననాయగన్ ను దళపతి విజయ్ తన చివరి సినిమాగా పేర్కొన్నారు. హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బెంగళూర్ కు చెందిన కెవిఎన్ ప్రొడక్షన్ దాదాపు రూ.500 కోట్లతో సినిమాను నిర్మించింది. పొంగల్ సందర్భంగా జనవరి 9న సినిమా విడుదల కావాల్సి ఉంది.
నిర్మాత వేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని జననాయగన్ నిర్మాతలకు సూచించింది.
జనవరి 20కి వాయిదా వేసిన డివిజన్ బెంచ్..
మద్రాస్ హైకోర్టులో కేసును విచారణ వేగాన్ని జస్టిస్ దీపాంకర్ దత్తా, అగస్టీన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం, సినిమా నిర్మాతలు తిరిగి హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని కోరింది.
నిర్మాతల తరఫున హజరైన సీనియర్ న్యాయవాదీ ముకుల్ రోహత్గీ.. సినిమా కాలానికి సంబంధించిన వస్తువు అని ఈ విషయం ఆలస్యం అయితే అది తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. కోర్టు దీనిని పరిగణలోకి తీసుకోలేదు. జనవరి 20న ఈ పిటిషన్ ను విచారించాలని సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టును ఆదేశించింది.
నిర్మాతల వాదన ప్రకారం.. జననాయగన్ చిత్రాన్ని 2025 డిసెంబర్ లోనే సర్టిఫికేషన్ కోసం పంపారు. కొన్ని సవరణల తరువాత సీబీఎఫ్సీ పరీక్షా కమిటీ యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది.
బోర్డు సూచించిన మార్పులను అంగీకరించిన నిర్మాతలు డిసెంబర్ 24న కొత్త వెర్షన్ ను సమర్పించారు. జనవరి 5న ఈ సినిమాకు ఫిర్యాదు వచ్చిందని, సీబీఎఫ్సీ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపారని నిర్మాతలకు సమాచారం ఇచ్చారు.
ఈ సినిమా మతపరమైన భావాలను దెబ్బతీసిందని సైన్యాన్ని తీవ్రంగా అవమానించే విధంగా చెడుగా చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జనవరి 9న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ సీబీఎఫ్సీని వెంటనే సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది. అదే రోజు సీబీఎఫ్సీ అప్పీల్ కు వెళ్లగా, డివిజన్ బెంచ్ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.
గత శుక్రవారం హైకోర్టు డివిజన్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది.
Next Story

