“కాంజ్యూరింగ్ 4” కలకలం : ఇండియన్ ఆడియన్స్ టేస్ట్ మారుతుందా?
x

“కాంజ్యూరింగ్ 4” కలకలం : ఇండియన్ ఆడియన్స్ టేస్ట్ మారుతుందా?

బాక్సాఫీస్ లెక్కల వెనుక షాకింగ్ ట్రెండ్!


భారత బాక్సాఫీస్ చాలా స్పీడుగా లెక్కలు మారిపోతున్నాయి. గత దశాబ్దం వరకూ ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను హీరోల స్టార్ పవర్, ఫ్యాన్ బేస్ డిసైడ్ చేసేవి. కానీ ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్స్ ప్రభావం, ప్రేక్షకుడి గ్లోబల్ ఎక్స్‌పోజర్, కంటెంట్‌పై అవగాహన కలిపి, ఆ లెక్కలన్నీ తారుమారు చేస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణ హాలీవుడ్ హారర్ “The Conjuring: Last Rites” భారత్‌లో 2 రోజుల్లోనే రూ.35 కోట్ల వసూళ్లు సాధించడం.

ఇది ఒక సాధారణ బాక్సాఫీస్ రికార్డ్ కాదు – మారుతున్న ప్రేక్షకాభిరుచి కి లైవ్ ఉదాహరణగా ట్రేడ్ విశ్లేషిస్తోంది. అయితే హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు ఇక్కడ పెద్ద హిట్ అవటం అనేది విశేషం కాదు. కొత్తేమీ కాదు. కానీ ఇక్కడ స్టార్స్ ,లోకల్ సినిమాలను సైతం ఈ హాలీవుడ్ హారర్ డబ్బింగ్ చిత్రం దాటేయటం చెప్పుకోదగ్గ విషయం. ట్రేడ్ ని కంగారుపెడుతున్న మేటర్. ఈ నేపధ్యంలో ఇండియన్ సినిమాలో ట్రేడ్ లో వస్తున్న మార్పులు ఏమిటనే చర్చ మొదలైంది.
* స్టార్ పవర్ నుండి కంటెంట్ పవర్‌కు షిఫ్ట్
గతంలో బాక్సాఫీస్‌ను స్టార్ హీరోల ఓపెనింగ్స్ డిఫైన్ చేసేవి. కానీ ఈ వారం “Ghaati” (అనుష్క రీ-ఎంట్రీ) డిజాస్టర్ కావడం, “Little Hearts” (లో-బడ్జెట్) విజయం సాధించడం ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పేస్తున్నాయి. అలాగే శివకార్తికేయన్ వంటి స్టార్, మురగదాస్ వంటి స్టార్ డైరక్టర్ ఉన్నా జనం పట్టించుకోకపోవటం జరిగింది. దాంతో “నేటి ఆడియన్స్ స్టార్స్ ని చూడటానికి కాదు, సినిమాటెక్ ఎక్సపీరియన్స్ కి డబ్బు చెల్లిస్తున్నాడు.” అనే ది ప్రూవైంది.
* గ్లోబల్ vs లోకల్ – ఎవరు గెలుస్తున్నారు?
అలాగే హిందీ నుంచి “Baaghi 4”, తమిళం నుంచి “Madhraasi” వంటి హై-ఆక్టేన్ యాక్షన్ సినిమాలు ఓకే వసూళ్లు సాధించినా, అవి “The Conjuring: Last Rites” హైప్ ముందు పూర్తి స్దాయిలో మసకబారాయి.
ఈ కొత్త బాక్సాఫీస్ ఎకానమీలో గమనించాల్సిన విషయం..
హాలీవుడ్ “Event Cinema” ఇమేజ్‌తో ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఇండియన్ సినిమాలు “ఫార్ములా లూప్”లో చిక్కుకుపోతున్నాయి.
* మలయాళ మ్యాజిక్ – సస్టెయిన్‌డ్ రన్స్‌కి న్యూ మోడల్
“Lokah” (కొత్త లోక) రూ.72 కోట్ల వసూళ్లతో నిరూపించినది ఏమిటంటే, వర్డ్-ఆఫ్-మౌత్ అనేది కొత్త బాక్సాఫీస్ ఆయుధం .
ఫిల్మ్ బడ్జెట్ చిన్నదైనా, కంటెంట్ ఆడియన్స్ మైండ్‌లో బాగా ఇంజెక్ట్ చేసి, కనెక్ట్ చేయగలిగితే — అది రోజువారీ వసూళ్లను స్టెబిలైజ్ చేస్తుంది.
* ఆడియన్స్ డిమాండ్: “గ్లోబల్ క్వాలిటీ, లోకల్ ఎమోషన్”
ప్రేక్షకుడు ఇప్పుడు OTT వల్ల గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అలవాటుపడ్డాడు. దాంతో, స్క్రీన్‌లోకి వచ్చిన లోకల్ కంటెంట్ కూడా అదే క్వాలిటీ ఎక్సపెక్టేషన్‌ను తీరవలసి ఉంటుంది. లేకపోతే, డైరెక్ట్‌గా “Reject” బటన్ నొక్కేస్తున్నారు.
భారత బాక్సాఫీస్ ఇప్పుడు ట్రాన్స్‌ఫర్మేషన్ ఫేజ్ లో ఉంది. “స్టార్స్ పుల్” యుగం తగ్గిపోతూ, “స్టోరీ పుల్” యుగం ప్రారంభమవుతోంది.
ఒక డిస్ట్రిబ్యూటర్ మాటల్లో: “భవిష్యత్తు బాక్సాఫీస్ లెక్కలు ఎవరు నటిస్తున్నారు అన్నదానిపైన కాకుండా, వారు ఏం అందిస్తున్నారు అన్నదానిపైన ఆధారపడి ఉంటాయి..”
ఇక ‘ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’ కాంజ్యూరింగ్ ఫ్రాంచైజ్‌లో నాల్గవ చిత్రం. మొత్తం కాంజ్యూరింగ్ యూనివర్స్‌లో 11వ చిత్రం. ఈ సినిమాలో పాపులర్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎడ్, లొరైన్ వారెన్‌ల చివరి కేసును ఆవిష్కరించారు మేకర్స్. హర్రర్ సినిమాలలోనే భయంకరమైన సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ ‘కాంజ్యూరింగ్’ ఫ్రాంచైజీలో చివరిది.
సెప్టెంబర్ 5న ఈ హర్రర్ మూవీ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ చివరి పార్ట్ హర్రర్ మూవీ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లో రిలీజ్ అవటం కలిసి వస్తోంది.


Read More
Next Story