సీరియల్ కిల్లర్ డైరీ
x

సీరియల్ కిల్లర్ డైరీ

స్పానిష్ సినిమా 'డైరీ' రివ్యూ


"ది డైరీ" అనేది ఒక స్పానిష్-మెక్సికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా . ఓల్గా ,ఆమె కూతురు వేరా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు.

విడాకుల కారణంగా ఓల్గా, తన కూతురు వేరాను తీసుకుని కొత్త ఇంటికి మారుతుంది. ఆ ఇంట్లోని పాత అటక మీద, ఒక సీరియల్ కిల్లర్ డైరీ ఓల్గాకు దొరుకుతుంది. ఆ డైరీని ఓల్గా చదువుతుంది. అందులో రాసిన విషయాలు నిజ జీవితంలో జరుగుతుండటాన్ని ఓల్గాకు భయాన్ని కలిగిస్తుంది. అంటే, ఆ డైరీ తనంతట తానుగా తిరిగి రాయబడుతోంది. ఈ వింత సంఘటనల వల్ల తనకూ, తన కూతురుకూ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఓల్గా భయపడుతుంది. ఈ మిస్టరీని పరిష్కరించడానికి, ఆమె తన కూతురి థెరపిస్ట్ కార్లోస్ సహాయం తీసుకుంటుంది. డైరీ ఆధారంగా, భవిష్యత్తులో కిల్లర్‌గా మారబోయేది తన కూతురు వేరానే అని ఓల్గా అనుమానిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

1) డైరీలోని సంఘటనలు భవిష్యత్తులో నిజం అయ్యే వాతావరణం కథలో ఉండటం.

2) సినిమా మొత్తం ఒక తెలియని భయం, సస్పెన్స్ తో ఉండటం.

మైనస్ పాయింట్స్

1)కథలో కొన్ని అతీంద్రియ అంశాలు గందరగోళంగా ఉండటం.

2) క్లైమాక్స్ ఇంకా గ్రిప్పింగ్ గా ఉంటె బావుండేది.

Read More
Next Story