
“ది గాడ్‌ఫాదర్” మళ్లీ తెరపైకి
4Kలో వెండితెర అద్బుతం, ఇండియాలో ప్రత్యేక రీ-రిలీజ్
సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కల్పితమైనా వాటిని నిజంగా జరిగిన కథలులాగ, అందులో సీన్స్ ని నిజ జీవిత సంఘటనలుగా జనం గుర్తు పెట్టుకుంటారు. అంతలా వారి జీవితాలపై ఆ సినిమాలపై ముద్ర వేస్తాయి. అలాంటి సినిమాల్లో అగ్రస్థానం ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల రూపొందించిన “ది గాడ్‌ఫాదర్” ట్రైలజీ. మార్లన్ బ్రాండో... విటో కొర్లియోన్ పాత్రలో కనిపించిన క్షణం నుంచి, అల్ పాచినో మైఖేల్‌గా క్రమంగా డెసిషన్ మేకర్ గా,తండ్రి స్దానంలోకి వచ్చే దాకా ఈ సినిమా బిగి సడలని స్క్రీన్ ప్లే తో ఓ అద్బుతమన నేరేషన్ తో ముందుకు వెళ్తూ మొదటి పార్ట్ మనలని మెస్మరైజ్ చేస్తుంది.
ఈ సినిమా కేవలం గ్యాంగ్‌స్టర్ డ్రామా కాదు— శక్తి, కుటుంబ బంధాలు, లోయాల్టీ, ద్రోహం, అధికారం యొక్క నైతికత పై ఒక సినిమాటిక్ సిద్ధాంత గ్రంథం .
ఇప్పుడు, ఆ లెజెండరీ ట్రైలజీ భారతీయ ప్రేక్షకుల ముందుకు మళ్లీ రాబోతోంది. PVR INOX అధికారికంగా ప్రకటించింది: రీస్టోర్డ్ 4K వెర్షన్ లో ప్రత్యేక రీ-రిలీజ్ .
The Godfather (1972) – సెప్టెంబర్ 12
The Godfather Part II – అక్టోబర్ 17
The Godfather Part III – నవంబర్ 14
ఈ షోలు ప్రీమియం థియేటర్లలో జరుగుతాయి. బుకింగ్ వివరాలు త్వరలోనే PVR INOX యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయి.
* ఈ సినిమా ఇప్పటికీ ఎందుకు అజరామరం?
“ I believe in America ” అనే వాక్యంతో మొదలైన ఈ సాగా, ఒక అమెరికన్ డ్రీమ్ ఎలా రక్తపు ఒప్పందాలు, కుటుంబ బంధాలు, శక్తి వ్యూహాలు మధ్య నలుగుతుందో చూపుతుంది. విటో కొర్లియోన్ మాట— “I’ll make him an offer he can’t refuse.” ఆనేది ఆయన పాత్ర ఎంత శక్తితో కూడుకుందో చెప్తుంది. హింస కాదు, నెగోషియేషన్ ద్వారానే శక్తిని చూపించే కొత్త నిర్వచనం. .
మైఖేల్ కొర్లియోన్ ఆర్క్ సినిమాకి హృదయం లాంటిది. మొదట కుటుంబానికి దూరంగా ఉన్న నిర్లక్ష్యంగా ఉండే కొడుకు, చివరికి “ It’s not personal. It’s strictly business. ” అని చెబుతూ పవర్ ని అందుకోవటం అలా గుర్తుండిపోతుంది. బాప్టిజం క్రాస్‌కట్ సీక్వెన్స్—పాపాన్ని తుడిచే క్రైస్తవ ప్రమాణాలు, అదే సమయంలో మైఖేల్ ఆజ్ఞతో జరిగే హత్యలు— సినిమా చరిత్రలోని అత్యుత్తమ మాంటేజ్‌లలో ఒకటి .
* ఎందుకింత సక్సెస్
‘ది గాడ్ ఫాదర్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడానికి కారణం స్క్రిప్ట్, క్యారెక్టర్స్, డైరెక్షన్... ఇలా ప్రత్యేకంగా ఏ ఒక్క అంశాన్నో చెప్పలేని పరిస్దితి. ప్రతీది ఓ అద్బుతంగా తీర్చి దిద్దినట్లు ఉంటుంది. ఈ చిత్రంలో మార్ల బ్రాండో ప్రధాన పాత్రధారిగా కనిపించారు కానీ సినిమాలోని ఏ క్యారె క్టరూ స్పెషల్ డిజైన్ చేయటంతో , మర్చిపోలేని రీతిలో ఉంటుంది.
‘ది గాడ్ ఫాదర్’ కెమెరామ్యా గోర్డా విల్లీస్, మ్యూజిక్ డైరెక్టర్ నినారోట, రచ యిత మారియో ప్యూజో, దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా.. వారి కెరీర్‌లో చాలా చిత్రాలు చేసి ఉండొచ్చు కానీ ‘ది గాడ్ ఫాదర్’కు కుదిరినట్లుగా వారి పనితనం మరే సినిమాకూ కుదర్లేదని విశ్లేషకలు చెప్తూంటారు!
* కుటుంబం, పవర్, నైతికత
విటో సూత్రం— “A man who doesn’t spend time with his family can never be a real man.” —కుటుంబం ఈ విశ్వంలో నైతిక కరెన్సీ అని సూచిస్తుంది. కానీ అదే కుటుంబం చివరికి మైఖేల్‌ను ఒంటరితనపు చీకటిలోకి నెడుతుంది.
‘ది గాడ్ ఫాదర్’ చిత్రాన్ని అమెరిక రచయిత మారియో ప్యూజో రాసిన ‘గాడ్ ఫాదర్ బుక్ ఆధారంగా తీశారు.
* ‘ది గాడ్ ఫాదర్’ కథేంటి
న్యూయార్క్ నగరానికి చెందిన డా విటో కోర్లియో (మార్ల బ్రాండో) తిరుగు లేని డాన్. తనను నమ్మిన ప్రజల కష్టాలు తీర్చే మంచి డాన్ గా పేరు పొందిన పాడు. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో ఎంతదూరం అయినా వెళ్లే ‘నేర చరిత్ర’ ఉన్న డాన్. విటోకి ముగ్గురు కొడుకులు, ఒక పెంపుడు కొడుకు, సలహాదారు టామ్ హేగ్ (రాబర్ట్ డువల్), ఒక కూతురు కాన్నీ (టాలియా షైర్) ఉంటారు. పెద్ద కొడుకు సన్నీ (జేమ్స్ కా), రెండోవాడు ఫ్రెడో (జా కజేల్), మూడోవాడు మైఖేల్ (అల్ పచీనో). సన్నీ, మైఖేల్ ...డాన్ తర్వాత చెప్పుకోదగ్గ వాళ్లు.
తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటాడు సన్నీ. మైఖేల్‌కి ఈ మాఫియా బిజినెస్ నచ్చదు. దాంతో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటాడు. అతని గర్ల్ ఫ్రెండ్ ఆడమ్స్ (డయానే కీట) కి తండ్రి నేర చరిత్ర చెప్పి, తాను అటువంటి వాడిని కాదంటాడు. పైగా తమ వ్యాపారాలను చట్టబద్ధం చేస్తానని ఆమెకు మాట కూడా ఇస్తాడు. అయితే శత్రు మాఫియా కుటుంబం అయిన టటాలియా మద్దతు మెండుగా ఉన్న సొలోజ్జో వల్ల కథ వేరే టర్న్ తిరుగుతుంది. సినిమా చివర్లో మైఖేల్‌నే అనుచరులు కొత్త డాన్ గా గౌరవిస్తారు. అతని చేతిని ముద్దాడటంతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది.
* క్రాఫ్ట్ – శాశ్వత లెజెండ్
గోర్డన్ విల్లిస్ సినిమాటోగ్రఫీ – చీకటిలో అర్థమయిన ముఖాలు = పవర్ ని అంతకు మించిన పవర్ గా చూపెడతాయి.
నినో రోటా సంగీతం – కుటుంబం, విషాదం, భయాన్ని మనకు గుర్తుండిపోయేలే చేస్తుంది
ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల–ప్యూజో రచన – గ్యాంగ్‌స్టర్ సినిమాని ఓ ఫిలాసఫికల్ డ్రామాగా మలచిన పాఠం.
* ఇండియాలో రీ-రిలీజ్ ఎందుకు స్పెషల్?
ప్రపంచ సినీమాకి ఇది ఒక ఫౌండేషన్ టెక్ట్స్ ఈ సినిమా. హాలీవుడ్లో The Sopranos , స్కోర్సేస్ చిత్రాలు, ఇండియాలో మణిరత్నం “నాయకన్” , రామ్ గోపాల్ వర్మ “సర్కార్” —అన్నీ ది గాఢ్ పాధర్ కు ప్రతిధ్వనులు. అయితే ఆ మ్యాజిక్ ని ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకులు పెద్ద తెరపై, అద్భుత 4Kలో, ఈ సాగాను చూసే అవకాశం పొందే అవకాసం వస్తోంది.
* ఎన్ని సార్లు చేసినా గాడ్‌ఫాదర్ గొప్పది ఎందుకంటే అది ‘గ్యాంగ్‌స్టర్’ కథ చెబుతూ, నిజానికి మనిషి–కుటుంబం–అధికారంకు చెందిన కథని అంతర్గతంగా చెబుతుంది.
ఈ రీ-రిలీజ్ కేవలం ఒక క్లాసిక్‌కి గౌరవం కాదు. ఇది చరిత్ర పునర్జన్మ .
ఈ సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకూ, భారతీయ థియేటర్లు కొర్లియోన్ సాగా ని మరోసారి ప్రతిష్టించనున్నాయి.
“గాడ్‌ఫాదర్” మళ్ళీ తెరపైకి రావడం = సినీప్రియులకు ఒకే ఒక్క అవకాశం. ఇది రీ-రిలీజ్ కాదు, ఒక చరిత్రాత్మక పునరాగమనం.